Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వైరల్ సాంగ్ దారిపొంటత్తుండు… ఆ పాట సాహిత్యం ఇదుగో ఇలా…

June 10, 2025 by M S R

.

‘‘నువ్వు దారిపొంటొత్తండు అనే పాట గురించి గొప్పగా రాసినవు కదా, అసలు టూఎక్స్ స్పీడుతో పోతంది, పైగా డీజే మోత… లిరిక్స్ అర్థం గాకపోతే అదేం పాటోయ్…’ అన్నాడు ఓ హితైషి మందలింపుగా… అసలు మామూలు తెలుగులో, అంటే మనకు ఇన్నాళ్లూ అలవాటైన తెలుగులో చెప్పు ఆ సాహిత్య్ం ఏమిటో… లేదా అందులోని కొన్ని పదాల అర్థాలేమిటో చెప్పు అని ఆర్డరేశాడు…

నిజమే, ఆయనది నల్గొండ జిల్లాలో ఏపీ బోర్డర్ వైపు… ఆ పాటేమో అచ్చంగా కరీంనగర్ యాస… అత్తండు, అడ్లు, కొత్తలు ఎట్సెట్రా… ఎస్, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి తదితర జిల్లాలకు అంత త్వరగా జీర్ణం కాదు… పైగా అక్కడక్కడా తింగరోడు వంటి అన్య ప్రాంత పదాల కల్తీ కూడా ఉంది…

Ads

సరే, కాస్త అర్థం చెప్పుదాంలే అనుకుని మళ్లోసారి యూట్యూబులో చెక్ చేస్తే… నాగదుర్గ చేసిన పాట మూడు వారాల్లో 1.7 కోట్ల వ్యూస్ దాటిపోయింది… సేమ్ ట్రీ మ్యూజిక్ వాళ్లే… ఇదే పాటను 3 నెలల క్రితం వేరే యాక్టర్లతో చేశారు… దాదాపు సేమ్ వ్యూస్…

కాకపోతే నాగదుర్గ పక్కన హీరోలుండరు కదా, స్టెప్స్ కూడా చాలా డిఫరెంటుగా కంపోజ్ చేశారు… పాత వీడియోకు కంపోజర్ పైండ్ల రాజేష్, కొత్త వీడియోకు శేఖర్ వైరస్ అట… ఏమయ్యా, ఓ శేఖర్ మాస్టరూ.,.. ఇదుగో ఈ ఫోక్ శేఖర్ స్టెప్స్ ఓసారి చూడు… వెగటు స్టెప్పులు చేయడం కాదు…

మరోవైపు ఫేస్‌బుక్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు… రీల్స్, షార్ట్స్ బోలెడు కనిపిస్తున్నాయి ఈ పాటతో… సేమ్, నాగదుర్గ స్టెప్పులు… మొత్తానికి తన అలవాటైన సంప్రదాయ ధోరణికి భిన్నమైన లుక్కులతో, స్టెప్పులతో చేసిన ప్రయోగం హిట్ అన్నమాట… అవునూ, మనం పాట సాహిత్యం గురించి కదా చెప్పుకుంటున్నది… నెట్‌లో కనిపించింది ఇలా…



ఆహా… దారిపొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు
దారిద్దునా పోనిద్దునా
జోరు మీద అత్తుండు కారు మీద అత్తండు
తోలేద్దునా పోనీ ఉకుంద్దునా

దారిపొంటత్తుండు రానిద్దునా
తొవ్వ పొంటత్తుండు పోనిద్దునా
నా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక
నా ఎనక పడుత్తుండు నా ముందుటుంటుండు
సంధిద్దునా వద్ద వందిద్దునా
ఇనుకుంటా పోతాండు అనుకుంటా వతాండు
బందైదునా బంధమై చూపనా

ఆహా గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు
గాలిద్దునా.. అహహా
అహ ఆహా గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు
గాలిద్దునా ఇన్నీ గోలిద్దునా

రాయే పోయే అంటుండు రౌసు పెట్టుకుంటుండు
రమ్మందునా విన్నీ పొమ్మందునా
గాలి గాలిజేత్తుండు గరమైదునా
సోయి లేకంటుండు సంధుద్దునా
గాలిగాలి గాలిగాలి గాలిగాలి గాలిగాలి
గాలిగాలి చేత్తుండు గడుసుదాన్ని అంటుండు
తల తింటాడే తరమైతలే
సోయి లేకంటుండు సోపతైతాంటాండు
సోయి ఉన్నదో వీనికి సోకున్నదో

