ఎంత దరిద్రగొట్టు సినిమా అయినా సరే… ఎంత నేలబారు సినిమా అయినా సరే…… ఒక పాటో, ఒక మాటో, ఒక సీనో కాస్త బాగుంది అనిపిస్తుంది… ఎడిటింగో, నేపథ్యసంగీతమో, కెమెరాయో పర్లేదు అనిపిస్తుంది… ఫలానా సీన్లో కనిపించే ఆ పది మందిలో ఒకడి మొహంలో కాస్త ఎమోషన్స్ కనిపిస్తున్నాయి అనిపించవచ్చు… చివరకు టైటిల్స్ వేసే పద్ధతైనా వచ్చవచ్చు… అరె, శుభం అని వీడు భలే చమత్కారంగా వేశాడే అని కూడా అనిపించవచ్చు….. కానీ మచ్చుకు ఒక్కటంటే ఒక్కటీ నచ్చని సినిమా తీయడం చాలా కష్టం… ఒక సినిమా ఎలా ఉండకూడదు అని చెప్పేందుకు ఉదాహరణగా… 24 క్రాఫ్ట్స్‌లో ఒక్కటీ కుదరకుండా… కుదురుగా ఒక్క సీనూ సరిగ్గా తీయకపోవడం అనేది అసాధ్యం అనుకునేవాళ్లం… కానీ గ్రేట్… రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రవిబాబు దాన్ని చేసి చూపించాడు… రెండు దశాబ్దాలుగా ఫీల్డులో ఉండి, ఇలాంటి అరుదైన సినిమా తీయగలగడం నిజంగా గ్రేట్… ఇంకెవరికీ చేతకాదు…
అంతటి వర్మ అనేవాడే భ్రష్టుపట్టిపోయాడు… చూస్తూనే ఉన్నాం కదా ఒక్కో సినిమాకు ఎంత దిగజారిపోతున్నాడో… నికృష్టమైన సినిమా నిర్మాణమే లక్ష్యంగా బతుకుతున్నాడు… తొడలు, బొడ్డు, చంకలు, షేపులు… అదొక్కటే తన గురి ఇప్పుడు… అసలు ఎంఎస్‌రాజు వంటి నిర్మాత డర్టీ హరి అనే బూతు సినిమాతో ఏ రేంజ్‌కు దిగజారిపోయాడో చూడలేదా..? అలాంటోళ్లు బోలెడు మంది… రవిబాబు పెద్ద మినహాయింపేమీ కాదు… అసలు తన అరంగేట్రం సినిమా అల్లరితోనే రవిబాబు టేస్ట్ ఏమిటో తెలిసిపోయిందిగా అందరికీ…! ఇప్పుడు క్రష్ అనే సినిమా… ఏదో జీ5 ఓటీటీలో విడుదల చేశాడు… తెలుగు ప్రేక్షకులు బతికిపోయారు… థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే, పొరపాటున ఎవరైనా వెళ్లి ఉంటే… హహాకారాలతో థియేటర్లు దద్దరిల్లిపోయేవేమో… ఓ డౌట్… రవిబాబు విడుదలకు ముందు ఫైనల్ ఔట్పుట్ చూసి ఉంటాడా..? నెవ్వర్, చూసి ఉంటే తనే సిగ్గుతో చితికిపోయేవాడు… నేనేనా ఇలాంటి సినిమా తీసింది అని…!!
Ads
అసలే కథే ఓ దరిద్రం… అమెరికాకు వెళ్లాలనుకు కుర్రాళ్లు వర్జినిటీ కోల్పోయే ప్రయత్నాలే కథ… నటీనటుల నటన దగ్గర్నుంచి కథ, కథనం, సంగీతం, పాటలు, మాటలు, సీన్ల క్రియేటివిటీ… ఒక్కటేమిటి… ప్రతిదీ ట్రాష్… అదే రవిబాబు క్రష్… చివరకు ఆ పేరు ఎందుకు పెట్టాడో కూడా తెలియనంత ఆప్ట్లెస్… (CRRUSH అని రెండు ఆర్లు పెట్టడం దేనికో… ఎవడైనా పనికిమాలిన జ్యోతిష్కుడు సంఖ్యాశాస్త్రం ప్రకారం చెప్పాడా..?) నిజానికి అల్లరి తరువాత రవిబాబు అనసూయ, అమరావతి, నచ్చావులే తీశాడు, పర్లేదు అనిపించుకునే బాపతు… ఇక ఆ తరువాత మనసారా, నువ్విలా, అవును, లడ్డుబాబు, అవును-2, అదుగో, ఆవిరి… పదేళ్లుగా పల్టీలు కొడుతూనే ఉన్నాడు… చివరకు క్రష్‌తో బొక్కబోర్లా పడిపోయాడు… నాలో క్రియేటర్ చచ్చిపోయాడురో అని తెలుగు జనానికి ఇలా చాటిచెప్పుకున్నాడు… నిజానికి జీ5 వాడి కంటెంటు ఒకసారి గమనిస్తే మొత్తం ఇలాంటిదే… ఆమధ్య సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చాడు, మొత్తం ఇలాంటి సీన్లే… ఓటీటీ యాప్స్ అంటే కేవలం బూతు, అశ్లీలం, అసభ్యం మాత్రమే అనుకునే దరిద్రమైన క్రియేటివ్ హెడ్స్ ఉన్నట్టున్నారు జీ5లో… అందుకే తమ టేస్టుకు తగ్గట్టు కనిపించి ఈ క్రష్ సినిమాను వెంటనే కొనేసి ఉంటారు… భలే దొరికారురా…!!
Share this Article