ఒక వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది.. పంజాబ్ పాటియాలా, ఆమన్‌నగర్‌లో గత మార్చి 24న ఓ కుటుంబం ఓ బర్త్ డే కేకుకు ఆర్డర్ ఇచ్చింది… పదేళ్ల బాలిక మాన్వి బర్త్ డే అది… ఆనందంగా కేక్ కట్ చేశారు, అందరూ తీసుకున్నారు… అందరూ తన నోటిలో పెట్టి గ్రీట్ చేస్తారు కాబట్టి సహజంగానే ఆ అమ్మాయి కాస్త ఎక్కువగా తిన్నది… తరువాత ఒక్కసారిగా ఆమెకు నిద్ర ముంచుకొచ్చింది… వెళ్లి పడుకుంది,
తరువాత లేచి నీళ్లు తాగి, మళ్లీ నిస్త్రాణగా పడుకుండి పోయింది, మళ్లీ లేచి వాంతులు చేసుకుంది… నోరు ఎండిపోతోంది, మండిపోతోంది అని మొత్తుకుంది… స్పృహ తప్పింది, ఆమె చెల్లెకూ దాదాపు అంతే… మిగిలిన కుటుంబసభ్యులు కూడా ఫుడ్ పాయిజన్ అయినట్టుగా ఇబ్బందిపడ్డారు… చకచకా ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లారు… అక్కడ కన్నుమూసింది… ఇదీ సంఘటన… ఇదీ విషాదం…
తరువాత కుటుంబసభ్యులకు కేక్ క్వాలిటీ మీద, అందులో కలిపిన పదార్థాల మీద డౌటొచ్చింది… కంప్లయింట్ చేశారు… అధికారులు నాలుగు శాంపిల్స్ తీసి నాణ్యత పరీక్షలకు పంపించారు… రెండు శాంపిళ్లలో అధిక మొత్తంలో శాకరిన్ ఉనికి బయటపడింది… శాకరిన్ తెలుసు కదా… చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడే కృత్రిమ సింథటిక్ స్వీటెనర్…
Ads
కేసుల్లోనే కాదు, పానీయాల్లో, స్వీట్లలో, పలు వంటల్లో కూడా వేస్తుంటారు… నేచురల్ సుగర్‌తో పోలిస్తే డయాబెటిక్స్‌కు ఇది బెటరనే అభిప్రాయంతోపాటు, తక్కువ పరిమాణంలో ఎక్కువ తీపిని కలుగజేస్తుంది… చిన్న చిన్న మొత్తాల్లో శాకరిన్ మనిషికి ప్రమాదకరం ఏమీ కాదనే అంటుంటారు డాక్టర్లు… కానీ ఎక్కువ మొత్తం శాకరిన్ హఠాత్తుగా కడుపులో ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది… వాంతులతో క్లియర్ అవుతుంది ఆయా సందర్భాల్లో…
కానీ ఇక్కడ ఏకంగా ఓ ప్రాణమే పోయింది… కారణం..? ఇది కొంతమందికి ఎలర్జీకారకమే ఐనా సరే, ఈ కాలంలో ప్రతి మనిషి ఎంతోకొంత దానికి అలవాటై ఇమ్యూనిటీ వస్తోంది… మరి ఆ అమ్మాయి, ఆమె చెల్లె మీద ఈ విపరీతమైన ప్రభావం ఏమిటి..?
అదే బేకరీ నుంచి ఇంకొన్ని కేకుల నుంచి కూడా శాంపిళ్లు తీసి పంపించారు, రిజల్ట్ చూడాలి… ఆన్‌లైన్ ఫుడ్ యాప్ ద్వారా స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి చేయించిన కేక్‌లో పొరపాటున ఎక్కువ శాకరిన్ పడిందా..? లేక మొత్తం ఆ బేకరీలోనే ఎక్కువ శాకరిన్ వాడుతున్నారా..? తేలాల్సి ఉంది… అంతేకాదు, ఫోరెన్సిక్ పరీక్షల్లో నిజంగానే శాకరిన్ వల్లే ఈ మరణం సంభవించిందా, లేక మరో కారణం ఏమైనా ఉందా శాస్త్రీయంగా తేలాల్సి ఉంది…
కాకపోతే శాకరిన్ ఎక్కువ ఉన్నట్టు డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ తమ పరీక్షల్లో తేలినట్టు చెబుతున్నాడు… అదీ నెల రోజుల తర్వాత… సరే, ప్రభుత్వ శాఖల్లో పరీక్షలు, ఫలితాలు గట్రా ఎలా ఉంటాయో తెలిసిందే కదా… ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వేచిచూస్తున్నారు…
ఇక్కడ తలెత్తుతున్న డౌట్ ఏమిటంటే..? ఆ బేకరీలో సహజంగానే ఎక్కువ శాకరిన్ కలుపుతూ ఉన్నట్టయితే అక్కడ కేకులు తీసుకున్న వాళ్లకు ఎంతోకొంత ప్రభావం కనిపించాలి కదా… శాకరిన్ నిజంగానే ఈ కేకులోనే ఎక్కువ వేసి ఉన్నట్టయితే, మరీ ప్రాణం పోయేంత ప్రమాదకరం ఏమీ కాదు కదా… ఒక్క కేకు కోసం శాకరిన్ సపరేటుగా వేయరు కదా… మరేం జరిగింది..? ఏదైనా కుట్ర జరిగిందా..? ద్రోహ చింతన ఉందా..? అదే ఐతే మోటివ్ ఏమిటి..? ఏమో… పోలీసులు ఏం తేలుస్తారో..!!
Share this Article