Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ దళపతి సీఎం జోసెఫ్ విజయ్ కాదు… రజినీకాంత్…

June 7, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. రజనీకాంత్ కెరీర్లో ఓ మైలురాయి ఈ దళపతి సినిమా . తెలుగులోకి డబ్ అయిన సినిమా అని ఈరోజుకీ ఎవరూ భావించరు . డైరెక్ట్ టేక్ సినిమాకు ఎలా అయితే ఆదరణ ఉంటుందో అలాగే ఉంటుంది . It’s a great heart-touching , sentimental , emotional , action-filled , musical splendour .
చాలామంది మహాభారతంలోని కర్ణ దుర్యోధనులతో రజనీకాంత్ , మమ్ముట్టి పాత్రలను పోలుస్తూ ఉంటారు . కేవలం కని వదిలేస్తుంది కాబట్టి రజనీకాంత్ పాత్రను కర్ణుడితో పోల్చుకుంటారేమో ! అంతవరకే . ఈ సినిమా క్లైమాక్సులో మమ్ముట్టి స్నేహితుడి కుటుంబమే తన కుటుంబంగా భావించి కలెక్టర్ వద్దకు లొంగిపోవటానికి సిధ్ధపడి వచ్చి ప్రాణాలను కోల్పోతాడు .

అందువలన మహాభారతంలోని కర్ణ , దుర్యోధన పాత్రలతో పోల్చటం సరి కాదని నా భావన . అదంతా ఎలా ఉన్నా అద్భుతమైన కధను నేసుకుని , బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని , శ్రావ్యమైన సంగీతంతో ఓ ఏక్షన్ సినిమాను దృశ్య శ్రవణ కావ్యంగా మార్చారు దర్శకుడు మణిరత్నం . Hats off to him .

Ads

సినిమా ప్రియులు ఈ సినిమా చూడకుండా ఉండే ప్రసక్తే లేదు . Gen-Z వాళ్ళు ఏమయినా చూసి ఉండకపోవచ్చు . ఇద్దరు హీరోలు ఒకరికి ఒకరు ప్రత్యర్ధులుగా తారసపడి ప్రాణస్నేహితులు అవుతారు . ఆ నగరానికి కలెక్టరుగా వచ్చిన అరవింద స్వామి ఈ ఇద్దరిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం .

సినిమా మధ్యలో రజనీకాంతుకు ఆ కలెక్టర్ తన తమ్ముడే అని తెలవటంతో సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది . కలెక్టర్ని తుదముట్టించాలని పట్టుబట్టుతున్న మమ్ముట్టికి రజనీకాంత్ నిజం చెప్పేస్తాడు . నీ కుటుంబమే నా కుటుంబమని కలెక్టర్ వద్దకు సరెండర్ అవటానికి వెళ్లి ప్రాణాలను కోల్పోతాడు .

తన మిత్రుని చంపిన ప్రత్యర్ధులను చంపేస్తాడు రజనీకాంత్ . అతనిని అరెస్ట్ చేయటానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవంటూ SP అరెస్ట్ చేయనంటాడు . కలెక్టరుకు బదిలీ కావటం , తల్లి రజనీకాంత్ దగ్గరే ఉంటానని చెప్పటంతో సినిమా ముగుస్తుంది .

నటనపరంగా రజనీకాంత్ , మమ్ముట్టి అదరగొట్టేసారు . డాన్సుల్లో , ఫైటింగుల్లో , ఎమోషనల్ సీన్లలో , అన్నింటిలో తినేసారు . మహిళామణులు శ్రీవిద్య , శోభన , గీత , భానుప్రియ , నిర్మలమ్మ గొప్పగా నటించారు . ఇతర పాత్రల్లో జయశంకర్ , నగేష్ , చారుహసన్ , పి యల్ నారాయణ , కిట్టి , అమ్రీష్ పురి , ప్రదీప్ శక్తి  తదితరులు నటించారు . అరవింద స్వామి అరంగేట్రం ఈ సినిమా ద్వారానే .

తెలుగులో విజయవంతం అవటానికి ప్రధాన కారకుడు మాటల్ని , పాటల్ని వ్రాసిన రాజశ్రీ . అసలు డబ్బింగ్ పాటల్లాగా అనిపించవు . అంత చక్కటి సాహిత్యాన్ని అందించారు రాజశ్రీ . ఇళయరాజా సంగీతం గురించి చెప్పేదేముంది . సుందరం మాస్టారు , ప్రభుదేవా డాన్సుల కంపోజింగ్ అద్భుతం . ముఖ్యంగా గ్రూప్ డాన్సులు .

సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి గ్రూప్ డాన్స్ అద్భుతం . అలాంటి ఊపయిన మరో పాట చిలకమ్మా చిటికేయంట నువ్ రాగాలే పాడాలంట . ఈ పాటలో Femina Miss India-1985 సోనూవాలియా తళుక్కుమంటుంది .‌

చాలా శ్రావ్యమైన పాట యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధ . చాలా బాగుంటుంది . శోభన , రజనీకాంత్ మీద సాగే సుందరీ నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట చిత్రీకరణ బాగుంటుంది . విషాదంగా ఉన్నా శ్రావ్యంగా ఉంటుంది ఆడజన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో పాట . మరో పాట ముద్దబంతి పూచేనులే . పాటల్ని బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , సుశీలమ్మ ,చిత్ర , స్వర్ణలత అత్యంత శ్రావ్యంగా పాడి సూపర్ హిట్ చేసారు .

సినిమాలో సంతోష్ శివన్ ఫొటోగ్రఫీని కూడా మెచ్చుకోవలసిందే . వెరశి అద్భుతమైన సినిమా . గతంలో ఎన్నిసార్లు చూసినా మరలా మరలా చూడతగ్గ సినిమాయే . యూట్యూబులో ఉంది …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్యారడైజ్ … సినిమా కాదు, బిర్యానీ కాదు… ఓ సినిమా టాకీసు !!
  • సింగీతం అంటే ఓ పేరు కాదు… తెలుగు సినిమా ప్రయోగాల జాబితా !!
  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!
  • ఈ ఉగ్ర పైలట్‌ను ఫ్లయ్ దుబాయ్ ఎందుకు నియమించింది?!
  • ఈ పార్వతి పాట… ఇప్పుడు ప్రపంచ చార్ట్‌లో నంబర్ 2 పాట !
  • విక్స్ ! దీని పుట్టుక వెనుక ఓ తండ్రి వేదన- పరిశోధన !!
  • అనగనగా ఓ దొరైస్వామి అనబడు ఓ పాత నటుడి కథ !!
  • కన్నడనాట హిట్టే- తెలుగు వెర్షన్ సో సో… కారణాలు అనేకం…
  • ఓ సైనికుడు- చావుబతుకుల్లో ఓ తండ్రి- ఒక టచింగ్ స్టోరీ

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions