సారీ చెప్పడం అంటే… అదీ ప్రత్యక్ష దైవంగా, దేవుడి అవతారంగా భావించబడే దలై లామా బహిరంగ క్షమాపణ అంటే… తనలో దైవత్వం లేదని, నేనూ ఓ మామూలు మనిషేనని అంగీకరించి, లెంపలేసుకున్నట్టే భావించాలా..? ప్రపంచంలో ఉన్న ప్రతి టిబెటన్ సిగ్గుపడేలా చేశాడు ఈ దేవుడు… అందరికీ సారీ చెప్పాడు… తన చర్యకు ఏదో విఫల సమర్థన చేసుకోబోయాడు… విషయం ఏమిటంటే..?
ఈమధ్య ఏదో ప్రోగ్రాం ఇస్తున్నప్పుడు ఓ భారతీయ పిల్లాడు తన దగ్గరకు వచ్చాడు… ఆ పిల్లాడి మూతి మీద ముద్దుపెట్టుకున్నాడు ఈ దేవుడు… తరువాత తన నాలుకను బయటపెట్టి పెదాలతో చీకాలని ఆ పిల్లాడిని అడిగాడు… చూస్తుంటేనే గలీజుగా ఉంది… అదేం ఆశీర్వాదం, అదేం కోరిక… కోట్ల మంది దేవుడిలా పూజించే వ్యక్తి చర్యలు, చేష్టలు ఎంత హుందాగా ఉండాలి..? సరిగ్గా ఇదే అభిప్రాయంతో సోషల్ మీడియా విరుచుకుపడింది…
ఇదీ ఆ వీడియో…
Ads
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిపోయింది… ఆయనను ఓ ఆధ్యాత్మిక పర్సనాలిటీగా భావించి, ఇన్నేళ్లూ తనను అభిమానించినవాళ్లు సైతం విరుచుకుపడ్డారు… ఇది ఎంబరాసింగ్ అయిపోయింది దేవుడికి… చివరకు క్షమాపణ చెబుతూ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఓ ట్వీట్ కొట్టింది…
— Dalai Lama (@DalaiLama) April 10, 2023
‘‘ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది… నిజానికి ఆ బాలుడు దలై లామా ఆలింగనం కోరుకున్నాడు… ఆయన అప్పుడప్పుడూ కెమెరాల ముందు, ప్రజల ముందు భక్తుల్ని టీజ్ చేస్తుంటాడు… అది సరదాగా ఆడుకోవడం, అమాయకత్వమే తప్ప వేరే ఉద్దేశం ఉండదు… పిల్లాడితో మాటలు ఎవరినైనా గాయపరిచి ఉంటే వాళ్లకు, ప్రజలకు క్షమాపణ చెబుతున్నాడు…’’ అని ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి ఆ ట్వీట్ వెలువడింది… (తన ఆఫీసు వాళ్లు ఎవరో హ్యాండిల్ చేస్తుంటారు)…
ఐనా ఇదేం ఆట..? ఇదేం మాట..?
— Joost Broekers (@JoostBroekers) April 8, 2023
Share this Article