Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంచు కొండల్లో మంటలు… ఓ డీప్ కుట్ర… పదండి చదువుదాం…

September 26, 2025 by M S R

.

Pardha Saradhi Potluri .....   లడాక్ లో హింస- పాకిస్తాన్ కనెక్షన్ వయా కాంగ్రెస్!

లడాక్ లో హింస ప్రజ్వరిల్లడానికి పాకిస్తాన్ via కాంగ్రెస్ కి సంబంధం ఏమిటీ?
ఒకసారి వరుస క్రమంలో జరిగిన సంఘటనలని గమనిస్తే లింక్ ఏమిటో తెలుస్తుంది.

Ads

1.సెప్టెంబర్ 21 ఆదివారం తెల్లవారుఝామున పాకిస్థాన్ లోని ఖైబర్ డిస్ట్రిక్ట్ లోని తిరహ్ ( Tirah) అనే ఊరి మీద పాకిస్థాన్ Jf-17 ఫైటర్ జెట్స్ గైడెడ్ బాంబ్స్ తో దాడి చేశాయి.
2.పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిలో మొత్తం 24 మంది సాధారణ పౌరులు మరణించారు. మరణించిన వారిలో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

3.ఖైబర్ ఫక్తున్క్వా లోని స్థానిక మీడియా కధనం ప్రకారం… ఆదివారం తెల్లవారు ఝామున ఊరి ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో Jf-17 ఫైటర్ జెట్స్ LS-6 ప్రెసిషన్ గ్లయిడెడ్ బాంబ్స్ ని వేసాయి.
4.ఖైబర్ ఫక్తున్క్వా పోలీసులు మాత్రం తీరాహ్ ప్రాంతంలో పాకిస్తానీ తాలిబాన్ కమాండర్ అయిన అమన్ గుల్, మసూద్ ఖాన్ అదే ప్రాంతంలో షెల్టర్ తీసుకుంటున్నారని, పాకిస్తాన్ సైన్యం మీద దాడులు చేయడం కోసం అని సిద్ధంగా ఉంచుకున్న పేలుడు పదార్ధాలు ప్రమాదవశాత్తూ పేలిపోయి పౌరులు మరణించారని చెపుతున్నారు.

5.ఖైబర్ ఫక్తున్క్వా లోని స్థానిక మీడియా మాత్రం… Jf-17 లు జారవిడిచిన LS-6 గ్లయిడెడ్ బాంబుల శిధిలాలని చూపెడుతూ ఇవి చైనా తయారీ బాంబులని, వీటిని తాలిబాన్లు ఎలా సంపాదిస్తారని అడుగుతున్నారు.
6.glided బాంబులని వేయాల్సిన ప్రాంతం గుర్తించి ఫైటర్ జెట్స్ నుండి చాలా దూరం నుండి ఎత్తులో జారవిడుస్తారు. Glide అంటే ఎగురుతూ వచ్చి గుర్తించిన ప్రాంతం మీద పడి పేలిపోతాయి.

7.ఖైబర్ ఫక్తున్క్వా లో సాధారణ ప్రజలని పాకిస్తాన్ సైన్యం బాంబులతో దాడి చేసి చంపడాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి తీవ్రంగా ఖండించారు.
8.నిన్న లడాఖ్ లో హింసని ప్రజ్వరిల్ల చేసింది పాకిస్థాన్.

*****************
నిన్న లడాక్ లోని లేహ్ లో హింసకి ప్రేరేపించింది సోనమ్ వాంగ్ చుక్!
సోనమ్ వాంగ్ చుక్ లడాక్ కేజ్రీ వాల్!
సోనమ్ వాంగ్ చుక్ పేరుకే ఆక్టివిస్ట్, పర్యావరణ పరిరక్షకుడు, అవార్డ్ గ్రహీత లాంటివి ముందు కనపడేవి, వినపడేవి.
కానీ డీప్ స్టేట్, చైనా, పాకిస్తాన్ లతో సంబంధాలు ఉన్నాయి.
సోనమ్ వాంగ్ చుక్ ఒక స్లీపర్ సెల్!
డీప్ స్టేట్ తో ఎలా సంబంధం ఉంది?

