Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదేం సినిమార భయ్… మొత్తం తాగుడు సీన్లే… తాగొద్దురా అని చివరలో నీతి…

April 2, 2023 by M S R

Sankar G………..  మొట్టమొదటి సారి తారకరామ ధియేటర్ (కాచిగూడ) వెళ్ళాను. ఆసియన్ వారు బ్రహ్మాండంగా పునర్నినిర్మించారు. సీటింగ్ అద్భుతంగా విశాలంగా అమార్చారు. RC సీటింగ్ ఏర్పాటు చేశారు. కాళ్ళు బార్లాచాపుకుని సినిమా చూడొచ్చు.

సినిమా దసరా… ఈ దర్శకుడికి ఇదే మొదటి సినిమా అట. అంతకుముందు సుకుమార్ దగ్గర అసోసియేట్ గా చేశాడు అని చెబుతున్నారు. సినిమాలో ఆ మేకింగ్ స్టయిల్ కనపడింది. కానీ సినిమాయే చెత్తగా అనిపించింది.

దానికి కారణాలు… మొదటి సీన్ లోనే బాలనాని అమ్మమ్మ కోసం సారా పట్టుకొస్తాడు. ఆ ముసిల్ది ఆత్రంగా దాన్ని అందుకుని గబగబా నీళ్ల చెంబులో పోసుకుని తాగేస్తుంది. ఎందుకు తాగావని అడిగితే ధైర్యం కోసం అంటుంది. ప్రతి తాగుబోతు తాగాటానికి ఏదొక రీజన్ చెప్పినట్టు. అది బాల నాని మైండ్ లో బలంగా ఫిక్స్ అయ్యి తాగందే ధైర్యం రాదనే మూల సూత్రాన్ని నమ్మి సగం సినిమా వరకు ఎత్తిన మందు బాటిల్ దించడు. హీరో ఇంట్రడక్షన్ ఎలివేషన్ కూడా నోట్లో మందు బాటిల్ తో ప్రత్యక్షం ఔతాడు. ఇంత బిల్డప్ ఇచ్చి చేసి చేసేదేమిటంటే గూడ్స్ భోగిలోని బొగ్గు దొంగిలించటం. ఇలాంటి పనులు మాములుగా కర్రకు కొక్కెమ్ లాంటిది తగిలించి ట్రాక్ పక్కన నుల్చుని గూడ్స్ లోని బొగ్గు లాగేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్లు, చిన్నపిల్లలు కూడా..

Ads

ప్రేమకథ… పదేళ్లు కూడా లేని బుడతడు ఒక ఏడేళ్ల పిల్లను ప్రేమిస్తాడు. ఆ విషయం చెప్పాలనుకునే లోపే తన దోస్తు కూడా ఆ పిల్లను ప్రేమించానని చెప్పగానే తన మూగ ప్రేమను దోస్తు కోసం త్యాగం చేస్తాడు. హీరో తన ప్రేమను త్యాగం చేసిన విషయం క్లయిమాక్స్ వరకు హీరోయిన్ కూ తెలియదనుకోండి అది వేరే విషయం. (ఆ లెక్కప్రకారం నేనూ ఓ ఇరవైమంది అమ్మాయిలను చిన్నప్పటి నుండి ప్రేమించి ఆ విషయం వారికి చెప్పకుండా ఇతరుల కోసం త్యాగం చేశాను. మీరు నమ్మాలి.)

స్నేహితుడికి, హీరోయిన్ కి పెళ్ళవగానే తన త్యాగం ఫలించినందుకు సంతోషించాల్సింది పోయి ఎక్కడో ఒక మూల చెట్టుకింద కూర్చుని ఏడుస్తుంటాడు. హీరో ఇంకో దోస్త్ వచ్చి ఏం చేస్తున్నావ్ రా ఇక్కడ అంటే.. ఉచ్చ పోసుకోవటానికి వచ్చిన అని చెబుతాడు. ఆ హీరో కన్నీళ్లను ఫ్రెండ్ టచ్ చేసి ఇదేనారా ఉచ్చ అంటాడు. సినిమాలో ఈ డైలాగ్ మాత్రం భలే పేలింది.

ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదే సమయంలో పెళ్లి చేసుకున్న హీరో ఫ్రెండ్ కూడా ఉచ్చ పోసుకోవటానికి అక్కడికే వచ్చి రహస్యంగా ఈ రహస్యం వింటాడు. అంతే శోభనం కూడా జరుపుకోకుండా తాగుబోతుల అడ్డా అయిన సిల్క్ బార్ కు వెళ్లి విలన్ మనుషుల చేతుల్లో చస్తాడు.

ప్రేమ గొప్పదా… కామం గొప్పదా… ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటాం. కాదు ఇది ఫోర్ యాంగిల్ లవ్ స్టోరీ. అంటే విలన్ కూడా ఆ హీరోయిన్ చిన్నప్పటి నుండి కన్నేసి ఉంటాడన్నమాట. చాలామందికి ప్రేమకు, కామానికి తేడా తెలియదు. కానీ ఈ విలన్ కు ఆ విషయంలో పిచ్చ క్లారిటీ ఉంది. అందుకే హీరోయిన్ కామిస్తాడు. అంతేకాదు తనో రావణుడిలా ఫీల్ అయి మండోదరి లాంటి పెళ్ళాన్ని వెంట తీసుకెళ్లి ఒంటరిగా ఉన్న హీరోయిన్ తో చెబుతాడు నేను నిన్ను కామిస్తున్నాను నేను తప్ప నీ ఒంటి మీద ఎవరు చెయ్యేసినా చంపేస్తాడు అంటాడు. అంటే ఇద్దరు ప్రేమిస్తే ఒకడు కామిస్తే ఇది ఫోర్ యాంగిల్ స్టోరీ అయ్యిందన్నమాట. సరే, పెళ్లి చేసుకున్న పుణ్యానికి హీరో ఫ్రెండ్ కాకుండా మిగతా ఫ్రెండ్స్ నూ చంపిస్తాడు. బహుశా వాళ్ళు కూడా హీరోయిన్ వంటి మీద చెయ్యి వేస్తారేమో అని అనుమానం వచ్చి ఉంటుంది. అందుకే అందర్నీ లేపేసి ఉంటాడు.

టైటిల్ జస్టిఫికెషన్…. విలన్ హీరోతో అంటాడు నిన్ను దసరా రోజు చంపేస్తా అని… బహుశా విలన్ హీరోను దసరా రోజే చంపాలని నిర్ణయించుకుని అదే రోజు తను చచ్చి దసరా టైటిల్ కు న్యాయం చేశాడు. చివర్లో హీరో భారీగా ఫైటింగులు గట్రా చేసి విలన్ గ్యాంగ్ నంతా చంపేసి పోలీసులు తీసుకెళ్ళేటప్పుడు తిరిగి హనుమంతుడిలా లంఘించి, 50 అడుగుల ఎత్తున్న రావణుడి మండుతున్న దిష్టి బొమ్మ పై ఎగసి, కుప్పించి అక్కడ దాచిన ఆయుధం తో విలన్ ని చంపేస్తాడు.

సామాజిక సమస్య… తాగుడు వల్ల ఊరు నాశనం ఔతుందని సిల్క్ బార్ ను జైలునుండి వచ్చిన హీరో తగులబెడతాడు. సినిమా మొత్తం తాగుడే చూపించి చివర్లో తాగటం తప్పని చూపించటం ఎలావుందంటే సినిమా మొత్తం అసభ్యకర సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు, అక్రమ సంబంధాల చూపించి చెడు తిరుగుళ్ల వల్ల జనాలు పాడవుతారు అలాంటివి మానుకోండి అని నీతివ్యాఖ్యలు చెప్పి సినిమాకు ముగింపు నిచ్చినట్టుగా ఉంది.

నటన మరియు డైలాగ్స్… నేను మాభూమి దగ్గర నుండి నిన్నటి బలగం వరకు తెలంగాణా స్లాంగ్ ను ఎంజాయ్ చేశాను. ఈ యాసలో హాస్యం, వ్యంగ్యం, బాధ, సంతోషం అన్నీ ఎంతో సహజంగా అనిపిస్తాయి. కానీ ఈ సినిమాలోని మాండలికం అస్సలు నచ్చలేదు. కొంత బాగున్నా కొన్ని డైలాగ్స్ అర్థం కూడా కాలేదు.

మంచి నటులైన సాయికుమార్, సముద్రఖని ఇద్దరినీ సరిగా ఉపయోగించుకోలేదు. ఇక విలన్ పాత్రధారి మలయాళ నటుడు షెన్ చాకో మన తెలుగు లో అజయ్, సుబ్బరాజు లాంటివాళ్ళు వేసే క్యారెక్టర్ లు చేస్తుంటాడు. మరి ఏం చూసి పట్టు కొచ్చారో తెలియదు. అయినా పర్లేదు, బాగానే చేశాడు. నానీ తెలంగాణ యాసలో డైలాగ్స్ బాగా చెప్పినా అంత గొప్పగా అనిపించలేదు. ఇక హీరో ఫ్రెండ్ గా చేసిన దీక్షిత్ చాలా బాగా చేశాడు. కీర్తి సురేష్ బాగా చేసింది. ఒక డైలాగ్ చెబుతుంది నేనేమన్నా ఆటబొమ్మనారా… ఎవడు పడితే వాడు తీసుకు పోవటానికి అని… నాకూ అలాగే అనిపించింది.

సుక్కల అంగీ పాట బైట వినటానికి బాగుంది సినిమాలో అంత ఊపు రాలేదు. చివరిగా డైరెక్టర్ లో మంచి మేకింగ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాల మ్యానియాతో ఇలాంటి పిచ్చి కథలు రాసుకుంటే ఏ ఉపయోగం ఉండదు. దీనికి IMDB రేటింగ్ 8/10 అని ఉంది. ఈ రేటింగ్స్ కూడా మేనేజ్ చేస్తారు. అదింకో ముచ్చట. దీనికోసం మార్కెటింగ్ టీములు కూడా ఉంటాయి. పాన్ ఇండియా రిలీజ్ చేశారు.. పుష్ప ను చూశారు దీన్నెందుకు చూడరు అని వీరి భావన కావచ్చు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
  • నూకల అత్తెసరు..! ఈ తరానికి తెలియని సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
  • ఎస్.జైశంకర్..! నాన్- పొలిటికల్ మంత్రిగా ఓ విశిష్ట ఎంపికే..! చదవండి..!
  • అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…
  • విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
  • వయస్సు ఓ దశ దాటాక ఎలా బతకాలి..? గానుగెద్దు జీవితం వదిలేదెలా..?
  • గూఢచారి జ్యోతి… ఎన్ఐఏ‌ను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
  • అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…
  • పాకిస్థానీ క్యాంపెయిన్ టీమ్‌లో ఈ ఇద్దరూ… వారి చుట్టూ ఓ ప్రేమకథ…
  • ‘‘ఛలో, ఇండియా ప్రచారాన్ని మనమూ కౌంటర్ చేద్దాం, టాంటాం చేద్దాం…’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions