Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ… తమిళులకు కన్నడ ఫ్యాన్స్ వెక్కిరింపులు…

April 17, 2026 by M S R

.

కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరు సంస్కృతిలో ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీలు అంతర్భాగం… ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉడిపి హోటల్స్ పుట్టింది కర్ణాటకలోనే… బెంగళూరులోని ‘విద్యార్థి భవన్’, ‘MTR’, ‘CTR (సెంట్రల్ టిఫిన్ రూమ్)’ వంటి హోటల్స్‌లో దోశల కోసం గంటల తరబడి క్యూ కడతారు… ఇంకా చెప్పాలంటే, ‘మసాలా దోశ’కు కర్ణాటక ఒక ప్రత్యేకమైన బ్రాండ్…

తమిళనాడు సాంబార్ కొంచెం పుల్లగా ఉంటే, కర్ణాటక సాంబార్ (ఓగ్గరణే) కొంచెం తీపిగా ఉంటుంది… కానీ రెండూ ప్రాథమికంగా ఒకటే… కన్నడిగుల రోజువారీ భోజనంలో ఇడ్లీ, వడ, సాంబార్ లేనిదే గడవదు… కర్నాటక బిసిబెల్లి బాత్ అంటే సాంబారన్నమే…

Ads

అసలు కర్నాటక అనే కాదు… తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ… ప్రతి దక్షిణ రాష్ట్ర ఆహార సంస్కృతిలో ఇడ్లీ సాంబార్ ప్రధానమైంది… ఇదంతా అంగీకరిస్తారు కదా… నిజాలే కదా… మరి ఒక కన్నడిగ తమిళియన్‌ను ఇడ్లీ సాంబార్ అని వెక్కిరిస్తే… దాన్నేమనాలి…? మూర్ఖత్వం, పిచ్చితనం… తన ఫుడ్ కల్చర్‌ను తనే… అంటే తనను తనే వెక్కిరించుకున్నట్టే కదా..!!

విషయం, వివాదం ఏమిటంటే..? ఐపీఎల్ అభిమానుల్లో ఓ వెర్రితనం ఉంటుంది… అది ఆట మీద ప్రేమ కాదు… బెంగుళూరు జట్టులో కన్నడిగులు లేకపోయినా అది తమదే అని గుడ్డిగా ప్రేమించేయడం… సేమ్, హైదరాబాద్ జట్టులో తెలుగుతనం లేదు, చెన్నై జట్టులో మద్రాసీతనం లేదు… ఆ జట్లు బరిలో ఉంటే ప్రేక్షకులు కూడా చీలిపోయి, జుట్టుజుట్టు పట్టుకుంటాయి… ప్రత్యేకించి సీఎస్‌కే, ఆర్సీబీ జట్ల ఫ్యాన్స్…

ఆ రెండు జట్ల పోటీ అంటే, అదేదే కావేరీజలాల ఫైట్ అన్నంతగా మారిపోతారు ఫ్యాన్స్… ఒక్కో నగరంలోని ఆటలు జరిగే స్టేడియాలను ఒక్కో ఐపీఎల్ జట్టు తీసుకుంటుంది… ఇక మ్యాచ్ జరుగుతుంటే ఆ ప్రాంత పాటల డీజేలు, ప్రేక్షకుల్లో జోష్ నింపడానికి అనౌన్సర్ల కూతలు సరేసరి కదా… వీళ్లు మరోరకం చీర్ గరల్స్… ప్రతిచోటా వోకే కానీ సీఎస్కే, ఆర్సీబీ అనగానే అవి అదుపు తప్పుతున్నాయి… ప్రాంతీయవాదాలు పెచ్చరిల్లుతున్నాయి…

ఏప్రిల్ 5 నాటి  మ్యాచులో జరిగింది అదే… చిన్నస్వామి స్టేడియంలో సీఎస్‌కే ఆటగాళ్లను వెక్కిరిస్తూ పదే పదే ‘ఇడ్లీ దోశ, సాంబార్ చట్నీ’ అనే పాటను డీజే సౌండ్‌తో వినిపించసాగారు… దానికితోడు అనౌన్సర్ల వ్యాఖ్యానాలు కూడా… నిజానికి ఆ వెక్కిరింపు సీఎస్‌కే జట్టుకు ఏమాత్రం వర్తించదు, అందులో ఇడ్లీ దోశ ఫుడ్ కల్చర్ ఉన్నవాళ్లెవరు అసలు..? ఐనా సరే, చెన్నై పేరున్న జట్టు కాబట్టి ఈ వేధింపులు, వెటకారాలు…

దీంతో సీఎస్‌కే జట్టు బీసీసీఐకి ఫిర్యాదు చేసింది… మమ్మల్ని ప్రాంతం, ఫుడ్ పేరిట వేధించే చర్యలు ఎక్కువయ్యాయి అని..! ఇలాంటి చర్యలు మమ్మల్ని మానసికంగా దెబ్బతీయడంతోపాటు తమ ప్రాంత ఆహారపు అలవాట్లను గేలి చేయడమేనని ఆ ఫిర్యాదు సారాంశం… జట్టు మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ ఏమంటాడంటే..?

  • కల్చరల్ స్టీరియోటైపింగ్…: ఒక నిర్దిష్ట రాష్ట్రాన్ని లేదా సంస్కృతిని కేవలం ఆహారంతో ముడిపెట్టి హేళన చేయడం సరికాదు…

  • డీజే పాత్ర…: హోమ్ టీమ్ డీజేలు నిష్పక్షపాతంగా ఉండాలి, కానీ ఇక్కడ కావాలనే వివాదాస్పద ట్రాక్స్ ప్లే చేసి అభిమానులను రెచ్చగొట్టారు.

  • ఆటగాళ్లపై వ్యక్తిగత దూషణలు…: మైదానంలో ఉన్న ఆటగాళ్లపై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు వచ్చాయి…

దక్షిణ భారత ‘ఆత్మగౌరవం’ మీద సెల్ఫ్ గోల్? … ఈ వివాదంలో ఉన్న అసలు సిసలు లాజిక్ ఏంటంటే… ఈ నినాదాలు చేస్తున్న వారు కూడా అదే ఆహార సంస్కృతిలో భాగం కావడం… సొంత ఇంటి రుచులనే ఇతరులను అవమానించడానికి ఆయుధాలుగా వాడటం అనేది ఒక రకమైన “సెల్ఫ్ గోల్”… తమిళులను వెక్కిరిస్తున్నామనే భ్రమలో, కన్నడ అభిమానులు కూడా తమ సొంత సంస్కృతిని తక్కువ చేసుకుంటున్నారు…

క్రీడా స్ఫూర్తి ఎటు పోతోంది? మైదానంలో ఉండే డీజేలు, అనౌన్సర్లు కేవలం వినోదాన్ని పంచాలి కానీ, ప్రాంతీయ విద్వేషాలను లేదా వివక్షను ప్రోత్సహించేలా ఉండకూడదు… బీసీసీఐ ఈ అంశంపై విచారణ జరుపుతోంది… భవిష్యత్తులో ఇలాంటి ‘క్యాజువల్ రేసిజం’ (Casual Racism) స్టేడియాల్లో పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన మార్గదర్శకాలు అవసరం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ, ఇంతకీ ఈ కథలో అసలు వ్యభిచారి ఎవరు..?
  • మోడీ సూత్రాలు..! ఏదో ఆర్థిక తుఫాన్‌కు ముందు మోగే సైరన్లు..!!
  • రెండు కళ్ళ సిద్ధాంతానికి కాలం చెల్లింది… అటో ఇటో తేల్చుకోవల్సిందే…
  • తెలంగాణ బరిలోనూ ఎన్డీయే కూటమి..? రేవంత్‌రెడ్డి నెత్తిన పాలు..!!
  • ఏమో అనుకుంటాం గానీ… శోభన్‌బాబుకూ కులగజ్జి ఎక్కువే…
  • కర్కోటక అవినీతి జయలలిత… చివరకు ఏం సాధించినట్టు..?
  • అంతరిక్షంలో ఎఐ యుద్ధాలా..? ఇండియా కూడా రెడీ..!
  • ఆ చివరి ఓవర్…. ఐపీఎల్ థ్రిల్లెస్ట్… ముంబై ఇంటికి… బెంగుళూరు టాప్ వన్…
  • విద్వేషం లేదు- విషం లేదు..! సరైన దిశలో ఒక పీఎం- ఒక సీఎం…!!
  • ఇది బాబాయ్ హోటల్ స్టోరీ అస్సలు కాదు … జస్ట్, ఒక బాబాయ్ స్టోరీ …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions