Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చాగోస్ దీవులు..! హిందూ మహాసముద్రంలో అగ్రదేశాల ఆట..!!

January 22, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta....  ఇండియన్ ఓషన్‌లో నిశ్శబ్దంగా జరుగుతున్న ఒప్పందం, రేపటి ప్రపంచ శక్తి సమీకరణాన్ని మార్చే ప్రమాదకర మలుపు…

ఇది కేవలం ఒక దీవుల కథ కాదు, ఇది అమెరికా – బ్రిటన్ – చైనా – రష్యా మధ్య జరుగుతున్న గ్లోబల్ పవర్ గేమ్

Ads

 చాగోస్ దీవులు అంటే ఏమిటి?
చాగోస్ దీవులు ఇవి ఇండియన్ ఓషన్ మధ్యలో ఉన్న వ్యూహాత్మక దీవుల సమూహం. ఈ దీవుల్లో అత్యంత కీలకమైనది  Diego Garcia

ఇక్కడ ఉన్నది: అమెరికా & బ్రిటన్‌ల సంయుక్త నౌకాదళ + ఎయిర్‌బేస్…
మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఇండో–పసిఫిక్‌పై ఒకేసారి నిఘా…
ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్, గల్ఫ్ యుద్ధాల్లో కీలక పాత్ర…
సరళంగా చెప్పాలంటే డియాగో గార్షియా = అమెరికా గ్లోబల్ మిలిటరీ రీచ్‌కు వెన్నెముక…

Chagos Islands UKకి ఎలా వచ్చాయి? చరిత్ర ఏమిటి?
• 1814లో France–UK యుద్ధాల తర్వాత Mauritiusతో పాటు Chagos Islands UK చేతుల్లోకి వచ్చాయి.
• 1965లో Mauritiusకి స్వాతంత్ర్యం ఇచ్చేముందు UK, Chagos‌ ను విడదీసి కొత్త కాలనీగా మార్చింది (BIOT).
• కారణం ఒక్కటే… Diego Garciaలో US–UK మిలిటరీ బేస్…
• 1968–73 మధ్య స్థానిక Chagossians‌ ను బలవంతంగా తరిమేశారు…
• 2019లో అంతర్జాతీయ కోర్టు , యునైటెడ్ నేషన్స్: ఈ విడగొట్టడం చట్టవిరుద్ధం , వాటిను వెనక్కి ఇచ్చేయాల్సిందే అని తీర్పు…
అందుకే ఈ రోజు UK → Mauritius కి వీటిని తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి… ఇన్నాళ్లు నలుగుతూ నలుగుతూ మొత్తానికి ఇన్నాళ్లకు ఇవ్వాలి అని నిర్ణయించి ఒప్పందానికి పోతున్నారు…

 ఇప్పుడు జరుగుతున్న UK–Mauritius ఒప్పందం ఏమిటి?
United Kingdom చాగోస్ దీవులపై తన సార్వభౌమత్వాన్ని Mauritius‌ కు అప్పగించేందుకు అంగీకరించింది.
ఒప్పందంలోని కీలక అంశాలు…
✔️ చాగోస్ దీవులపై సార్వభౌమత్వం – మౌరిషస్‌కి
✔️ డియాగో గార్షియా బేస్‌ను 99 సంవత్సరాల లీజ్‌పై US–UK ఉపయోగించుకుంటాయి

కాగితాల మీద ఇది “సేఫ్ డీల్”లా కనిపిస్తుంది, కానీ జియోపాలిటిక్స్‌లో కాగితాలకన్నా శక్తి ముఖ్యం …

అసలు భయం ఎక్కడ ఉంది?
1️⃣ చాగోసియన్ ప్రజల కోణం… : స్థానిక చాగోసియన్ ప్రజలను గతంలో బలవంతంగా దీవుల నుంచి తరిమేశారు, ఇప్పుడు కూడా వారి అభిప్రాయం లేకుండానే ఒప్పందం, అందుకే తీవ్ర వ్యతిరేకత… మమ్మల్ని రక్షించండి అని ట్రంప్ కు లేఖ కూడా రాసారు…

2️⃣ చైనా కోణం …: అధికారికంగా ఒప్పందంలో “చైనాకు అప్పగింత” అనే మాట లేదు కానీ చైనా ఇండియన్ ఓషన్‌లో తన పట్టు పెంచేందుకు పోర్టులు, లీజులు, అప్పుల వ్యూహాన్ని ఉపయోగిస్తోంది. మౌరిషస్‌తో చైనాకు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. రేపు మౌరిషస్‌పై చైనా ప్రభావం ఇంకా పెరిగితే? డియాగో గార్షియాపై ఒత్తిడి వస్తే? ఇదే అసలు స్ట్రాటజిక్ నైట్‌మేర్

