Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజంగానే ఉత్తరాది రాష్ట్రాలు ఎడాపెడా పిల్లల్ని కనేస్తున్నాయా..?!

June 25, 2025 by M S R

.

ఈమధ్య చంద్రబాబు, స్టాలిన్ పదే పదే చెబుతున్నారు… పిల్లలను బాగా కనండి అంటూ… ఎందుకయ్యా అంటే… రాబోయే రోజుల్లో మానవ వనరులే అసలైన వనరులు అనే ప్రాధాన్యత గురించి కాదు… జనాభాను బట్టి లోకసభ సీట్ల పెంపు ఉంటుందనే పొలిటికల్ కోణంలో…

మరీ చంద్రబాబు అయితే పిల్లల్లేకపోతే, ఇద్దరికన్నా తక్కువ పిల్లలుంటే స్థానిక ఎన్నికల్లో పోటీచేయనిచ్చేది లేదని కూడా అన్నట్టు ఎక్కడో చదివాను… సరే, దానికి చట్టబద్ధత విషయం పక్కన పెడితే… అసలు మనం పదే పదే చెబుతున్నాం కదా, ఉత్తరాది రాష్ట్రాలు ఎడాపెడా పిల్లల్ని కని పడేస్తున్నారు అని… నిజమేనా..?

Ads

ఏదో వాట్సప్ గ్రూపులో బాగా ఫార్వర్డ్ అవుతున్న ఓ పోస్టులోని మ్యాప్ ఇది…

population

మన దేశంలో ఫర్టిలిటీ రేటు ఎలా ఉందో చెప్పే చార్ట్… ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తేల్చిందే… 2019-20 లో… UNFPA – The United Nations Population Fund 2025 రిపోర్టు ప్రకారం కూడా… ఇండియాలో జనాభా వృద్ధి రేటు అవసరమైన దానికన్నా దిగువకు పడిపోయింది…

మామూలుగా జనాభా వృద్ధి రేటు స్థిరంగా ఉండాలంటే 2.1 ఫర్టిలిటీ రేటు ఉండాలి… కానీ అది 1.9కు పడిపోయింది… అంటే, పిల్లలు తక్కువగా పుడుతున్నారు అని… రష్యా, జపాన్ పదే పదే మొత్తుకుంటున్నాయి కదా, పిల్లల్ని కనండి అంటూ… పెళ్లిళ్లు చేసుకొండి, ఆఫీసులో పని గ్యాప్ తీసుకుని రొమాన్స్ చేసుకొండి అని కూడా  అంటున్నాడు పుతిన్…

ఒక్కరు చాలు అనే నినాదంతో జనాభా వృద్ధి రేటును అడ్డగోలుగా తగ్గించేసిన చైనా ఇప్పుడేమో పిల్లల్ని కనండి అంటోంది… సరే, ప్రభుత్వాలు చెప్పాయనో, నాయకులు చెప్పారనో పిల్లల్ని కనరు… పెరిగిపోయిన జీవన వ్యయాల నేపథ్యంలో పిల్లల్ని పెంచడం, ప్రయోజకులను చేయడం అంత సులభంగా లేదు ఇప్పుడు… అసలు పెళ్లిళ్ల జోలికే పోవడం లేదు యువత… రకరకాల చిక్కుల భయంతో…

సో, ఇండియా ప్రజెంట్ ఫర్టిలిటీ రేటును బట్టి చూస్తే.., మనం ప్రపంచంలోనే అధిక జనాభాతో ఉన్నా, కొనసాగే చాన్స్ ఉన్నా సరే… రాను రాను తూర్పు దేశాల్లాగే వృద్దులు పెరుగుతూ, పిల్లల జననాలు తగ్గుతూ మనమూ కొన్ని ముసలి సమస్యల్ని ఫేస్ చేయబోతున్నామని అర్థం…

1962లో ఇండియా ఫర్టిలిటీ రేటు 5.90 ఉంటే… (ఇబ్బడిముబ్బడిగా పిల్లల్ని కనేవాళ్లు, పిల్లల సంఖ్యను బట్టి గృహిణికి గౌరవం… ఇప్పుడు ఈ రేటు 1.9 కు పడిపోయింది… సరే, రాష్ట్రాలవారీగా వివరాలకు వెళ్తే…

మన దేశ సగటు ఫర్టిలిటీ రేటు 2019-20లో 2.0… అంటే ఉండాల్సిన 2.1కన్నా తక్కువే… ఎస్, దక్షిణ రాష్ట్రాలు దేశసగటుకన్నా తక్కువ ఫర్టిలిటీ రేటుతో ఉన్నాయి… కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు చేయడం, అక్షరాస్యత, అభివృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ప్రజలు సహజంగానే చిన్న కుటుంబం అనే భావన వైపు మొగ్గారు…

ఐతే అన్ని ఉత్తరాది రాష్ట్రాలూ ఎడాపెడా పిల్లల్నేం కనడం లేదు… పైన చార్ట్ చూస్తే అర్థమయ్యేది అదే… మనం పదే పదే చెప్పుకునే బీమారు రాష్ట్రాలు, అలియాస్ యూపీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువ ఫర్టిలిటీ రేటు… మరీ బీహార్‌లో 3.0… (సిక్కింలో మరీ 1.1 మాత్రమే)…

సరే, ఉత్తర రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, కాశ్మీర్‌లలో కూడా దేశసగటుకన్నా తక్కువే… మధ్యప్రదేశ్, రాజస్థాన్ దేశ సగటుతో సమానంగా… సో, కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే (మేఘాలయ కూడా… కాకపోతే చిన్న రాష్ట్రం) ఫర్టిలిటీ రేటు ఎక్కువ…

ఐనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం జనాభాను బట్టి గాకుండా… ఇప్పుడున్న సీట్ల సంఖ్యకు అదనంగా పది శాతమో, ఇరవై శాతమో సీట్ల సంఖ్యను పెంచుతామని భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి… సో, స్టాలిన్, చంద్రబాబుకు ఊరట అన్నమాట… ఉత్తర రాష్ట్రాలన్నీ ఎడాపెడా పిల్లల్ని కనేస్తున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ కథనం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎమర్జెన్సీ రాజ్యాంగబద్ధమే.., అప్పట్లో తప్పలేదుట, తప్పూ కాదుట…
  • రెండేళ్లలో డజను పెళ్లిళ్లు అట… ఆమె నిందితురాలా..? బాధితురాలా..?
  • ఉన్నతాధికారుల పోస్టింగులపై రేవంత్ సర్కారు తెలివైన అడుగులు
  • నిజంగానే ఉత్తరాది రాష్ట్రాలు ఎడాపెడా పిల్లల్ని కనేస్తున్నాయా..?!
  • విజయ్‌కన్నా ఉదయనిధే బెటరట… అవునూ, ఈ లెక్కల తిరకాసులేమిటో…
  • “కాళిదాసు తమిళ్షుడు అవాలనుకుని కణ్ణదాసన్ అయ్యాడు…”
  • హమ్మా… మా తెలుగు ఈగను పోలిన మలయాళ ఈగ క్రియేట్ చేస్తారా..?!
  • హమ్మో అమ్మాయిలా అనుకునే ఈ రోజుల్లో… ఈ టైటిల్, ఈ కథ విశేషమే…
  • నాణ్యతకూ, నమ్మకానికి పేరు హెరిటేజ్… కానీ ఎందుకో ‘పగిలిపోతోంది…’
  • తన పిచ్చి ఆరాధకుడు వర్మకు శ్రీదేవి లీగల్ నోటీస్ ఎందుకిచ్చింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions