అమ్మో, ట్రోలర్స్ అని సెలబ్రిటీలు ఉలిక్కిపడుతుంటారు… వణికిపోతుంటారు… ఎందుకు..? వాళ్లు చాకిరేవు పెట్టేస్తుంటారు కాబట్టి… వాళ్ల నాసిరకం పోకడల్ని బట్టలిప్పి చూపిస్తారు కాబట్టి… అఫ్ కోర్స్, ట్రోలర్స్‌లో అధికశాతం స్వార్థం, అజ్ఞానం, దురుద్దేశపూరితం… కానీ కొందరు ఉంటారు… వాళ్ల ట్రోలింగ్ సొసైటీకి మంచిదే… కావచ్చు, ఆ ట్రోలింగ్ వాళ్లకు ఉపాధి మార్గం కావచ్చు, వాళ్లకు భాష సరిగ్గా తెలియకపోవచ్చు… కానీ ఓ కంటెంటును చీల్చిచెండాడేలా, రకరకాల సంబంధిత క్లిప్పులు వెతికి, ఎడిట్ చేసుకుని, ఒక్క దగ్గర క్రోడీకరించి, ఓ లైన్‌లో అమర్చి, ఓ కొత్త విమర్శ పంథాకు ప్రాణాలు పోస్తున్నారు… మెయిన్ స్ట్రీమ్ ఎప్పుడూ టీవీలకు, సినిమాలకు దాసోహం… ఒక్కడికీ ఓ నిష్పాక్షిక విశ్లేషణ చేతకాదు, ఆ సంకల్పమూ ఉండదు… వాళ్లిచ్చు ముష్టి యాడ్స్ డబ్బుల కోసం కక్కుర్తే కదా మరి… ఇప్పుడు వెబ్‌సైట్లకూ డబ్బులు పారేస్తున్నారు ప్రకటనకర్తలు, వాటి పక్షపాత ఏజెన్సీలు… మళ్లీ అన్నింట్లో భారీ కమీషన్ల బాగోతం…
ఈ స్థితిలో నిజం చెప్పాలంటే… యూట్యూబ్ వీడియో ట్రోలర్స్ కొందరు తమ క్రియేటివిటీతో ఆకట్టుకుంటున్నారు… వాళ్లను జనం ఈసడించుకోవడం లేదు… ఎందుకంటే, వాళ్లు చెప్పిన దాంట్లో నిజం ఉంటున్నది కాబట్టి… సోకాల్డ్ టీవీ, సినిమా క్రియేటర్స్ ఉడుక్కుని చస్తుంటారు, తిట్టిపోస్తుంటారు… ‘‘భారీ కవరేజీ’’ విలేకరులు తప్ప వాళ్లకు ఇంకెవరూ తెలియదు కాబట్టి… తమ రోగాల్ని బట్టలిప్పి చూపించేవాళ్లు ఈ ట్రోలర్సే కాబట్టి… అయితే రొడ్డకొట్టుడు ట్రోలింగ్ కాదు, అందులోనూ ఓ క్రియేటివిటీ అవసరం… ఏ క్లిప్ దగ్గర ఏ సినిమా బిట్ వాడాలో వాళ్లకు బాగా తెలుసు… ఏ రెండు నిమిషాల వీడియోనో చూస్తే ప్రేక్షకుడికి మొత్తం తలకెక్కుతుంది… వాళ్లకు సూపర్ స్టార్లు, సూపర్ సెలబ్రిటీలు అనే తేడా తెలియదు… ఓ పాయింట్ పట్టుకుని ఉతికి ఆరేశామా లేదానేదే ప్రధానం…
Ads
https://www.youtube.com/watch?v=eiuX5b-9ASk
ఈ వీడియో చూశారు కదా… పది లక్షల వ్యూస్ ఉన్నయ్… అంటే ప్రేక్షకజనం యాక్సెప్ట్ చేసినట్టే కదా… ఉత్త బేకార్ ట్రోలింగ్ అయితే ఆ రేంజులో జనం చూసేవాళ్లు కాదు కదా… అసలు ఇదేకాదు, బోలెడు ట్రోలింగ్ వీడియోలు… పక్కాగా ట్రోలర్స్‌మి అని చెబుతూ యూట్యూబుకెక్కుతున్నయ్… రియల్ పోస్ట్ మార్టమ్ చేస్తున్నయ్… నిజంగానే ఈటీవీ రోజురోజుకూ ఓ అశ్లీల టీవీ చానెల్ అయిపోతోంది… జబర్దస్త్ అనబడే ఓ చెత్తా కామెడీ షో అందరికీ చాన్నాళ్లుగా తెలుసు… ఇక ఢీ, శ్రీదేవి డ్రామాకంపెనీ తదితరు కార్యక్రమాల్ని కూడా బూతుమయం చేస్తోంది… ముద్దులు, బుగ్గలు కొరకడాలు, అక్రమ సంబంధాల ముచ్చట్లు, బూతు డాన్సులు, వెకిలి కామెడీ… వాట్ నాట్..? ఈటీవీ అంటేనే ఓ మిడ్ నైట్ మసాలా… దానికితోడు ఆ స్టార్ మాటీవీ వాడు తయారయ్యాడు… మరి అక్కడా ఈ అవినాషులు, ఈ చమ్మక్ చంద్రలు, ఈ శేఖర్ మాస్టర్లే కదా… దీనికితోడు ఇద్దరు సెలబ్రిటీలు పట్టుకురావడం, పెళ్లి చేయడం, లవ్వు బంధంలో కృత్రిమంగా ఇరికించడం… నిన్న ఏదో టీవీలో శ్రావణమాసం వచ్చిందమ్మా అని ఓ స్పెషల్ ప్రోగ్రాం వచ్చింది… నాలుగైదు పిచ్చి ఎపిసోడ్లతో పాటు అరగంటపాటు ప్రియ-మధు అనే ఓ టీవీ జంటకు మళ్లీ పెళ్లి చేసి, అదే క్రియేటివ్ ప్రజెంటేషన్ అనేశారు… సిగ్గులేదు, ఆ క్రియేటివ్ టీంకు…! దానికితోడు శ్రీముఖి కయ్యకయ్య ఒర్లుడు సరేసరి… సో, ట్రోలింగు అన్నివేళలా తప్పుకాదు… తెలుగు టీవీల పట్ల అది తప్పు అసలే కాదు…!!
Share this Article