Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏక్ దో తీన్ చార్ పంచ్ పఠానా… పంచ్ లేకపోయినా వంద రోజులు…

June 14, 2024 by M S R

తాగుతా నీయవ్వ తాగుతా తాగుబోతు నాయాళ్ళ తల్లో దూరెళ్ళుతా తాగని నాకొడుకెందుకు ఈలోకంలో సొరగలోకమగపడతది మైకంలో . 1973 లో వచ్చిన ఈ డబ్బుకు లోకం దాసోహం సినిమా అనగానే గుర్తుకొచ్చే పాట ఈ తాగుబోతు పాటే . తాగని సత్పురుషులు బాధ కూడా పడ్డారు . వీడేంది తాగని నాకొడుకు అంటున్నాడు అని . నాలాంటోళ్ళు తాగుబోతు మాటలతో మీకు పని ఏంటండి అని సముదాయించేవాళ్ళం .

డి యోగానంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా NTR ది కాబట్టి , బ్లాక్ & వైట్ అయినా వంద రోజులు ఆడింది . మరెవరయినా యాభై రోజుల పోస్టర్ మాత్రమే పడేది . నాగభూషణం , గుమ్మడి లాంటోళ్ళు వేయాల్సిన ఊరి ప్రెసిడెంట్ పాత్రని SVR వేయటం కూడా ప్రేక్షకులకు ఎక్కలేదు . సినిమాలో నాకు బాగా నచ్చిన పాత్రలు , పాత్రధారులు సత్యనారాయణ , రమాప్రభ . తాగుబోతోడిగా సత్యనారాయణ , చిట్టితల్లిగా రమాప్రభల నటన బాగుంటుంది .

ఓ చిన్న గ్రామంలో ప్రెసిడెంటు తన చంచాలతో ఊళ్ళో చేసే అఘాయిత్యాలకు అడ్డం పడుతుంటాడు మన హీరో . ఆయన మేనకోడలు జమున , మన హీరో ప్రేమలో పడతారు . ఓ మర్డర్ కేసులో ఇరికించి హీరోని జైలుకు పంపుతారు . బయటకొచ్చిన హీరో లాటరీలో వచ్చిన డబ్బుతో ఊళ్ళో జనాన్ని తన వైపు తిప్పుకొని , డబ్బుకు జనం ఎలా దాసోహం అవుతారో రుజువు చేయటంతో సినిమా ముగుస్తుంది . ఇలాంటి కధాంశంతో చాలా సినిమాలే వచ్చాయి .

Ads

ntr (అప్పట్లో జమీన్ రైతులో వచ్చిన సమీక్ష)

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట , డబ్బుకు లోకం దాసోహం గణనాధా , చూస్తున్నావా ఓ దేవా చూస్తూ ఊరికే ఉన్నావా , ఏక్ దో తీన్ చార్ పంచ్ పఠానా , చదువు సంపద అందరిదీ పాడి పంట అందరిదీ పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . మోదుకూరి జాన్సన్ డైలాగులు కూడా పదునుగా ఉంటాయి .

ntr (అప్పట్లో ఆంధ్రప్రభలో వచ్చిన సమీక్ష)

NTR , జమున , SVR , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , పద్మనాభం , రావి కొండలరావు , సాక్షి రంగారావు , వై విజయ , మిక్కిలినేని , నిర్మలమ్మ , లీలారాణి, రేలంగి ప్రభృతులు నటించారు . కాలేజి రోజుల్లో మా నలసరావుపేట లోనే చూసా . తర్వాత టివిలో కూడా . యూట్యూబులో ఉంది . చూడనివారు చూడవచ్చు . చూడబులే . వంద రోజుల ఫంక్షన్ మద్రాసులో ముఖ్యమంత్రి కరుణానిధి ముఖ్య అతిధిగా జరిగింది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (డోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విద్వేష బిల్లుపైనా అదే పింక్ విషం..! సుప్రీం చెప్పిందేమిటో తెలుసా…!!
  • జనగణనలో ‘సహజీవనాని’కీ గుర్తింపు… కానీ అది పెళ్లి సర్టిఫికెట్ కాదు…
  • పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ బజ్వాకు ఏమైంది..? తల ఎందుకు పగిలింది..?!
  • కాళేశ్వరంపై అభిశంసన సరే… మరి శిక్షించే చర్యలేవి మంత్రివర్యా…
  • కథ, లాజిక్కులు జాన్తా నై …. గరం మసాలాల దట్టింపుతోనే చల్తా…
  • అమెరికా- రష్యా… భలే గేమ్ వీళ్లది…
  • దశావతారం…! కథ కోసం పాత్రలా..? పది పాత్రల కోసం కథా..?!
  • ‘‘మీ ఏడుపే మాకు దీవెన’’… లారీల వెనుక కనిపిస్తుంటుంది కదా… ఇదే…
  • రియల్ లైఫ్‌పై రీల్ లైఫ్ ఇంపాక్ట్…! పాపం, ఓ సినిమా విలన్ కథ…!!
  • ఓటి కుండకు మోత ఎక్కువ- గిల్ట్ నగలకు మెరుపు ఎక్కువ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions