క్రూ… టిల్లూ స్క్వేర్… రెండూ ఇప్పుడు ఫుల్ సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతున్న సినిమాలు… ఒకటి తెలుగు, రెండోది హిందీ… టిల్లూ సిద్ధు లక్ బావుంది, డీజే టిల్లూకు సీక్వెల్ బాగా కుదిరింది… ప్రత్యేకించి వన్ లైనర్స్ భలే పేలాయి… మార్కెట్‌లో పెద్దగా హిట్టయిన సినిమాలు కూడా వేరే లేవు… దాంతో దున్నేస్తున్నాడు… 3 రోజుల్లో 65 కోట్ల కలెక్షన్స్… ఈ దెబ్బకు సిద్ధూ స్టార్ హీరో అయిపోయాడు… ఒకింత చిల్లర్ పాత్ర చేసినా సరే అనుపమకూ గిరాకీ పెంచిన సినిమా…
ఫ్యామిలీ స్టార్ పేరిట విజయ్ దేవరకొండ సినిమా వస్తోంది… బాగా అంచనాలున్నయ్ ఆ సినిమా మీద… కాకపోతే విజయ్ కొన్నాళ్ల సినిమాలు తనకు పెద్దగా అచ్చిరాలేదు… నేల మీద నిల్చుని ఉన్నాడు ప్రస్తుతం… ఫ్యామిలీ స్టార్ తన కెరీర్‌కు చాలా ముఖ్యం… ఒకవేళ ఆ సినిమా గ్రహపాటున సక్సెస్ టాక్ తెచ్చుకోలేకపోతే… టిల్లూ సిద్ధూ గారెల బుట్టలో పడ్డట్టే… సమీపంలో మరో పెద్ద సినిమా ఏదీ లేదు… (మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలో హిట్, తెలుగులో వస్తోంది…) ఉన్నంతలో కాస్త నవ్వుకుని రాగలిగిన సినిమా టిల్లుయే కాబట్టి కలెక్షన్లు అనూహ్యంగా పెరగొచ్చు కూడా…
సేమ్, హిందీలో క్రూ… హిందీ మార్కెట్‌లో కూడా పెద్ద హిట్టయిన సినిమాలు వేరే లేవు… ఇంతకీ సినిమా ఎలా ఉందీ అంటారా..? జితేంద్ర బిడ్డ ఏక్తాకపూర్ ఓటీటీలో కంటెంట్ మీద ఐడియా ఉందా మీకు..? క్రూడ్ సీన్లు, క్రూడ్ కామెడీ, క్రూడ్ రొమాన్స్, క్రూడ్ లాంగ్వేజీ ఎట్సెట్రా… ఎస్, అదే కాస్త క్రూ బాపతు సినిమా ఈ ‘క్రూ’ కూడా… కాకపోతే సేమ్ టిల్లూ స్క్వేర్ తరహాలో వన్ లైనర్స్ మీద కాన్సంట్రేషన్ ఉంటుంది… బాగా పేలాయి కూడా…
Ads
అంటే, దీన్ని కూడా ఏక్తాకపూర్ ఓటీటీలో చూసేయొచ్చా..? చూడొచ్చు… కానీ ఇటీవల ఓటీటీ వీక్షణం తగ్గి ప్రేక్షకులు థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ కోరుకుంటున్నారు కదా, సో, ఇది కూడా 3 రోజుల్లో 65 కోట్లు కలెక్ట్ చేసింది కదా… ఈజీగా 100 కోట్లు దాటేస్తుంది… ఇది కూడా సేమ్ టిల్లూ స్క్వేర్‌లాగే సీరియస్ సినిమా కాదు, పెద్దగా ఎమోషన్సూ మన్నూమశానం ఏమీ ఉండవు… లైట్ గోయింగ్, లాజిక్కులు నై చల్తా… ఓన్లీ మ్యాజిక్కులు.,. ఆడియెన్స్ కూడా అదే కోరుకుంటున్నట్టున్నారు…
ముగ్గురు ఫ్లయిట్ అటెండెంట్లు… వారి వయస్సులు వరుసగా 50, 40, 30… వీటికి తగ్గట్టే టబు, కరీనా, కృతిలను తీసుకున్నారు… కామెడీ టైమింగులో వీళ్ల శృతి బాగా కుదిరింది… రకరకాల నేపథ్యాలు వాళ్లవి… టబు మాజీ అందాల రాణి, 20 ఏళ్ల సర్వీస్… భర్త పాత్రను స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ పోషించాడు… వీళ్లకు గోవాలో రెస్టారెంట్ పెట్టేసుకుని స్థిరపడాలని ఆశ… న్యూరో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆమెకు…
మరో పాత్రను కరీనా పోషించింది… విడిపోయిన తల్లిదండ్రుల నేపథ్యం… ఓ సొంత మార్కెటింగ్ కంపెనీ పెట్టుకుని సెటిల్ అయిపోవాలనేది కాంక్ష… ఇంకోపాత్ర కృతి సనన్… యంగ్… పైలట్ కావాలనుకునీ కాలేకపోయిన నేపథ్యం,,. కొంచెం దూకుడెక్కువ.., వాళ్లు సర్వీస్ చేస్తున్న కోహినూర్ ఎయిర్‌లైన్స్ (విజయ్ మాల్యాను పోలిన పేరు ఉంటుంది దీని ఓనర్‌కు…) త్వరలో దివాలా తీస్తుందని ఓ రూమర్, వీళ్లకు పని ఎక్కువ, జీతభత్యాలు తక్కువ… పైగా ఉద్యోగం మీద అభద్రత… వాళ్లు ముగ్గురూ ఉన్న ఓ ఫ్లయిట్‌లో హఠాత్తుగా ఒకాయన కొలాప్స్ అవుతాడు, తన చొక్కా కింద బంగారు కడ్డీలుంటాయి… వాటిని కొట్టేసి లైఫులో సెటిలైపోదామని అనుకుంటారు వీళ్లు… ఆ తరువాత పరిణామాలే సినిమా కథ…
బాగుంది సరదాగా…! కృతికన్నా కరీనా, టబు సీనియర్స్, ‘సో, తమ పాత్రల్ని అలవోకగా చింపేశారు… నిజానికి ఈ రేంజ్ కలెక్షన్స్ నిర్మాత ఏక్తాకపూర్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండదు… అలా క్లిక్కయిపోయింది… టిల్లూ స్క్వేర్, క్రూ చెబుతున్న సత్యం ఏమిటంటే… భారీ తారాగణం, భారీ ఖర్చు, భారీ హంగామా ఎట్సెట్రా ఏమీ అక్కర్లేదు, సినిమా రెండు గంటలపాటు థియేటర్‌లో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలిగితే చాలు, చిన్న సినిమాలూ పెద్ద సక్సెస్ అందుకుంటాయి…!!
Share this Article