.
డాకూ మహారాజ్ ఆహా ఓహో… బ్లాక్ బస్టర్… వంద కోట్ల సినిమా… బాలయ్యది ఓ కొత్త చరిత్ర… అని రాస్తున్నారు, చదువుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం…
ఎస్, నిజమే… కానీ జస్ట్, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ వసూళ్లు… ఈ ఆహారావాలు, ఓహోకారాలు… ఇండియాలో 103, ఓవర్సీస్లో 17 కోట్లు… గుడ్… దబిడిదిబిడి అగ్లీ స్టెప్పులు, ఓవరాక్షన్లు గట్రా ఉన్నా సరే, సంక్రాంతి సీజన్లో సెకండ్ హిట్ మూవీగా నిలిచింది…
Ads
(గేమ్ ఛేంజర్ ఫ్లాప్, సంక్రాంతికి వస్తున్నాం బంపర్ హిట్…) సరే, అందరూ పాన్ ఇండియా స్టార్లు అవుతున్నారు కదా… మరి నాకేం తక్కువ అనుకున్నాడేమో బాలకృష్ణ… ట్రయల్ వేశాడు… హిందీలో, తమిళంలో…
కానీ దయనీయమైన వసూళ్లు… మరీ చెప్పుకోవడానికి ఏమాత్రం వీలు లేకుండా… (ఏ భాష నటుల్ని పెట్టుకుంటే ఆ భాషలో మార్కెటింగ్ బాగుంటుందనేది కూడా భ్రమే అని ఈ సినిమా తేల్చేసింది…) ఎందుకంటే..? బాబీ డియోల్ ఉన్నాడు, ఊర్వశి రౌతేలా ఉంది, ఎగిరింది, దూకింది… ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఉంది…
సరే, హిందీలో పదీపన్నెండు రోజులు లేటుగా రిలీజు చేశారు… ఆ వసూళ్లు తెలుసా..?
Hindi | Day 5 | Day 4 | Day 3 | Day 2 | Day 1 | |
---|---|---|---|---|---|---|
₹ 0.27 Cr | ₹ 0.04 Cr | ₹ 0.03 Cr | ₹ 0.1 Cr | ₹ 0.05 Cr | ₹ 0.05 Cr |
మూడు లక్షలు, నాలుగు లక్షలు, అయిదు లక్షలు… మొత్తం 27 లక్షలు అయిదు రోజుల్లో… ఇదీ… ఎవరెవరి సినిమాలో హిందీ ప్రేక్షకులు హిట్ చేస్తున్నారు గానీ బాలయ్యకు హిందీ బెల్టులో యాక్సెప్టెన్సీ రాలేదు ఇంకా… ఏమో, భవిష్యత్తులో హిట్ కొడతాడేమో… ఇప్పుడే చెప్పలేం…
హిందీ మాట అటుంచితే… తమిళం..? అదీ అంతే… ఇదీ కాస్త లేటుగానే రిలీజ్ చేశారు, కాకపోతే హిందీకన్నా కాస్త ముందు… వారం రోజుల్లో ఎనిమిది లక్షలు… రోజుకు దాదాపు లక్ష… మరీ దారుణంగా ఉన్నాయి కదా…
ఎస్… బాలయ్య అంటే ఆ సినిమాల్ని ఇష్టపడే ఓ సెక్షన్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో… వాళ్లకు ఈ సినిమాలు చూడటం ఓ క్రేజ్… అమెరికా దాకా పాకింది ఆ వ్యసనం… బాలయ్య అంటే బాలయ్య, అంతే… ఆ అభిమానానికి తిరుగు ఉండదు… కాస్త సినిమాలో కథ గనుక రక్తికడితే ఇదుగో ఇలా తెలుగులోనే వంద కోట్లు…
పంచ్ డైలాగులు… సూపర్ హీరోయిక్ యాక్షన్ సీన్లు… బీభత్సమైన నేపథ్య సంగీతం… చాలు, బాలయ్య సినిమా నడిచిపోతుంది… అదే తన బలం… విచిత్రం ఏమిటంటే… అదే తన బలహీనత కూడా… అదే తనను తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్ని దాటనివ్వడం లేదు… అదీ సంగతి..!!
ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి… ఈమధ్య నాగవంశీ ఏదేదో మాట్లాడుతూ భారీగా ట్రోలింగుకు గురవుతున్నాడు కదా… పుష్ప-2 ఒకేరోజు హిందీ బెల్టులో 86 కోట్లు వసూలు చేస్తే బాలీవుడ్లో ఒక్కొక్కడికీ నిద్రపట్టలేదు అని కామెంటాడు ఆమధ్య… తను నిర్మించిన డాకూ మహారాజ్ హిందీ బెల్టు వసూళ్లను పేర్కొంటూ ఇక బాలీవుడ్ కూడా ఇప్పుడు అదే నాగవంశీతో ట్రోల్స్‌తో ఆడుకుంటోంది..!!
Share this Article