ఆహా తిప్పిచుకుంటుండు తప్పిచుకుంటుండు
ఒప్పిద్దునా విన్నీ తప్పిద్దునా
ఈడైతానంటుండు జోడైతానంటుండు
ఇరిసేద్దునా విన్నీ మరిసుందునా

తిప్పిచుకుంటుండు తింగరోడే
తప్పించుకుంటుండు తిక్కలోడే
వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి
వర్రిచ్చికుంటుండు జర్రాగే అంటుండు
రానియ్యడే ముందుపోనియ్యడే
ఆగమైతంటుండు అంగడైతంటుండు
ఎగైతాడో వీడేమైతాడో

ఆహా ఎట్లైతే గట్లాయే ఎంబడే ఉండోయి
వెనక రావోయి నా వెంట రావోయ్
నీ మీద మనసయింది వరసైతే కలిసింది
ఇడిసుండకొయ్ పిల్లగా మరిసుండకొయ్
నాగు పాము కోపమొడే జెర్రు పోతు పిరుకోడే
అగ్గగో అగ్గగో అగ్గగో అగ్గగో
అగ్గగో కొమరెల్లి మల్లన్న కొలిసి మొక్కుతున్న
కంటసూడే మమ్ము జంట చెయ్యే
ఐలేని మల్లన్న ఆశతో మొక్కుతున్న
అన్ని కలిసే తొవ్వ చూపరాదే

పర్వతాల మల్లన్న పప్పతి పడుతున్న
మరవబాకే మమ్ము కలుపరాదే
ఎములాడ రాజన్న కోడినే కడుతాను
ఎంబాటుండేటోన్ని పిలవరాదే

nagadurga

ఆహా… దారిపొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు
దారిద్దునా పోనిద్దునా
జోరు మీద అత్తుండు కారు మీద అత్తండు
తోలేద్దునా పోనీ ఉకుంద్దునా

(దారిలో వస్తున్నాడు, స్పీడ్‌గా వస్తున్నాడు… దారి ఇవ్వాలా, పోనివ్వాలా… జోరు మీద వస్తున్నాడు, కారు మీద వస్తున్నాడు, పోనివ్వనా లేక ఊర్కోవాలా…)

దారిపొంటత్తుండు రానిద్దునా
తొవ్వ పొంటత్తుండు పోనిద్దునా
నా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక
నా ఎనక పడుత్తుండు నా ముందుటుంటుండు
సంధిద్దునా వద్ద వందిద్దునా
ఇనుకుంటా పోతాండు అనుకుంటా వతాండు
బందైదునా బంధమై చూపనా

(నా వెనుకే పడుతున్నాడు… ఎప్పుడూ నా ముందే కనిపిస్తున్నాడు, పక్కకు జరగనా, విసిగించనా… ఏదో వినుకుంటూ వస్తున్నాడు, ఏదో అనుకుంటూ పోతున్నాడు, ఆపేయనా, బంధమై పోనా…)

ఆహా గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు
గాలిద్దునా.. అహహా
అహ ఆహా గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు
గాలిద్దునా ఇన్నీ గోలిద్దునా

రాయే పోయే అంటుండు రౌసు పెట్టుకుంటుండు
రమ్మందునా విన్నీ పొమ్మందునా
గాలి గాలిజేత్తుండు గరమైదునా
సోయి లేకంటుండు సంధుద్దునా
గాలిగాలి గాలిగాలి గాలిగాలి గాలిగాలి
గాలిగాలి చేత్తుండు గడుసుదాన్ని అంటుండు
తల తింటాడే తరమైతలే
సోయి లేకంటుండు సోపతైతాంటాండు
సోయి ఉన్నదో వీనికి సోకున్నదో

(గాలి గాలి చేస్తున్నాడు, పెద్ద గండమైపోయాడు… గాలించనా, వేయించనా… రావే పోవే అంటాడు, గొడవ పెట్టుకుంటాడు, రమ్మననా, పొమ్మననా… కోపగించనా, పక్కకు వెళ్లిపోనా… గడుసుదాన్ని అంటాడు, తల తింటున్నాడు, వశపడతలేదు… సోయి లేక ఉంటాడు, దోస్తీ చేస్తానంటాడు… ఇది సోయా, లేక వీడి సోకా..?)

ఆహా తిప్పిచుకుంటుండు తప్పిచుకుంటుండు
ఒప్పిద్దునా విన్నీ తప్పిద్దునా
ఈడైతానంటుండు జోడైతానంటుండు
ఇరిసేద్దునా విన్నీ మరిసుందునా

(తిప్పించుకుంటాడు, తప్పించుకుంటాడు, ఒప్పించాలా, వీడిని తప్పించాలా… ఈడూ జోడూ అంటాడు, వీడి కథను ఇక్కడే విరిచేయనా, మరిచిపోనా…)

తిప్పిచుకుంటుండు తింగరోడే
తప్పించుకుంటుండు తిక్కలోడే
వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి
వర్రిచ్చికుంటుండు జర్రాగే అంటుండు
రానియ్యడే ముందుపోనియ్యడే
ఆగమైతంటుండు అంగడైతంటుండు
ఎగైతాడో వీడేమైతాడో

(ఒకటే వాగనిస్తాడు, కాస్త ఆగవే అంటాడు… రానివ్వడు, ముందుకు పోనివ్వడు, నేను ఊఁ అనకపోతే ఆగమైపోతాడట, అంగడైపోతాడట… ఏమైపోతాడు వీడు…)

ఆహా ఎట్లైతే గట్లాయే ఎంబడే ఉండోయి
వెనక రావోయి నా వెంట రావోయ్
నీ మీద మనసయింది వరసైతే కలిసింది
ఇడిసుండకొయ్ పిల్లగా మరిసుండకొయ్
నాగు పాము కోపమొడే జెర్రు పోతు పిరుకోడే

(సరే,  ఎట్లయితే అట్లాయె, నా వెంబడే ఉండవోయి, నా వెనుకే రా, నా వెంటే రా, నీమీదే మనసవుతోంది, వరస కూడా కలిసింబది, నన్ను విడిచి ఉండకోయి, ఓ అబ్బాయీ, నన్ను మరిచి ఉండకోయి, అసలే నాగుపాము కోపమున్నోడు, కాకపోతే జెర్రిపోతుకున్నంత పిరికి కూడా…)

అగ్గగో అగ్గగో అగ్గగో అగ్గగో
అగ్గగో కొమరెల్లి మల్లన్న కొలిసి మొక్కుతున్న
కంటసూడే మమ్ము జంట చెయ్యే
ఐలేని మల్లన్న ఆశతో మొక్కుతున్న
అన్ని కలిసే తొవ్వ చూపరాదే

(కొమురవెల్లి మల్లన్నా నిన్ను కొలుస్తా, మొక్కుతా, కాస్త కరుణ చూడు, మమ్మల్ని జంటగా చేయి, ఐలేని మల్లన్నా, ఆశతో మొక్కుతున్నా నీకు, అన్నీ చక్కబడే దారి చూపు…)

పర్వతాల మల్లన్న పప్పతి పడుతున్న
మరవబాకే మమ్ము కలుపరాదే
ఎములాడ రాజన్న కోడినే కడుతాను
ఎంబాటుండేటోన్ని పిలవరాదే

(పర్వతాల మల్లన్నా, దండం పెడుతున్నా, మరిచిపోకు, మమ్మల్ని కలుపు కాస్త… వేములవాడ రాజన్నా కోడెను కడతా, నా వెంబడే ఉండేవాడిని నాకు కలుపు…) …… (హేమిటో… వేరే భాషల నుంచి కాదు, ఒకే భాషలోని, ఒకే యాసలోని తేడాల నడుమ అనువాదం… కొత్తగా ఉంది…)

నాగదుర్గ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇవే, తగ్గించుకుంటే మంచిది… శ్రీలీల వస్తే మంత్రి స్పీచ్ ఆగిపోవాలా..?
  • కాలం మారింది… పేరున్న నటులూ ఓటీటీల్లోకే నేరుగా ఎంట్రీ…
  • గికియు… గూగీ… ఒక ఆఫ్రికన్‌ వీరగాథ… వీరుడా, నీకు జోహార్లు…
  • క్వశ్చన్ అవర్..! పాత అక్రమాలకు ప్రతిపక్షం ప్రశ్నించబడుతోంది..!!
  • అఖండ తాండవం… బాలయ్య సినిమాలో పహల్‌గాం బాపతు సీన్…
  • వైరల్ సాంగ్ దారిపొంటత్తుండు… ఆ పాట సాహిత్యం ఇదుగో ఇలా…
  • ట్రిపుల్ యాక్షన్… కురూపి పాత్ర… కృష్ణ మరో సాహసం ఇది…
  • మరణం తరువాత..? ఓ చిక్కు ప్రశ్న… ‘మళ్లీ బతికిన’ ఆమె చెప్పేదేమిటంటే..?
  • ఆ NTR డర్టీ వెగటు పాటతో ఇక డ్యూయెట్స్ పూర్తిగా మానేసింది వాణిశ్రీ..!!
  • నాలుగో క్లాసులో గొడవ… 53 ఏళ్ల తరువాత తన్నుకున్నారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions