దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి… మళ్లీ ఇదో సందిగ్ధం… ప్రతిసారీ ప్రతి పండక్కీ ఇదే సందేహం తలెత్తుతోంది… వచ్చీ రాని పాండిత్యంతో, కన్విన్స్ చేయలేని వాదనలతో కొందరు సంఘాలుగా ఏర్పడి మరీ విప్రోత్తములు సలహాలు పారేస్తుంటారు…
కేసీయార్ కాలం కాస్త బెటర్… స్వాములు కనిపిస్తే చాలు పాదాల మీద పడిపోయే ఆయన విద్వత్తు, పరిషత్తు అనే పేర్లతో ఎవరైనా ఏదైనా చెబితే కళ్లకద్దుకునేవాడు… అంతటి విశాఖ అక్రమ స్వరూపానందుడికే జాగాలు, భూములు రాసిచ్చినోడు కదా… (మరి రేవంత్ దాన్నేం చేశాడు అనడక్కండి… ఇది మరీ అరాచకం కేసు…)
ఎవరు శాస్త్రీయంగా పండుగల తేదీలు ఇవీ అని చెప్పేవారు..? లేరు… ఎవరెవరో చెబుతుంటారు, కానీ వాళ్లకు క్రెడిబులిటీ లేదు… ఇప్పుడు దీపావళి పండుగ విషయంలోనూ అదే సందిగ్ధత… హారతులు ఎప్పుడు..? లక్ష్మి పూజలు ఎప్పుడు..?
Ads
నిజానికి బంధుగణం, ఊరివాళ్లు, స్నేహితులు ఎప్పుడు ఏది పాటిస్తే దాన్నే మనమూ పాటించడం మేలు… ఫలానారోజున, ఫలానా ముహూర్తంలోనే సత్యభామ నరకాసురుడిని వధించింది, అదే సరైన పండుగ ముహూర్తం అనడానికి ఏమీ లేదు…
వధ తరువాత ఇంటికి చేరాక దక్కిన హారతులే దీపావళి… అనగా నరక చతుర్దశి… తరువాత రోజు అమావాస్య లక్ష్మిపూజలు… ఎహె, అమావాస్య దేనికీ పనికిరాదు అంటారు, ఇక్కడ మాత్రం లక్ష్మిపూజ అంటారు, అదెలా అనడక్కండి… ఏవో క్లారిటీలు ఇస్తారు… (వ్యాపారులు ధనత్రయోదశి, దంతేరాస్ రోజులకు ఇచ్చినట్టే…)
సరే, ఒక క్లారిటీ ఇస్తాను… ధర్మపురి ఆన్‌లైన్ జ్యోతిష్య పండితుడు (Onlinejyotish.com) గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ ఏమంటాడంటే..? ‘‘ పంచాంగాలు, తేదీల రీత్యా… ఏ ఆనవాయితీ, ఏ సంప్రదాయం, ఏ ముహూర్తాల రీత్యా చూసినా సరే… 31 తేదీ (గురువారం) హారతులు… మరుసటి రోజు, అంటే ఒకటో తేదీ (శుక్రవారం – లక్ష్మివారం) లక్ష్మిపూజలు శ్రేయస్కరం…’’
లక్ష్మిపూజలు వ్యాపారులు చేసుకునే ఉత్సవం… నార్తరన్ ట్రెడిషన్ పాటించే వ్యాపారులు, ప్రత్యేకించి తెలంగాణ వ్యాపారులు ఆరోజున కొత్త ఖాతాల పుస్తకాలను మొదలుపెడతారు… లక్ష్మిపూజల రోజే వారికి మూరత్… స్టాక్ ఎక్స్‌చేంజ్ కూడా ఒకటో తారీఖునే మూరత్‌గా పరిగణిస్తోంది…
సో, ఏతావాతా అర్థమయ్యేది ఏమిటంటే…? సగటు హిందూ కుటుంబం గురువారం రోజున మంగళహారతులతో నరకచతుర్దశి జరుపుకోవాలి… మెజారిటీ ప్రజలు ఉదయం వేళల్లోనే పాటిస్తారు… మరుసటిరోజున సాయంత్రం వ్యాపారులు లక్ష్మిపూజ జరుపుకోవాలి…
అవునూ, చాలామంది చాలారకాలుగా చెబుతారు కదా అంటారా..? ప్రదోష సమయాలు, దేశం మొత్తం ప్రామాణికంగా పరిగణించే దృక్ పంచాంగంతో సహా అన్నీ పరిగణనలోకి తీసుకునే ఈ ధర్మపురి పంతులు చెప్పేది శాస్త్రీయంగానే తీసుకోవచ్చు… తప్పు లేదు, దోషం లేదు… కృష్ణుడికీ కోపం రాదు… లక్ష్మిదేవికీ కోపం రాదు… అదీ సంగతి…
Share this Article