 ఈ అంశంపై ట్రంప్ స్పందన
ఈ డీల్‌పై ట్రంప్ అసాధారణంగా ఘాటుగా స్పందించారు.
ట్రంప్ మాటల్లో…
“మా ‘బ్రిలియంట్’ నాటో మిత్రదేశం ఎలాంటి కారణం లేకుండా అమెరికాకు అత్యంత కీలకమైన డియాగో గార్షియా దీవిని వదిలేయడం పూర్తి బలహీనత (Total Weakness).”
“ఇది GREAT STUPIDITY. చైనా, రష్యా లాంటి శక్తులు బలహీనతను మాత్రమే గమనిస్తాయి.”
ట్రంప్ స్పష్టంగా చెప్పింది రష్యా, చైనా= ఇవి డిప్లమసీని కాదు — శక్తినే గౌరవిస్తాయి.

 గ్రీన్‌ల్యాండ్ ఎందుకు ప్రస్తావించాడు?
ట్రంప్ ఈ అంశాన్ని గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా ఎందుకు కొనాలి/స్వాధీనం చేసుకోవాలి అనే తన పాత వాదనకు లింక్ చేశాడు.
అర్థం ఏమిటంటే కీలక భూభాగాలు వదిలితే, భవిష్యత్‌లో జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుంది
Land = Power = Security

భారత్‌కు దీని అర్థం ఏమిటి?
భారత్ కోణంలో ఇండియన్ ఓషన్‌లో శక్తి సమీకరణ మారితే… చైనా ప్రభావం పెరిగితే, భారత భద్రతపై నేరుగా ప్రభావం. అందుకే ఈ డీల్‌ను భారత్ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. కాకపోతే ఈ డీల్ ను ప్రస్తుతానికి హర్షిస్తున్నాం అని చెప్పింది. చైనా ప్రాబల్యం పెరిగితే ఎలా డీల్ చేయాలో భారత్ కు తెలుసు కాబట్టి తవ ఆట తాను తెలివిగా ఆడుకుంటుంది.

తుది సారాంశం (Bottom Line) …. ఇది చిన్న డిప్లమాటిక్ ఒప్పందం కాదు, ఇది ఇండియన్ ఓషన్‌లో పవర్ షిఫ్ట్‌కు సంకేతం… నిశ్శబ్దంగా జరిగే ఒప్పందాలే రేపటి అనిశ్చిత దిశను నిర్ణయిస్తాయి. శాంతి మాటల్లో ఉంటుంది… కానీ జియోపాలిటిక్స్ ఎప్పుడూ శక్తి భాషలోనే మాట్లాడుతుంది…. —– ఉపద్రష్ట పార్ధసారధి

#ChagosIslands #DiegoGarcia #IndianOcean #Geopolitics #Trump #UKMauritiusDeal #ChinaFactor #RussiaFactor #GlobalPower #PardhaTalks

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చాగోస్ దీవులు..! హిందూ మహాసముద్రంలో అగ్రదేశాల ఆట..!!
  • చైన్లు కాదు గానీ… అప్పట్లో మా కొట్లాటల్లో సోడా బుడ్లు పగిలేవి బాగా…
  • సరిగ్గా 30 ఏళ్లు… తెలుగు శాటిలైట్ చానెళ్ల తొలి రోజుల బాలారిష్టాలు…
  • 25 లక్షల లైకుల వైరల్ ఇన్‌స్టా పోస్ట్… ఇంతకీ ఏముందీ ఇందులో..?
  • బయట హరీష్ ప్రచారం వేరు… సిట్ అసలు విచారణ నిజాలు వేరు…
  • పెళ్లికాని ప్రసాదులు..!! నిజానికి సీరియస్ వార్తే… రాబోయే సంక్షోభాల సూచన..!!
  • లక్షల మిర్చి బజ్జీలు… వేల భక్ష్యాలు… కర్నాటక జాతరల స్పెషాలిటీ…
  • జోలా జోలమ్మ జోలా… ఈ సినిమాకు ‘సూత్రధారులు’ ఎవరయ్యా అంటే…
  • థాంక్స్ రెహమాన్… నీ అభిమానుల కళ్లు కూడా తెరిపించావు…
  • అబుదాబి ఆయిల్ క్షేత్రాల్లో… ఇండియా సొంత ఉత్పత్తి… శుభసంకేతం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions