ఏదైనా ఒక పోలీస్ ఎన్‌కౌంటర్ జరిగితే… సాధారణంగా రచ్చ రచ్చ అవుతుంది… వార్తలు, హక్కుల సంఘాలు, యాక్టివిస్టులు, డిబేట్లు, విచారణ డిమాండ్లు, బాధిత కుటుంబాల కన్నీళ్లు, కోపాలు, శాపాలు… అది రియల్ ఎన్‌కౌంటరైనా, ఫేక్ ఎన్‌కౌంటరైనా చర్చ ఉంటుంది… ప్రతి ఎన్‌కౌంటర్ చుట్టూ బోలెడన్ని క్రైమ్ కోణాలే కాదు, ఎమోషనల్, హ్యూమన్ అంశాలూ చుట్టుముట్టి ఉంటయ్… కానీ ఒక రాష్ట్రంలో పది కాదు, వంద కాదు, వెయ్యి కాదు… నాలుగేళ్లలో ఏకంగా 8472 ఎన్‌కౌంటర్లు… అసలు ఆ అంకె చదువుతుంటేనే విపరీతమైన ఆశ్చర్యం… ఇన్ని ఎన్‌కౌంటర్లు మన దేశంలోనే, అదీ కేవలం ఒక్క రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయా..? మరెందుకు రచ్చ రచ్చ కావడం లేదు… అక్కడ ఇదంతా ఓ రొటీన్ కార్యక్రమంలా ఎందుకు కనిపిస్తోంది..? రేషన్ పంపిణీ, టీకాలు వేయడం, పెన్షన్ల పంపిణీ వంటి ఓ సాధారణ ప్రభుత్వ కార్యక్రమంలా మారిపోయింది ఎందుకు..? ఆ రాష్ట్ర అడిషనల్ డీజీ కుమార్ ప్రశాంత్ కుమార్ ఏమంటాడంటే..? ‘‘ఈరోజుకు ఏ రాజ్యాంగవ్యవస్థా ఒక్క తప్పును కూడా పట్టుకోలేదు, అసలు తప్పేపట్టలేదు..’’ అంటే… అంతా చట్టబద్ధం, న్యాయబద్ధం, ధర్మబద్దమా..?
చాలారోజులుగా డేటా వెతుకుతుంటే దొరకడం లేదు, ఇప్పుడు పోలీసులే చెబుతున్నారు… మొత్తం ఎన్‌కౌంటర్లు 8472… 3302 మందికి పోలీసు బుల్లెట్లు తగిలాయి… అందులో 146 మంది మరణించారు… 18,225 నేరస్తులను అరెస్టు చేశారు… ఫిలిప్పీన్స్‌లో మాదకద్రవ్యాలపై పోరులో ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో ఇలాగే… లెక్క ఎవరూ తేల్చలేకపోతున్నారు గానీ వేల ఎన్‌కౌంటర్లు… ఇండియన్ రోడ్రిగో అంటే యోగి ఆదిత్యనాథ్ దాసేనా..? అంతటి ప్రాబ్లమాటిక్ కాశ్మీర్‌లో గానీ, సేమ్, యూపీ వంటి వాతావరణమే ఉండే బీహార్‌లో గానీ ఇన్ని ఎన్‌కౌంటర్లు లేవు..? మరి యూపీ జనంలో వ్యతిరేకత ఎందుకు ప్రబలడం లేదు..? కొన్ని ప్రాబబుల్ కారణాలు మాట్లాడుకోవాలి… 1) అన్నీ ఫేక్ ఎన్‌కౌంటర్లు కావు… అనేకం రియల్ ఎన్‌కౌంటర్లు కూడా ఉన్నయ్… ఇప్పటికి 1157 మంది పోలీసులు కూడా గాయపడ్డారు… 13 మంది మరణించారు… 2) పోలీసుల టార్గెట్ ప్రధానంగా ఆల్‌రెడీ పలు కేసుల్లో ఉన్నవాళ్లు, తప్పించుకు తిరుగుతున్నవాళ్లు… 30, 40, 50 కేసులున్నవాళ్లు కూడా… రేపిస్టులు, హంతకులు ఎట్సెట్రా… సమాజంలో విలన్లుగా ముద్రపడ్డవాళ్లే కాబట్టే అంతగా వ్యతిరేకత రావడం లేదేమో… 3) అక్కడ రాజకీయం, నేరం కలగలిసిపోయి ఉంటుంది… ఇప్పుడు వేల మంది నేరస్తులు జైళ్లలో చేరారు… రాజకీయం కిక్కుమనడం లేదు… సో, జనం రిలీఫ్ ఫీలవుతున్నారు… ఇంకా చెప్పుకోవాలంటే..?
Ads
పోలీసులు ఓ స్ట్రాటజీ అనుసరిస్తున్నారు… అరెస్టయిపో అని ముందుగా హెచ్చరికలు పంపించడం, తరువాత ఆచూకీ తీయడం, చుట్టుముట్టడం… నేరుగా ప్రాణాలు తీయడం అనేది కాదు టార్గెట్… వీలైనంతవరకూ కాళ్ల మీద షూట్ చేస్తారు… అందుకే దీన్ని అనధికారికంగా ‘‘ఆపరేషన్ లంగ్డా’’ అంటుంటారు, లంగ్డా అంటే కుంటి… అక్కడి నుంచి హాస్పిటల్, నెక్స్ట్ జైలు… ప్రతిదీ మెజిస్టీరియల్ విచారణ… అన్నీ రికార్డు చేస్తారు… ఇన్ని వేల ఎన్‌కౌంటర్లు జరిగినా మృతుల సంఖ్య 146 దాటలేదంటే కారణం ఇదే… నేరస్తుడు సమాజంలో తిరగడానికి వీల్లేదు, అదీ సూత్రం… ఈ భయంతోనే అనేక మంది బెయిళ్లు రద్దు చేసుకుని మరీ లొంగిపోయి, జైళ్లలో చేరి, బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుంటున్నారు… నాలుగేళ్లలో దాదాపు 8500 ఎన్‌కౌంటర్లు అంటే… ప్రతి ఏటా రెండు వేలకు పైగా… అంటే రోజూ ఏడు ఎన్‌కౌంటర్లు… ఐనాసరే, దేశంలో దీనిపై అసలు ఒక చర్చే లేకుండా పోయింది… ఎన్‌కౌంటర్లే కాదు, నొటోరియస్ రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్ల ఆస్తుల స్వాధీనం, అక్రమ భవనాల కూల్చివేత సమాంతరంగా సాగుతోంది… బెయిళ్ల రద్దు పిటిషన్లు వేస్తుంటారు… పెరోల్స్, ఫర్లాఫ్‌ల మీద ఎందరు జైళ్ల నుంచి బయటికి వచ్చారో, ఎందరు తిరిగి వచ్చారో ఆరాలు తీస్తుంటారు… ఇవన్నీ సరే, రేప్పొద్దున యోగి ప్రభుత్వం మళ్లీ రాదు అనుకుందాం… ఈ రాక్షసమూక జైళ్ల నుంచి బయటికి వచ్చి మళ్లీ కసికసిగా కోరలు చాపితే అప్పుడు జనం పరిస్థితి ఏమిటి…?!
Share this Article