Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భేష్..! ఒక్కసారి ఈ కరోనా ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లను చూడండి..!

June 10, 2021 by M S R

నిజమే… దేశమంతా వినిపిస్తున్న విమర్శ నిజమే… మెయిన్ స్ట్రీమ్ మీడియా.., పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు… కరోనా మీద ప్రజలను బెంబేలెత్తించేవి, ధైర్యాన్ని చంపేసేవి, ఆందోళనకు గురిచేసేవి, అబద్ధాలతో హోరెత్తించే భీకరమైన వార్తలకే ఇంపార్టెన్స్ ఇస్తోంది… నెగెటివిటీని వ్యాప్తి చేస్తోంది… కానీ పాజిటివిటీని పెంచే వార్తల్ని ఇగ్నోర్ చేస్తోంది… చిన్న చిన్న అంశాలు కూడా కొన్నిసార్లు ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాయి… ఆశను కలిగిస్తాయి… వ్యవస్థ మీద, సమాజం మీద, భవిష్యత్తు మీద నమ్మకాన్ని పెంచుతాయి… ఉదాహరణకు ఒక వార్త చూద్దాం… అది ఇక్కడెక్కడో కాదు… అల్లం దూరాన ఉన్న ఆ లడఖ్ గుట్టల్లో, కొండల్లో, నదుల్లో, ప్రవాహాల్లో… కరోనా హెల్త్ వర్కర్స్‌కు సంబంధించిన వార్త…

covid jcb

ఒకచోట హెల్త్ వర్కర్స్ ఓ ప్రవాహాన్ని దాటాలి, అదేమో ఉధృతంగా ఉంది… లోతు కాదు సమస్య, దాటడం సమస్య… ఓ జేసీబీ తొట్టెలో కూర్చుని, ఆ ప్రవాహాన్ని దాటారు… చూశారుగా ఫోటో… పీపీఈ కిట్లతో కూర్చున్నారు ఇద్దరు వర్కర్స్… అది కమిట్మెంట్… ఇందులో అంత పెద్దగా అభినందించేది ఏముంది అనకండి… అది వృత్తి పట్ల నిబద్ధత… దేశమంతా ఆశా వర్కర్లు, నర్సులు, అంగన్‌వాడీ వర్కర్లు, పారిశుధ్య కార్మికుల దగ్గర నుంచి పెద్ద పెద్ద డాక్టర్ల దాకా చాలామంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ బాగా వర్క్ చేస్తున్నారు… కానీ దేనికదే… దీనికి దక్కాల్సిన దీనికీ దక్కాలి… సోషల్ మీడియా అంటే ఎంతసేపూ ట్రోలింగే కాదు, తమకు కనెక్టయిన అంశాలను విపరీతంగా ఓన్ చేసుకుంటుంది…

Ads

Salute to our #CovidWarriors.

A team of #Covid warriors crossing river to render their services in rural Ladakh.

Stay Home, Stay Safe, Stay Healthy and Cooperate the Covid Warriors. pic.twitter.com/cAgYjGGkxQ

— Jamyang Tsering Namgyal (@jtnladakh) June 7, 2021

లడఖ్ ఎంపీ జామ్‌యాంగ్ సేరింగ్ ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ హేట్సాఫ్ అని ప్రస్తుతించాడు… గుడ్, ఎంపీ నుంచి సరైన స్పందన… ఈ సంస్కారం ఎందరికి ఉందనే ప్రశ్న వదిలేయండి… ఆ ట్వీట్‌ను నెటిజనం ఆనందంగా స్వీకరించింది, అభినందించింది… చప్పట్లు కొట్టింది… ఆ ఫోటోలో ప్రవాహం, జేసీబీ, పీపీఈ కిట్లతో కూర్చున్న వర్కర్స్… ఆ ఫోటో హృద్యంగా ఉంది… లేరా..? ఉన్నారు..! ప్రతిచోటా ఉన్నారు, తమ శక్తికి మించి వర్క్ చేస్తున్నారు, కరోనా పీడదినాల్లో వాళ్లందరూ పనిచేస్తున్నారు కాబట్టే అదుపులోకి వచ్చింది… లేకపోతే ఇంకెలా ఉండేదో దురవస్థ… ఇలాంటి పాజిటివిటీని వ్యాప్తి చేసే చిన్న చిన్న వార్తలకూ విలువ ఎక్కువ, ప్రభావం ఎక్కువ… ఒక్కసారి కళ్లుమూసుకుని… మన టీవీ చానెళ్లలో, మన పత్రికల్లో జనంలో భరోసాను నింపే ఇలాంటి వార్తలు ఎన్ని చదివారు, ఎన్ని చూశారు గుర్తుచేసుకొండి… నిరాశే మిగిలింది కదా… అవును, మన మీడియా తీరు ఈ కోణంలో తీవ్ర నిరాశాజనకంగా ఉంది… నిరాశనే నింపేదిగా ఉంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions