ఫాఫం, సుడిగాలి సుధీర్ మీద సానుభూతి ప్రవాహం ఇంకా ఆగడం లేదు తెలుగు నెటిజన్లలో…! మునుపెన్నడూ లేనిది, అకస్మాత్తుగా ఓ పండుగ స్పెషల్ షో నుంచి ఈటీవీ, మల్లెమాల కలిపి తప్పించారు కదా… అసలు సుధీర్ లేకుండా ఈటీవీలో స్పెషల్ షో ఏమిటని తెలుగు టీవీ ప్రేక్షక సమాజం బిత్తరపోయింది కదా… ఎవరెవరో ఏదేదో రాసేశారు… ఇక సుధీర్‌కు ఈటీవీలో కత్తెరే, మల్లెమాలకు కోపం వస్తే ఇక ఎక్కడికక్కడ పీలికలే అనే వార్తలు కూడా బోలెడు రాసేశారు ట్యూబ్ చానెళ్లలో..!
సుధీర్ మీద రోజాకు కోపం ఎందుకొచ్చింది..? ప్రదీప్‌కూ సుధీర్కూ నడుమ అగాధం ఎందుకు ఏర్పడింది..? మల్లెమాల ఎందుకంత ఆగ్రహంతో ఉన్నాడు..? ఈటీవీకి ఎందుకీ అసహనం..? ఈ ప్రశ్నలకు ఈరోజుకూ వాళ్ల నుంచి ఏ వివరణా లేదు… ఈ జబర్దస్త్, ఢీ తదితర షోలలో పార్టిసిపేట్ చేసేవాళ్లకు మాత్రం… ‘‘అబ్బే, ఏం లేదు..? సుధీర్‌కు గ్యాప్ ఇచ్చాం అంతే’’ అని చెబుతున్నారు… కానీ ఎవడూ నమ్మడం లేదు సెట్లలో… సుధీర్-రష్మి జంటను విడదీసి… ప్రత్యామ్నాయ లవ్ ట్రాకు కోసం ఈటీవీ టీం విపరీతంగా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది… చాలా పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టుంది…
Ads
ఈసారి సంక్రాంతి స్పెషల్ ప్రోమోలు మాత్రమే కాదు, జబర్దస్త్ స్కిట్లలో ఇమాన్యుయెల్, వర్ష జంటకు లభిస్తున్న అమితమైన ప్రయారిటీ గమనించండి… అదంతా ఉద్దేశపూర్వకంగా ప్రమోట్ చేస్తున్న ప్రయాసే… ఇంకొన్ని సందేహాలను చెప్పుకుందాం… హైపర్ ఆది- అనసూయ…. ఈ ట్రాకు కుదరదు… ఆమెకు పెళ్లయ్యింది, కాస్త ఏజ్ బార్, ఇద్దరు పిల్లలు… ఏదో పైపైన నాలుగు పంచులు తప్ప అనసూయతో మరీ క్లోజ్ యవ్వారం, ప్రదర్శన కుదరవు… ఆ ఢీలో కూడా ప్రదీప్-పూర్ణ… ఇదే ఆదికి, ఏకంగా జడ్జి ప్రియమణికీ లింకులు పెడుతున్నారు… అది కూడా పెద్దగా కుదిరే యవ్వారం కాదు… ఆ కెమెస్ట్రీ వర్కవుట్ కాదు… ప్రియమణి ఇమేజీ, గ్రేస్ ముందు ఆది ఆనడు…
ఆటో రాంప్రసాద్- రోహిణి… జస్ట్, ఈ ఒక్క స్పెషల్ షో కోసమే పనిచేస్తుంది… ఎందుకంటే..? రాంప్రసాద్‌కు ఇలాంటి ట్రాకులు పెద్దగా సూట్ కావు… మెల్లిమెల్లిగా ఇమాన్-వర్షలను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు… ఇమాన్ కామెడీ టైమింగు, యాక్షన్ బాగానే ఉంటుంది కానీ తన కలరే తనకు మైనస్… (పాపం, రోజా సహా అందరూ బాడీ షేమింగ్ లాగే కలర్ షేమింగ్ చేస్తుంటారు… దుర్మార్గం…) ఇంకోవైపు వర్ష బక్కగా ఉన్నా సరే, మంచి కలర్… ఈ జంట మరీ బ్లాక్ అండ్ వైట్ జంటలాగే ఉంటుంది… ఐనా సరే, వాళ్ల కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతోంది… ఓసారి సంక్రాంతి పండుగ స్పెషల్ షో ప్రోమో చూడండి… గతంలో సుధీర్-రష్మిలకు ఇచ్చినంత ప్రయారిటీ, పాటలు, స్టెప్పులు, ఫోజులు… బీభత్సం… సో, చూడబోతే… సుధీర్‌ను ఈ ఒక్కసారికి పక్కన పెట్టేయడం మాత్రమే కాదు… సుధీర్-రష్మి ట్రాకుకు గండి కొట్టేసి… ఆల్టర్నేట్ ట్రాకు డెవలప్ చేస్తున్నట్టే అనుకోవాలి… ఈ డౌట్లు బలపడటానికి మరొక్క సంగతీ చెప్పాలి…
ఇదే సంక్రాంతి షో… ఇమాన్, వర్ష ఓ తడిక చాటు నుంచి బయటికి వస్తారు… ‘‘ఏంరా తమ్ముడూ లేటు..?’’ అంటాడు ఆది… ‘‘మీరు పండుగ బయట చేసుకుంటుంటే, నేను లోపల చేసుకుంటున్నా’’ అంటాడు ఇమాన్ డబుల్ మీనింగుతో… పిచ్చి అనసూయ మధ్యలో అందుకుని… ‘‘ఎప్పుడూ బిల్డప్పులేనా..?’’ అనడుగుతుంది… (చెప్పడమే గానీ చేసేది ఏమైనా ఉందా లేదా అన్న మీనింగుతో…)… ‘‘ఎహె, మా పండుగ ఆల్రెడీ అయిపోయింది…’’ అంటాడు ఇమాన్… వర్ష సిగ్గుపడుతూ తలకొట్టుకుంటూ ఉంటుంది.,. అసలే ఈటీవీ, అందులోనూ మల్లెమాల, పైగా జబర్దస్త్ బ్యాచ్… బూతులు, డబుల్ మీనింగులు, చెత్తా పంచులు తప్ప ఇంకేం ఉంటయ్..? ఇక్కడ అది కాదు విశేషం… గతంలో సుధీర్-రష్మి బాపతు యవ్వారాలన్నీ ఇప్పుడు ఈ కొత్త జంట ప్రదర్శిస్తోంది… స్క్రిప్టు ప్రకారమే కావచ్చు… ఆ స్క్రిప్టు సుధీర్-రష్మి వంటి ఓ పాపులర్ బుల్లితెర జంటకు కత్తెర వేయడం కూడా కావచ్చు…! ఢీ షోలోనూ సుధీర్-రష్మి మార్క్ సాన్నిహిత్యపు సీన్లు ఈ కొత్త సీజన్లో ఇప్పటివరకూ ఒక్కటీ లేవు…! పండుగ స్పెషల్ షోలో కూడా రష్మి ప్రయారిటీని మ్యాగ్జిమం కత్తెర పెట్టారు… ఉన్నదంటే ఉన్నది… అంతే… ప్రదీప్ భజన కూడా ఎక్కువైంది… చాలా..?! ఏమాటకామాట… ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, సుధీర్-రష్మి జంటకు ప్రత్యామ్నాయం ఏమిటి అసలు..?!
Share this Article