Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నేపాల్ అల్లర్ల వెనుక ‘వెరీ డీప్ స్టేట్’… అసలు కథలేమిటంటే..? పార్ట్-2 ….

September 16, 2025 by M S R

.

పార్థసారథి పొట్లూరి....  నేపాల్ లో ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, చైనాలే ప్రధాన కారణం!
డీప్ స్టేట్ ఆనవాళ్లు చేరిపేసినా చెరిగిపోయేవి కావు..

హామి నేపాల్ ( Hami Nepal- We the Nepal ) అనే NGO సంస్థ ఇచ్చిన పిలుపు కి తోడుగా ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా మద్దతు తోడవ్వగా ప్రస్తుత హింస చెలరేగింది!

Ads

హమి నేపాల్ అనే NGO 2015 లో నేపాల్ లో వచ్చిన భూకంపం సందర్భంగా నేపాల్ ప్రజలకి సేవ చేసే ఉద్దేశ్యంతో ఏర్పడింది.
హమి నేపాల్ కి బార్బరా ఫౌండేషన్ తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. హమి నేపాల్ NGO కి బార్బర ఫౌండేషన్ ( Barbara Foundation) నుండి నిధులు అందుతూ వస్తున్నాయి.

barbara

బార్బరా ఫౌండేషన్ ఎవరిది?
బార్బరా ఆడమ్స్ ( Barbara Adams ) అనే అమెరికన్ జర్నలిస్ట్ పేరుతో NGO ని 2010 లో నేపాల్ లో రిజిస్టర్ చేశారు.
బార్భరా ఆడమ్స్ అమెరికన్ మహిళ. 1961 లో నేపాల్ వచ్చింది. అంతకుముందు అంటే నేపాల్ రాకముందు ఒక పదేళ్ల పాటు ఇటలీలోని రోమ్ నగరంలో ఉంది.

1961 లో బార్బరా ఆడమ్స్ రోమ్ నుండి ఖాట్మండు వచ్చే సమయానికి ఆమె వయస్సు 29 ఏళ్ళు, అప్పటికి తను జర్నలిస్ట్ కాదు, కేవలం ఒక టూరిస్ట్ గా నేపాల్ వచ్చింది.
1961 లో ఖాట్మండు నగరం రోడ్ల మీద రిక్షాలు, సైకిళ్ళు, గుర్రపు బండ్లు తిరుగుతుండేవి. కానీ బార్బరా ఆడమ్స్ మాత్రం సన్ బీమ్ కన్వెర్టీబుల్ ( Sunbeam Converible) కారులో ఖాట్మండులో తిరుగుతూ అందరిని ఆకర్షించేది.

అదే సంవత్సరం బ్రిటన్ రాణి ఎలిజిబెత్ నేపాల్ పర్యటన ఉండడంతో ఒక ఇటాలియాన్ పత్రికకి కవర్ స్టోరీ రాయడం కోసం కాంట్రాక్టు తీసుకోవడంతో జర్నలిస్ట్ గా అవతారం ఎత్తింది. అలా బ్రిటన్ రాణి నేపాల్ పర్యటన కోసం ఉద్దేశించిన బృందంలో బార్బరా ఆడమ్స్ ఒక సభ్యురాలు అయిపోయి ఏకంగా నేపాల్ రాజు పాలెస్ లోకి వెళ్లేందుకు అర్హత దొరికింది.

ఇంకేముంది? ఒక అమెరికన్, బ్లూ కళ్ల అందమైన మహిళ, రాయల్ కోర్టు బార్ & రెస్టారంట్ లో ఖరీదైన మద్యం సేవిస్తూ, సిగరెట్ కాలుస్తూ ఉంటూ ఉన్న సందర్భంలో నేపాల్ రాజు, రాణి గారి దృష్టిలో పడింది.
అంతే! మిషన్ ఏకంప్లిషెడ్! తన 85వ ఏట మరణించించే వరకూ నేపాల్ లోనే ఉండిపోయింది. బార్బరా ఆడమ్స్ అంటే నేపాల్ లో తెలియని వారు ఉండరు.

ఖాళీగా ఉండడం దేనికని ఒక ట్రావెల్ మాగజైన్ ని పెట్టి విదేశీయులు నేపాల్ లో చూడతగ్గ ప్రదేశాలని ఆ పత్రికలో పొందు పరిచేది! అలాగే విదేశీయుల కోసం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహించేది!
బార్బరా ఆడమ్స్ 2015 లో చనిపోయిన తరువాత బార్బరా ఫౌండేషన్ స్థాపించారు. అఫ్కోర్స్! బార్బరా ఫౌండేషన్ లో కనిపించే మొహాలు నేపాల్ వాళ్ళవే!

నేపాల్ హిందూ దేశం కనుక నిమ్న కులాలని ఉద్దరించడానికి అని NGO ని స్థాపించాము అంటారు కానీ నిజంగా అదే ఉద్దేశ్యం ఉంటే 1961 నుండి 2015 వరకూ నేపాల్ లోని సగం జనాభాని ఉద్దరించి ఉండాల్సింది కదా?
బార్బరా ఫౌండేషన్ 2015 నుండి నేపాల్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ప్రతిభ కనపరిచిన వారికి అవార్డులతో సత్కరిస్తూ వస్తున్నది.

స్టింగ్ ఆపరేషన్ చేసేంత విషయం నేపాల్ లో ఎక్కడ ఉంది? రాజధాని ఖాట్మండు చుట్టూనే ఉంటుంది ప్రధాన జర్నలిజం!
1961 లో నేపాల్ లో ప్రవేశ పెట్టబడిన బార్బరా ఆడమ్స్ 2025 లో అక్కరకు వచ్చింది!
బార్బరా ఆడమ్స్ జస్ట్ ఒక స్లీపింగ్ సెల్ డీప్ స్టేట్ కి!

******************

nepal
హమి నేపాల్ కి ప్రెసిడెంట్ అయిన సుదన్ గురుంగ్ ( Sudan Gurung) ఆందోళనలో పాల్గొన్న యువకులకి డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, హింసకి ఎలా పాల్పడాలి అనే విషయాలని సోషల్ మీడియా ద్వారా సూచనలు ఇచ్చాడు.
అంత పెద్ద హింసకి ప్రేరేపించి క్షేమంగా నేపాల్ లో ఉండవచ్చు అనే ధైర్యాన్ని ఎవరు ఇచ్చారు సుదన్ గురుంగ్ కి?

మొత్తం 20 కోట్ల నేపాలి రూపాయల్ని హమి నేపాల్ అధ్యక్షుడు సుదన్ గురుంగ్ కి ఇచ్చింది కోకోకోలా, విబర్, గోల్డ్ స్టార్, మల్బరి హోటల్స్. ఈ నాలుగు బ్రాండ్స్ కలిసి హమి నేపాల్ కి నిధులు సమకూర్చాయి.
కోకోకోలాకి ప్రస్తుతం ముఖేష్ అంబానీ ప్రవేశ పెట్టిన కాంప కోలా నుండి ప్రతిఘటన ఎదురవుతున్నది.

మల్బరి హోటల్స్ యజమాని షేర్పా ఫ్యామిలీ, నేపాల్.
గోల్డ్ స్టార్ అనేది నేపాల్ లో ఫెమస్ షూ కంపెనీ.
Viber అనేది క్రాస్ ప్లాట్ ఫార్మ్ ఇన్స్టంట్ మెసేజింగ్ app కానీ మాతృసంస్థ Rakuten జపాన్ ది.

***************
20 కోట్ల నేపాలి రూపాయలు హమి నేపాల్ సంస్థకి సమకూరాయి. ఇంతవరకు బాగానే ఉంది కానీ హిల్టన్ ఫైవ్ స్టార్ హోటల్ ని తగులబెడితే అది మూడురోజుల వరకూ మంటల్లోనే ఉంది. అంటే మంట పెట్టడానికి వాడింది డీజిల్, పెట్రోల్ కాదు మరేదో కెమికల్.

పెట్రోల్, డీజిల్ తో నిప్పు పెడితే మూడుగంటల్లోనే మంటలు అదుపులోకి వస్తాయి. ఫైవ్ స్టార్ హోటల్స్ ని కలపతో కట్టరు. కానీ మూడో రోజు వరకూ మండుతూనే ఉంది. ఆ కెమికల్ కౌంపౌండ్ ఎవరు సప్లై చేశారు?
విద్యార్థులు కేవలం రాజకియ నాయకులని, వాళ్ళ ఇళ్లని టార్గెట్ చేస్తే ఇంకోవైపు ప్రజల ఆస్తుల మీద దాడి చేసి దోచుకుపోయింది ఎవరు?

balendra
****************
బాలెంద్ర షా!
బాలేంద్ర షా 2024 లో అమెరికా వెళ్లి, అక్కడ నేపాల్ లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న డీన్ థాంప్సన్ ( Dean Thompson) ని కలిసి కొద్ది రోజులు గడిపి నేపాల్ తిరిగి వచ్చాడు.
నేపాల్ లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న డీన్ థాంప్సన్ ని ఖాట్మండులోనే బాలేంద్ర షా కలిసి ఉండవచ్చు కదా? అమెరికా ఎందుకు వెళ్లినట్లు?

Well…! ఇక్కడ బాలేంద్ర షా కంటే డీన్ థామ్సన్ ప్రమాదకరమైనవాడు. డీన్ థాంప్సన్ degree in strategic studies అనే అంశంలో నేషనల్ వార్ కాలేజ్ నుండి పట్టా పుచ్చుకున్నాడు!
Gen Z ని ఉపయోగించుకుని రెజిమ్ చేంజ్ అంటే ప్రభుత్వాలని ఎలా మార్చవచ్చో డీన్ థాంప్సన్ నుండి నేర్చుకొని వచ్చాడు బాలేంద్ర షా!

  • ప్రభుత్వాన్ని మార్చగలిగాడు కానీ తెర వెనుక ఎవరో బాలేంద్రకి అడ్డుపడ్డారు నేపాల్ ప్రధాని కాకుండా! ఎవరు..?
    టెరెన్స్ ఆర్వెల్లె జాక్సన్, ( Terrence Arvelle Jackson)!

అర్వెల్లె జాక్సన్ అమెరికన్ సీనియర్ స్పెషల్ ఆపరేషన్స్ ఆఫీసర్. బిజినెస్ వీసా మీద బంగ్లాదేశ్ వచ్చాడు. కానీ అనూహ్యంగా ఢాకాలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో హత్యకి గురయ్యాడు సెప్టెంబర్ 2 న.
హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారో వివరాలు బయటికి రాలేదు ఇంతవరకు.

Dhaka లో ఒక CIA ఏజెంట్ ని హత్య చేసేంత ధైర్యం ఎవరికి ఉంటుంది?
అఫ్కోర్స్! పేరుకే స్పెషల్ ఆప్స్ ఆఫీసర్ కానీ గూఢచర్యం కోసమే తరుచూ బంగ్లాదేశ్ వచ్చి వెళుతున్న జాక్సన్ ని బంగ్లా, పాకిస్థాన్ వాళ్ళు హత్యచేయలేరు!

స్పెషల్ ఆప్స్ ఆఫీసర్ బిజినెస్ వీసా మీద తరుచూ బంగ్లాదేశ్ వచ్చి నెలల పాటు అక్కడే ఉండి తిరిగి అమెరికా వెళ్లడం అనేదే అతను గూఢచర్యం పని మీదనే బంగ్లాదేశ్ వస్తున్నాడనే అనుమానం కలిగింది!
జాక్సన్ DHAKA లో హత్యచేయబడితే కనీసం పోస్ట్ మార్టం చేయకుండానే బాడీని తమకి అప్పచెప్పమని అమెరికన్ ఎంబసి ఒత్తిడి చేసి మరీ తీసుకెళ్లడం అనుమానాస్పదంగా ఉంది. అయితే జాక్సన్ మృతి మీద అమెరికా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం!

కొన్ని టాబ్లయిడ్స్ మాత్రం జాక్సన్ ప్రతీ కదలిక మీద ఇండియన్ RAW కన్ను వేసి గమనిస్తూవస్తున్నది కాబట్టి జాక్సన్ హత్య RAW పనే అయివుండవచ్చు అని పేర్కొన్నాయి.
జాక్సన్ హత్య జరిగిన వారం రోజుల తరువాత నేపాల్ లో హింస చెలరేగి OP శర్మ ఓలి దేశం విడిచిపెట్టి పారిపోవడం జరిగింది.

ప్రధాని కావాలనుకున్న బాలేంద్ర షా కి DHAKA లో జాక్సన్ హత్యకి సంబంధం ఉండి ఉండవచ్చు!
జాక్సన్ ఉండి ఉంటే బాలేంద్ర షా ప్రధాన మంత్రి అయిండేవాడు.
బహుశా నాటకం జరుగుతున్నదని తెలిసీ క్లయిమాక్స్ దాకా ఆగి చివరలో Gen Z చేత సుశీల కర్కిని ప్రధానిగా చేయించడం అనేది డీప్ స్టేట్ కి మింగుడు పడని చర్య!
ఇది నిజంగానే RAW ఆపరేషన్ అయితే మనం అభినందించాల్సిందే!

మా సరిహద్దు దేశంలో మీ ఆటలు సాగవు!
బహుశా జాక్సన్ హత్య విషయంలో మింగలేక కక్కలేక
నిన్న G-7 దేశాలని భారత్ మీద ఆంక్షలు విధించమని డీప్ స్టేట్ ఒత్తిడి తెచ్చింది! (ఇంకా ఉన్నది కథ.., తరువాత చెప్పుకుందాం…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ ధూర్త పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడినట్టు..? ఇది మరోకోణం..!!
  • కంటెస్టెంట్ల ఎంపిక వెరీ పూర్ బిగ్‌బాస్… ఆట అస్సలు రక్తికట్టడం లేదు…
  • పేలవంగా, నిస్సారంగా తెలుగు ఇండియన్ ఐడల్ ‘ప్రి రిలీజ్’..!!
  • శంఖం ఊదితే సుఖనిద్ర… ఊపిరితిత్తులకు వ్యాయామం…
  • నేపాల్ అల్లర్ల వెనుక ‘వెరీ డీప్ స్టేట్’… అసలు కథలేమిటంటే..? పార్ట్-2 ….
  • నేపాల్ దహనకాండకు అసలు కారకులెవరు..? రియల్ స్టోరీస్..!!
  • మనమే రెచ్చగొడుతూ, రచ్చ చేస్తూ… అశాంతి, ప్రమాదాల్ని ఆహ్వానిస్తున్నాం…
  • ఎందుకు మంత్రి సీతక్క ఈ ఫోటో వైరల్ అయ్యిందో తెలుసా..?!
  • ఎందుకీ ఆందోళనలు..? వలసదారులపై ఎందుకు బ్రిటిషర్ల ఆగ్రహం..!?
  • పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడాల్సిందేననీ ట్రంపే చెప్పాడా ఏం..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions