డేవిడ్ మిల్లర్… ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ క్రికెట్ ప్రేక్షకుల మనస్సుల్ని గెలుచుకున్నాడు… కీలకమైన సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో ఆట… 24 పరుగులకు 4 వికెట్లు పడిపోయిన దుస్థితి నుంచి మెల్లిమెల్లిగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ… 203 పరుగుల దాకా తీసుకెళ్లి ఔటయ్యాడు… 101 పరుగులు చేశాడు… జట్టు మొత్తం ఎన్ని పరుగులు చేసిందనేది పక్కన పెడితే… తన ఇన్నింగ్స్ మాత్రం ఇండియన్ ప్రేక్షకుల చప్పట్లకు కూడా నోచుకుంది…
మధ్యమధ్యలో వర్షం చికాకు… పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్… వరుసగా పడిపోతున్న వికెట్లు… తనొక్కడే వికెట్ కాపాడుకుంటూ, అదే సమయంలో బాల్‌ను బట్టి ఫోర్స్, సిక్సులు కొడుతూ… జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించుకున్నాడు… మిడిల్ ఆర్డర్‌లో క్లాసెన్ 47 పరుగులతో మిల్లర్‌కు భలే తోడ్పాటు అందించాడు… ఇద్దరూ కలిసి దక్షిణాఫ్రికా జట్టు పరువు పోకుండా ప్రొఫెషనల్ ఆటతీరు కనబరిచారు…
డేవిడ్ మిల్లర్ గనుక మొత్తం డెత్ ఓవర్స్‌లో ఉండి ఉంటే దక్షిణాఫ్రికా మొత్తం స్కోర్ 250 వరకూ వెళ్లేదేమో… పర్లేదు, ఆ స్కోర్ ఉంటే ఫైట్ చేయగలిగినవాళ్లే… కానీ 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది… అయితే పూర్తిగా హ్యాండ్సప్ అనలేదు… ప్రతిఘటించారు… ఇద్దరూ కలిసి 75 పరుగుల భాగస్వామ్యం… అసలు ఎవరు ఈ డేవిడ్ మిల్లర్…?
Ads
2013లోనే పంజాబ్ ఐపీఎల్ జట్టు 6 కోట్లకు వేలం పాడుకుంది ఇతన్ని… 2020లో రాజస్థాన్ రాయల్స్ కొనుక్కుంది… తరువాత గుజరాత్ టైటాన్స్… మంచి పవర్ హిట్టర్… టీ20ల్లో కూడా 4 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు… హయ్యెస్ట్ స్కోర్ 120… వన్డేలకు వస్తే, 6 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు… హయ్యెస్ట్ స్కోర్ 139… అసలు ఈ అంకెలు కాదు, నిజంగా జట్టుకు అవసరమైనప్పుడు తను కనబరిచిన వారియర్ టెంపర్‌మెంట్ మెచ్చుకోవచ్చు…
1999 ప్రపంచ కప్… సెమీ ఫైనల్స్… సేమ్ ఇదే సిట్యుయేషన్… రెండు జట్లు 213 రన్స్… ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 213 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది… దక్షిణాఫ్రికా కూడా సేమ్ రన్స్ చేసింది… ఆట టై… సో, 213 రన్స్ తో దక్షిణాఫ్రికా తక్కువ స్కోర్ చేయగానే ఆట ముగిసిపోలేదు… అసలు ఆట ఇంకా ఉంది… ఏమో చెప్పలేం… మరీ ఏకపక్షంగా ముగిసిపోనూ వచ్చు… వరుణుడు కన్నెర్ర చేస్తే కథే మారిపోవచ్చు…
Share this Article