Ramon Magsaysay Award!
రామోన్ మెగాసేసే అవార్డు- ఆసియా ఖండానికి నోబుల్ బహుమతి లాంటిది అని పేరు!
కేవలం ఆసియా ఖండానికే పరిమితం.
మాజీ మహిళా IPS ఆఫీసర్ కిరణ్ బేడీ గారికి ఇచ్చారు కానీ అనూహ్యంగా ఆవిడ బీజేపీ వైపుకి వచ్చారు అదృష్టం కొద్దీ.
కేజ్రీవాల్ కి రామోన్ మెగాసేసే అవార్డు ఇచ్చారు, డీప్ స్టేట్ కి అంకితం అయ్యాడు…

2018 లో లడాక్ కి చెందిన సోనమ్ వాంగ్ చుక్ కి ఇచ్చారు. లడాక్ లో ప్రజలతో మమేకం అయి వాళ్ళని ఉత్తేజితులని చేసినందుకు గాను అవార్డు ఇచ్చారు!

ladakh
2018 కి ముందు?
3 ఇడియట్స్ సినిమాతో జాకీ వేసి లేపి కిందకి దించకుండా అలానే ఉంచేసారు!
3 ఇడియట్స్ సినిమాలో అమిర్ ఖాన్ పోషించిన పాత్ర రాంచో అలియాస్ ఫున్ సుక్ వాంగ్డు వెరెవరో కాదు నిన్నటి అల్లర్ల సూత్రధారి సోనమ్ వాంగ్ చుక్ మాత్రమే!
డాట్ డాట్ లు కలిసిపోయాయి కదా?

3 ఇడియట్స్ సినిమా స్క్రిప్ట్ వర్క్ 2007 లో మొదలయ్యి 2009 లో విడుదల అయ్యింది.
అంటే 2006 లో ఎవరో పెట్టుబడి పెడతాము, మీరు సోనమ్ వాంగ్ చుక్ ని పైకి లేపే విధంగా కధ రెడీ చేసుకోండి, నష్టం వస్తే మేము భరిస్తాం, లాభం వస్తే మీరే ఉంచేసుకోండి అని భరోసా ఇచ్చి ఉంటారు!

వినడానికి కొత్తగా ఉన్నా దశాబ్దాలుగా హిందీ చిత్రపరిశ్రమలో అమలులో ఉంది… కధ, లీడ్ క్యారెక్టర్స్, మ్యూజిక్ డైరెక్ట్ ఎవరు చేయాలి, దర్శకుడిగా ఎవరు ఉండాలి లాంటి అంశాలు దుబాయ్, లండన్, పాకిస్తాన్ లలో నిర్ణయించబడతాయి.

సలీం- జావెద్ రచయితలుగా ఉన్న అన్ని సినిమాలలో హీరో అయితే ముస్లిం పేరు ఉంటుంది, లేకపోతే చేతికి 786 బ్యాడ్జ్ ఉంటుంది ( దీవార్- అమితాబ్ బచన్). ఇక బినామీ నిర్మాతలు ఉత్తర్ ప్రదేశ్ బ్రాహ్మణులు ఉండేవారు, ఎందుకంటే విలన్ పెద్ద బొట్టు పెట్టుకునో లేదా అడ్డ నామాలు పెట్టుకునో కనపడతారు. నిర్మాత ఉత్తర్ ప్రదేశ్ బ్రాహ్మణులు కాబట్టి విమర్శలు రావు.,,

అండర్ వరల్డ్ డబ్బుని నలుపు నుండి తెలుపు చేసుకోవడానికి హిందీ చిత్రరంగం ఒక సాధనంగా ఉపయోగపడింది 2015 వరకూ.
అమిర్ నటించిన దంగల్ చైనాలో వెయ్యి కోట్లు వసూలయినట్లుగా చూపించారు. ఎవరు చైనా వెళ్లి దర్యాప్తు చేస్తారు? టాక్స్ కట్టేసారు కదా?

So! కేజ్రీవాల్ ని, సోనమ్ వాంగ్ చుక్ ( రాంచో- ఫున్ సుక్ వాంగ్డు) దాదాపుగా ఒకే కాలంలో ప్రమోట్ చేశారు.
ఒకరు ముఖ్యమైన రాజధాని ఢిల్లీలో ఉంటే సోనమ్ వాంగ్ చుక్ కీలకమైన సరిహద్దు ప్రదేశం లడాక్ లో ఉన్నాడు.

ladakh

డీప్ స్టేట్ అనుకోండి, అమెరికన్ థింక్ టాంక్ అనుకోండి, పేర్లు ఎవయినా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఎప్పుడు, ఏం చేయాలో 25 ఏళ్ల ముందే ప్లాన్ సిద్ధం చేసుకొని, వాటికి సరిపోయే వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టుకొని, ఏదో ఒక మార్గంలో డబ్బులు ఇస్తూ రిజర్వ్ లో పెడతారు.

కేజ్రీ వాల్, NDTV రబ్బీష్ కుమార్, సోనమ్ వాంగ్ చుక్ లకి రామోన్ మెగసేసే అవార్డులు ఇచ్చారు. ముగ్గురూ బీజేపీకి వ్యతిరేకులే!
3 ఇడియట్స్ లో రాంచో అలియాస్ ఫున్ సుక్ వాంగ్డు ఏదో కొత్తగా కనిపెట్టాడు అని చూపించినవి సింపుల్ గా జూగాడ్స్ అని పిలుస్తారు.

ఆఫ్రికా దేశాలకి వెళ్లి చూస్తే 3 ఇడియట్స్ లో చూపించిన జూగాడ్స్ కంటే అద్భుతమైనవి కనపడతాయి.
మైనస్ 50 డిగ్రీల చలిలో వెచ్చగా ఎలా ఉండవచ్చో బోలెడన్ని జూగాడ్స్ కనపడతాయి అలస్కాలో.
3 ఇడియట్స్ సినిమాలో అమిర్ ఖాన్ అలియాస్ రాంచో లెక్చరర్ ని ఒక ప్రశ్న అడుగుతాడు…స్పేస్ స్టేషన్ లో చాలా ఖరీదైన ఫెల్ట్ టిప్ పెన్ వాడడం ఎందుకు? మామూలు పెన్సిల్ వాడవచ్చుగా?

సినిమా చూస్తున్నప్పుడు మనకి కూడా ఇదే అనుమానం వచ్చి వాంగ్ చుక్ ని అభిమానిస్తాం!
కానీ వాస్తవం ఏమిటంటే… గ్రాఫైట్ పెన్సిల్ ని మొదట్లో వాడారు. కానీ స్పేస్ స్టేషన్ మొత్తం ఆక్సిజన్ తో నిండి ఉంటుంది. పెన్సిల్ లో ఉండే గ్రాఫైట్ గుడ్ కoడక్టర్ అంటే విద్యుత్ ప్రవహింప చేస్తుంది. పొరపాటున ఆస్ట్రానాట్ చేయి నుండి జారి అది ఎక్కడన్నా తగిలితే షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది.

పైగా పెన్సిల్ చెక్కతో చేసి ఉంటుంది కాబట్టి అది ఇంకా ప్రమాదం మంటలు చెలరేగినప్పుడు. అందుకని గ్రాఫైట్ పెన్సిల్ పక్కన పెట్టి ఆస్ట్రో నాట్స్ కోసం ఫెల్ట్ టిప్ పెన్ లేదా ఆల్కహాల్ లేని మార్కర్ తయారుచేసారు. వాటిని బల్క్ లో తయారు చేయరు, కస్టమ్ మేడ్ కాబట్టి ధర ఎక్కువ.

ఇవేవి ఆలోచించే తెలివి లేనివాళ్లకి ఆ సినిమా నచ్చి, రాంచో అలియాస్ ఫున్ సుక్ వాంగ్డు ( సోనమ్ వాంగ్ చుక్ ) హీరో అయ్యాడు.
అసలు ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా చేతులతో ప్రసవాలు చేసిన మంత్రసాని ( midwife) సులగిట్టి నరసమ్మకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు 2018 లో… నరసమ్మ వెయ్యికి పైగా ప్రసవాలు చేసింది వాక్యూమ్ క్లీనర్ లేకుండా… సినిమా చూసి డబ్బులు ఇచ్చాం చూడండి, మనం ఇడియట్స్ మి!

అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించెను, మొఘలులు వాళ్ళ చరిత్ర ఎందుకు అని ఫున్ సుక్ అలియాస్ రాంచో చేత అడిగించరు… కామెడీ పాత్రల పేర్లు సహస్రబుద్ధి, చతుర్ రామలింగం అర్థమైంది కదా…
********************* తరువాయి భాగం తదుపరి కథనంలో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions