Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఐఐటీ నుంచి, ఐఐఎం మీదుగా… క్రమేపీ ఓ సరికొత్త ఆధ్యాత్మిక పంథాలోకి…

March 28, 2024 by M S R

creation of new humanity througu intelligent spirtuality… ఓ ఐఐటీయన్, ఓ బిజినెస్ మెనేజ్మెంట్ స్టూడెంట్ మాంక్ గా మారి చెబుతున్న కథ!

జీవితానికీ… జీవితంలో ఎదుగుదలకూ ఓ సాచ్యురేషన్ పాయింట్ ఉంటుంది. ఎదుగుతున్నకొద్దీ ఇంకేదో అందుకోవాలన్న ఆసక్తి కొందరికుంటుంది. పీక్ లెవల్ కు చేరాక కూడా ఎదిగేందుకు ఇంకెంతో మిగిలి ఉన్నా.. ఎదుగుదలకు ఆకాశమే హద్దనే అవగాహన కల్గి ఉన్నా.. కొందరిలో ఓ సాచ్యురేషన్ పాయింట్ వారిని పూర్తి కాంట్రాడిక్టరీగా.. అప్పటివరకూ వారి జీవితం సాగిన తీరుకు భిన్నంగా మారుస్తుంది. అలాంటి వ్యక్తి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఢిల్లీలో ఐఐటీ … అహ్మదాబాద్ లో ఐఐఎమ్ చేసి… ఇటు స్వదేశంలో, అటు విదేశంలో ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చినా లైట్ తీసుకుని.. చివరకు ఓ సన్యాసిగా మారిన ఆ చదువరి జర్నీ వెరీ ఇంట్రెస్టింగ్.

జస్ట్ మా పిల్లవాడు ఇంజనీర్ అయితే చాలు.. సాఫ్ట్ వేర్ లో సెటిలైతే సరిపోతుంది.. మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే ఇంకా సంతోషమనుకునే కుటుంబాలు, తల్లిదండ్రులెందరో. ఆ క్రమంలో ఇంటర్ పూర్తి చేసి బీటెక్ కోసం తాపత్రయపడుతూ పోటీ పరీక్షలు రాసేవారెందరో. అందులో ఐఐటీ కల నెరవేర్చుకోవాలనుకునేవారూ ఉన్నా… ఐఐటీ జేఈఈలో ఉత్తర్ణీత సాధించడం అంత మాములు విషయం కాదు. ఒకవేళ అందులో సెలక్టైతే.. ఆ తర్వాత వారికి ఉద్యోగాలు క్యూ కడతాయి. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ఎర్రతివాచీ పరుస్తాయి. విదేశాల్లో బోలెడన్ని ఆఫర్స్ వస్తాయి. అలాంటిది.. ఢిల్లీలో ఐఐటీతో పాటు… అహ్మదాబాద్ ఐఐఎం వంటి ప్రఖ్యాత బిజినెస్ మేనేజ్ మెంట్ స్కూల్ లో చదువు పూర్తి చేసిన ప్రశాంత్ త్రిపాఠి.. ఇప్పుడవన్నీ వదిలేసి ఆచార్య ప్రశాంత్ గా.. ఓ అద్వైత గురువుగా మారాడు.

Ads

చిన్నప్పుడు ఓ పోకిరీగా ఉన్న ప్రశాంత్ ఏమైపోతాడో అని తల్లిదండ్రులు భయపడేవారట. అతను అరాచకాలను ఇప్పటికీ ఆయన స్నేహితులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు కూడా. కానీ, తర్వాత్తర్వాత ప్రశాంత్ ప్రజ్ఞ చూసి స్కూల్స్ లో, కళాశాలల్లో ముచ్చటపడేవారు. అలా మదర్ క్వీన్ గా తన కొడుకు పతకాలు, ప్రశంసలందుకున్నప్పుడు ఎంత ప్రౌడ్ గా తన తల్లి ఫీలయ్యేదో ఆమె పలుమార్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్ భాషలతో కమ్యూనికేషన్స్ స్కిల్స్… భావవ్యక్తీకరణతో పాటు.. మేథమెటిక్స్, సైన్స్ లో ప్రశాంత్ బ్రిల్లియన్స్ ను చూసి టీచర్స్ కూడా ముచ్చటపడేవారు.

అలాంటి ప్రశాంత్ త్రిపాఠి మానవ జీవితాల్లోని వైరుధ్యాలు, జంతు హింస, పర్యావరణం ఇలాంటి ఎన్నో అంశాల పట్ల సీరియస్ గా ఆలోచిస్తూనే.. తన ఎన్జీవోను ప్రారంభించాడు. పేదలకు తనకు వచ్చిన చదువు చెబుతుండటంతో పాటు.. గ్రాడ్యుయేట్స్ కు మేథమెటిక్స్ చెప్పేవాడు. కానీ, సరిగ్గా 28 ఏళ్ల వయస్సులో ఆయన తాను చదివిన చదువులకు ఫుల్ స్టాప్ పెట్టి… ఓ మాంక్ గా కొత్త జీవితాన్ని ఆరంభించాడు. creation of new humanity througu intelligent spirtuality అనే కాన్సెప్ట్ తో ఆధ్యాత్మిక గురువుగా అవతరించాడు.

ఇప్పుడు తను చదివిన చదువులన్నీ తన మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకున్నా.. ఇప్పుడాయన బోధించేవి.. 17 రూపాల్లోని గీత, 60 రూపాల్లోని ఉపనిషత్తుల సారాంశమేనంటే నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. అంతేకాదు.. ప్రశాంత్ అద్వైత్ ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. జంతు హక్కుల కార్యకర్తగా కూడా ప్రశాంత్ సుపరిచితుడు.

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన ప్రశాంత్ త్రిపాఠీ ముగ్గురన్నదమ్ముల్లో పెద్దవాడు. ఢిల్లీ ఐఐటీలో బీటెక్ గ్రాడ్యుయేషన్, అహ్మదాబాద్ ఐఐఎంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి… ఇప్పుడు స్పిర్చువల్ గురువుగా రూపాంతరం చెంది.. పలు ఆధ్యాత్మిక రచనలు చేస్తున్నాడు. కర్మ పేరుతో… Why Everything You Know About It Is Wrong అంటూ ఆయన చేసిన రచన జీవనసారాన్ని ఒడిసిపట్టేది.

తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మిగిలిన ప్రపంచానికి పంచాలన్న ఒకే ఒక్క బలమైన కాంక్ష ఇప్పుడు అంతటి చదువరి ప్రశాంత్ త్రిపాఠీని ఆధ్యాత్మిక బోధకుడిగా, ఓ ప్రవరగా మార్చేసింది. అయితే, ప్రశాంత్ త్రిపాఠీ అద్వైత గురువుగా తన ప్రవచనాలను ఏ కొందరు భక్తులకో, ఆధ్యాత్మిక వాదులకో మాత్రమే పరిమితం చేయలేదు. తన భాష్యాలు ఇప్పుడు తాను చదివిన ఐఐటీ, ఐఐఎంలలో కూడా కీలక ఉపన్యాసాలు మరి. మొత్తంగా మానవుడు తనను తాను సంస్కరించుకునే విధమైన బోధనలే స్పిర్చువల్ గురు ప్రశాంత్ త్రిపాఠీ ప్రత్యేకత….. By రమణ కొంటికర్ల 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions