.
Pardha Saradhi Upadrasta …. రానున్న 48 గంటలు అత్యంత కీలకం –మధ్యప్రాచ్యం మండి పోతోంది.
.
Ads
అన్ని సంకేతాలు ఒకే దిశగా చూపిస్తున్నాయి… దేశాల అత్యున్నత హెచ్చరికలు
భారత్ | అమెరికా | యుకె | కెనడా | ఆస్ట్రేలియా దేశాలు అన్నీ ఇరాన్ మీద Level–4 Travel Warning,
“ఇప్పుడే దేశం విడిచిపెట్టండి”…, ఇరాన్ లో వారి వారి రాయబార కార్యాలయ సేవలు నిలిపివేత…
ఇది సాధారణ అలర్ట్ కాదు. దాడి గంటలు/రోజుల్లో జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సంకేతం. ప్రత్యేకంగా ఇరాన్ విషయంలో పరిస్థితి అత్యంత తీవ్రం.
ఇరాన్‌లో సంపూర్ణ కమ్యూనికేషన్ బ్లాక్ (నిన్నటి నుంచే)
నిన్న ఇరాన్ పాత యువ రాజు ఇరాన్ ప్రజలకు కదలండి, కదలండి, అంతా బయటకు రండి, ఇదే మన చివరి సమరం అనే ఒక్క పిలుపు ఇచ్చాడు. ఈ పిలుపుతో ఇరాన్ లోని ప్రతి రాష్ట్రం, సిటీ, గ్రామాల్లో అలజడులు, ప్రదర్శనలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల ప్రాణ నష్టం ఉంది.
ఇది ఇలా ఉండగా…
📵 ఇంటర్నెట్ – ఆఫ్
📞 ఫోన్లు – పని చేయడం లేదు
💡 కరెంట్ – అనేక ప్రాంతాల్లో కట్
ఇది ఇరాన్ ప్రభుత్వం చేసిందా. దాడికి ముందు ఇజ్రాయేల్/అమెరికా చేయించింది అనే గందరగోళం వుంది. నిన్న రాత్రి నుండి ఇరాన్ లోపల ఏమి జరుగుతోందో బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి. ఇది సాధారణంగా పెద్ద సైనిక ఆపరేషన్/అత్యవసర స్థితి ముందు కనిపించే సంకేతం. కరెంట్ ఆపేసి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనికి రాకుండా చేసే పథకం సైనిక చర్యలో ఒక ముఖ్య భాగం.
రష్యా కీలక కదలిక = రెడ్ అలర్ట్
రష్యా ఇజ్రాయెల్ నుంచి 24 గంటల్లో 3 తరలింపు విమానాలలో తన దౌత్యవేత్తల కుటుంబాలను ఖాళీ చేయడం . ఇది మిసైల్ ముప్పు స్పష్టంగా ఉందన్న సంకేతం. రష్యా సాధారణంగా ఇది చేయదు. మొన్న వెనిజులా సైనిక చర్య ముందు కూడా రష్యా తన దౌత్య వేత్తలను ఖాళీ చేసింది. టెహ్రాన్ మిత్రదేశమే ఇలా వెనక్కి తగ్గితే—పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు.
అమెరికా సైనిక విస్తరణ (OSINT ఆధారంగా)
ఓపెన్ సోర్స్ ఇంటలిజెన్స్ సంస్థల విశ్లేషణ ప్రకారం…
డజన్ల కొద్దీ Air Refueling Tankers, C-5, C-17 భారీ రవాణా విమానాలు అమెరికా & ఇంగ్లాండ్ బేస్‌ల నుంచి మధ్యప్రాచ్యం వైపు బయలుదేరాయి. ఇవి విన్యాసాలు కావు. ఎయిర్ స్ట్రైక్‌కు ముందు లాజిస్టిక్స్.
లక్ష్యం ఎవరు?
అమెరికా + ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీదకు.
సంభవించే టార్గెట్లు:
• మిలిటరీ బేస్‌లు • న్యూక్లియర్ ఇన్‌ఫ్రా • ప్రాక్సీ నెట్‌వర్క్స్
ఇరాన్- పాక్ సరిహద్దు నుండి దాడి చేసే అవకాశం ఉంది. పాక్ – ఇరాన్ బోర్డర్ లో దాదాపు సగ భాగం ఇరాన్ ప్రస్తుత regime చేతిలో కాకుండా తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్ళింది. ఈసారి ఇటు నుండి స్ట్రైక్ అనే ఇంటెలిజెన్స్ విశ్లేషణలు ఉన్నాయి. పాక్ ఇరాన్ కు పూర్తిగా నమ్మక ద్రోహం చేసింది….. ఇవన్నీ తెలిసినా ఇరాన్ రెజిమ్ కు ఏమీ చేయలేని పరిస్థితి. ఇరాన్ ను 4 వైపుల నుండి lock చేశారు.
దాడి జరిగితే డోమినో ఎఫెక్ట్…
1️⃣ స్ట్రైక్
2️⃣ ఇరాన్ ప్రతీకారం
3️⃣ హోర్ముజ్ జలసంధి ముప్పు → చమురు ధరలు పేలుడు
4️⃣ ఇరాన్ → రష్యా సహాయం కోరే అవకాశం
5️⃣ రష్యా ఒప్పుకుంటే- ప్రత్యక్ష ఉద్రిక్తత
ఇది ప్రాంతీయ యుద్ధం కాదు… ప్రపంచ స్థాయి సంక్షోభం.
ఇది భయపెట్టే పోస్ట్ కాదు., సంకేతాలను కలిపి చెప్పిన నిజం. ఒక విశ్లేషణ. అన్నీ జరగొచ్చు, జరగకపోవచ్చు.
— ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #MiddleEastCrisis #IranBlackout #IranAlert #Israel #USA #Russia #Geopolitics #WorldOnEdge
Share this Article