.
Mohammed Rafee .......
ఇక సాంస్కృతిక సేవకు అంకితం…. – పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీకి తాను చేసిన సేవకు పార్టీ కూడా తనకు చాలా ఇచ్చిందని బండారు దత్తాత్రేయ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ్టితో ఆయన గవర్నర్ పదవీ కాలం ముగిసింది! హర్యానా రాజ్ భవన్ లో ఉద్యోగులు నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు! ఉద్వేగభరితమైన బండారు దత్తాత్రేయ తన మనసులో మాటలు వెల్లడించారు.
Ads
గల్లీ లీడర్ నుంచి తనను పార్లమెంట్ స్థాయికి, కేంద్ర మంత్రి హోదా, అక్కడ నుంచి గవర్నర్ హోదా ఇలా బహుముఖీనంగా విస్తరించడానికి పార్టీ దోహదపడిందని సంతోషం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి తలుపు తట్టినా కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటమే తన రాజకీయ జీవితం దిగ్విజయం కావడానికి కారణమని చెప్పారు.
ఎవరితో శత్రుత్వం పెట్టుకోని తన మనస్థత్వం రాజకీయాలకు నప్పదని అన్నారు! ఎందుకు సెట్ కాదో చూద్దామని ఇన్నేళ్లు కొనసాగుతూనే ఉన్నానని వివరించారు. తన మన తేడా లేకుండా అందరూ ఒక్కటే అనే మానవతావాదంతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అలాయ్ బలయ్ ను ప్రతి యేటా నిర్వహిస్తూ అన్ని పార్టీల నాయకులను ఒకే వేదిక పైకి తెస్తూ గొప్ప స్ఫూర్తిని ఇచ్చినట్లు తెలిపారు.
తన చివరి జీవితం వరకు ప్రజా సేవ చేస్తూనే ఉంటాను, కార్యకర్తలకు, పేద ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. ఇక హైదరాబాద్ లో సాంస్కృతిక సేవకు అంకితం అవుతానని, ఎంతో మంది గెస్టుగా పిలిచినా సమయం అనుకూలించలేదని, ఇక సాంస్కృతిక సంస్థలకు కూడా అందుబాటులో ఉంటానని బండారు దత్తాత్రేయ వివరించారు…. – డా. మహ్మద్ రఫీ
Share this Article