Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దగ్గుబాటి నారప్పా…! ఈ చారిటీ ఏందప్పా..? పిల్లికి బిచ్చమేశారా ఎన్నడైనా..!!

December 11, 2022 by M S R

నారప్ప రెవిన్యూ మొత్తం చారిటీకి ఇస్తాం… దగ్గుబాటి సురేష్ నోటి నుంచి వచ్చిన ఈ మాట కాస్త నవ్వు పుట్టించింది… తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరెన్నిక గన్న పెద్దలకు చారిటీ అంటే తెలుసా..? అసలు దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన చారిటీ వార్త ఒక్కటైనా చదివామా..? ఫోటో ఒక్కటైనా చూశామా..? తనే కాదు, ది గ్రేట్ దిల్ రాజు, రాజమౌళి ఎట్సెట్రా అందరూ… పిల్లికి బిచ్చం, ఎడమచేత్తో కాకిని… వంటి సామెతలన్నీ వీళ్లకే సూటబుల్…

ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందీ అంటే… వెంకటేష్ ఆమధ్య నారప్ప అనే సినిమా తీశాడు… కానీ ఓటీటీలోనే విడుదల చేశారు… కరోనా సమయం, థియేటర్లు ఓపెన్ లేవు, దాంతో అమెజాన్‌లో రిలీజ్ చేసేశారు… సినిమా పర్లేదు, హిట్ టాకే వచ్చింది… కానీ ఇప్పుడు వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా ఆ సినిమాను థియేటర్లలో ఒక్కరోజు కోసం రిలీజ్ చేస్తారట… టాలీవుడ్ సిండికేట్ మెంబరే కాబట్టి జస్ట్, ఒక్కరోజుకు థియేటర్లను అలా అలా అడ్జస్ట్ చేసిపారేస్తారు… అదెంత పని…

అయితే కేవలం ఒకరోజు (డిసెంబరు 13) షోల కోసం థియేటర్లలో రిలీజు దేనికి..? ఎలాగూ ఒక్కరోజు రెవిన్యూ మీద ఆశపడరు వాళ్లు… పైగా అమెజాన్ వాడు ఒప్పుకోడు… ఈ ప్రశ్నలకు బదులిస్తూ దగ్గుబాటి అభిమానులు కోరారు కాబట్టి అమెజాన్‌ను అడిగితే వాళ్లు ఓకే అన్నారట… మరి రెవిన్యూ మాటేమిటి అంటే… చారిటీకి ఇచ్చేస్తాం అన్నారట…

Ads

విలేఖరులతో మాట్లాడినప్పుడే ప్రత్యక్షంగా, పరోక్షంగా చారిటీ కోసం చాలా వర్క్ చేస్తున్నానని చెప్పాడు సురేష్ బాబు… కానీ అవేమిటో కాస్త వివరిస్తే బాగుండేది… ఆమధ్య ఒక వ్యక్తికి ఏదో సాయం చేశారట, విజ్ఞానజ్యోతి ఎడ్యుకేషన్ ట్రస్టు కోసం వర్క్ చేస్తున్నాడట… అయ్యా, ఇదేమైనా చారిటీ సంస్థా…? పక్కా కమర్షియలే కదా… తమరు ఎంతసేపూ ప్రేక్షకుల నుంచి పిండుకోవడమే తప్ప, తిరిగి సొసైటీకి ఇచ్చింది ఏముందని..? నిజానికి నారప్ప సినిమా థియేటర్లలో రిలీజ్ చేసినా సరే, ప్రేక్షకులు కరోనా భయంతో వస్తారో రారో అనే సందేహం ఉండేది… అందుకని అమెజాన్ వాడికి అమ్మేసి, డబ్బు లెక్కేసుకున్నారు… సేమ్, దృశ్యం-2 కూడా…

ఇక ప్రతి హీరో బర్త్‌డేకు ఈ ఒక్కరోజు ఫలానా సినిమాను థియేటర్లలో వేసుకుంటాం, రీరిలీజు చేసుకుంటాం, అవకాశం ఇవ్వండి అంటూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను అడుగుతుంటే… అదో కొత్త సమస్య అవుతుంది… సురేష్‌తో అమెజాన్ వాడికి మంచి బిజినెస్, పర్సనల్ రిలేషన్ ఉండటంతో వోకే అన్నాడేమో కానీ ఈ ఆనవాయితీకి తెరతీయడం మంచిది కాదు…

ఇదే విలేఖరుల సమావేశంలో ఆయన వెంకటేష్ తదుపరి సినిమాలు, అభిరామ్ సినిమా ప్రయత్నాల మీద కూడా ఏవో వివరాలు చెప్పాడు గానీ… ఒక ప్రశ్న అలాగే ఉండిపోయింది… ఆ ఒక్కరోజు షోల రెవిన్యూ ఏ చారిటీ కోసం ఖర్చు చేస్తారు..? నిజానికి సినిమా పెద్ద నిర్మాణ కంపెనీలను, స్టూడియోలను కార్పొరేట్ కంపెనీలుగా ఎందుకు పరిగణించకూడదు… దేశంలో ప్రతి కార్పొరేట్ కంపెనీ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద విధిగా తమ లాభాల్లో 2 శాతం సామాజిక సేవకు వినియోగించాలి…

దాంట్లోనే తప్పుడు లెక్కలు గట్రా చూపిస్తుంటారు కానీ కొన్ని పెద్ద కంపెనీలు పర్యావరణ, ప్రజారోగ్యం తదితర అంశాల్లో నిజంగానే కొంత ఖర్చు చేస్తాయి… సపోజ్, ఏటా 200 కోట్ల టర్నోవర్ దాటిన ప్రతి సినిమా కంపెనీని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ రూల్ కిందకు తీసుకువస్తే కొంత మేలు… తప్పుడు లెక్కలు చూపించి, ఎగ్గొట్టినా సరే, ఎంతోకొంత ఖర్చు చూపించకతప్పదు… విద్యాదానమో, ఆరోగ్యదానమో, ఇంకేదైనా సొసైటీకి మేలు కొంతైనా జరిగితే బెటర్… వీళ్లతో పిల్లికి బిచ్చం పెట్టించాలంటే సీఎస్ఆర్ ప్రయోగించడమే కరెక్టు మార్గం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions