.
Ashok Pothraj ……… బ్లాక్ (డార్క్) తెలుగు ….. రంగం ఫేం జీవా అండ్ ప్రియా భవానీ శంకర్ ఇద్దరు నటించిన ఈ చిత్రం తమిళంలో బ్లాక్ తెలుగులో డార్క్ పేరుతో అనువాదం జరిగింది. అక్టోబర్ 2024లో తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి జి.కె.బాలసుబ్రమణి దర్శకుడు.
ఐతే ఈ సినిమా “కొహెరెన్స్” అనే హాలీవుడ్ చిత్రానికి అనువాదం. కేవలం రూ. 5 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం తమిళంలో 50 కోట్ల మేరకు భారీ వసూళ్లు రాబట్టింది. సైన్స్ ఫిక్షన్ ని బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా సంగతేంటో చూద్దాం రండి.
Ads
నిన్నటి నుండి అమేజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. కథ విషయానికి వస్తే వీరు ఇద్దరు నగరానికి దూరంగా ఒక విల్లా కొనుగోలు చేసి వీకెండ్ అందులో గడుపుదామనీ అక్కడికి వస్తారు.
వారు వచ్చిన రోజు పగలంతా బాగానే ఉంటుంది. రాత్రి అయిన తర్వాత అసలు కథ మొదలవుతుంది.
అక్కడ జరిగే చిత్రవిచిత్రమైన సంఘటనలకు వారు భయపడి తిరిగి వెళ్లిపోయే క్రమంలో వాళ్లు ఎటు వైపు వెళ్లినా తిరిగి తిరిగి అదే విల్లాకి వచ్చి చేరుతుంటారు. వారి చుట్టూ ఒక డార్క్ లైన్ సర్కిల్ చేసి ఉంటుంది. తర్వాత అక్కడ ఏం జరుగుతుంది. వారు ఎలా అక్కడి నుండి బయటకు వచ్చారు అనే విషయాల కోసం సినిమా చూడాల్సిందే.
ఐతే ఈ సినిమా ద్వారా ఈ సృష్టితో మనిషికి , సాంకేతిక పరిజ్ఞానానికి ఎలాంటి చర్యలు ముడిపడి ఉన్నాయో అవీ ఎప్పుడు ఎలా జరుగుతాయో చూపించే ప్రయత్నం చేశారు.
బ్రిటిషు కాలంలో అక్కడ ఒక సీక్రెట్ రీసెర్చ్ సెంటర్ ఉండేది. అక్కడ దేని కోసం రీసెర్చ్ జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ 1941లో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగితే దాని ఇంపాక్ట్ ఇంకా అక్కడ చూపిస్తుందట. దాన్నే క్వాంటం ఫిజిక్స్ లో సూపర్ పొసెస్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే అదొక ప్యారలల్ రియాల్టీ. అక్కడ ఉంది మనమే కానీ వేరే లాంటి మనం అన్నట్టు.
కానీ.. మాడరన్ సైన్స్ మనకు మల్టిపుల్ రియాల్టీస్ ఉన్నాయని చెబుతుంది. స్లోడింగర్ అనే సైంటిస్ట్ ఈ ప్యారలల్ రియాల్టీ కి ఒక సిద్ధాంతం చెప్పారు. మనం ఆ టైంలో ఒకే ఒక రియాల్టీని చూడగలం అదే ప్రకృతి యొక్క సమాన స్తితి.
అక్కడ ఉన్నది ఉత్త డార్క్ కాదు ఒక పోర్టల్, ఒక గేట్ వే. వాళ్లు వెళ్లిన ప్రతిసారి ఆ డార్క్ ని క్రాస్ చేసినపుడు ఒక కొత్త టైమ్ లోకి ప్రవేశిస్తారు. ఇలాంటి టైమ్ లైన్స్ అనేకం కనెక్ట్ చేసే ఆ స్పాట్ పేరు “వామ్ హోల్” అని అంటారు.
ఈ వామ్ హోల్ అనేది ఒక ఇన్విజబుల్ టన్నెల్ అంటే ఒక సొరంగం లాంటిది. రెండు టైమ్ లైన్లను రెండు ప్యారలల్ కోడ్స్ ని కనెక్షన్ చేసేదే ఈ వామ్ హోల్. టైమనేది ఒక రిలేషన్ని కంపార్ చేయడానికి, దానికి ఇంకొక డెఫినేషన్ లేకపోతే మనకు టైమ్ మారుతుంది అని తెలిసే అవకాశమే లేదు. సో వారు ఏ టైమ్ లైన్ లో ఉన్నారో అదే రియాల్టీ.
మీకు బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసా..? అది దానిలోకొచ్చే ఆబ్జెక్ట్స్ ని వేరే ఒక ప్యారలల్ రియాల్టీలోకి రిపోర్టు చేస్తుందని ఒక థియరి ఉంది. అదే “సూపర్ మూన్”. ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్ 60 ఏళ్ళకొకసారి ప్రతీ నలబైఐదు నిమిషాలు మాత్రమే అదీ అలా ఉంటుంది. ఆ రాత్రి అదే సర్కిల్ లో వీరిద్దరూ బందీ అవుతారు. సో, నేను చెప్పేది మీకు అర్దం ఔతున్నట్టే ఉంటుంది కానీ అర్థం కాదు అనుకుంటున్నా.
ఇదంతా చెపుతున్నా నేనేమీ పరిశోధనలు చేయలేదు. ఏదో సినిమాలో జరిగిన థియరీని ఇలా ఎక్స్ ప్రెస్ చేయడానికి ప్రయత్నించాను.
#dark #block #jeeva #priyabhavanishankar
#amazonprime #OTT #telugucinema #science #sciencefiction #fbpost2025 #artist #art #trending #model #followers #friends #foryou #follower #facebookviral
Share this Article