ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఫిమేల్ స్టార్, అందులోనూ హీరోయిన్ అంటే ఆయుష్షు చాలా స్వల్పకాలం… ఇండస్ట్రీ వాడుకొని వాడుకొని, పీల్చి పిప్పిచేసి, కరివేపాకులా తీసిపడేస్తుంది… ఇది రియాలిటీ… కొందరు మాత్రమే ఎక్కువ కాలం అన్నిరకాల పరాజయాలు, పరాభవాలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు, లైంగిక వేధింపులు, వివక్షలు, నెగెటివ్ ముద్రలు గట్రా తట్టుకుని, భరించి, అంగీకరించి కొనసాగుతారు… చాలా అరుదు…
దీపికా పడుకోణ్… 2007లో ఇండస్ట్రీలోకి వచ్చింది… అమెకూ చాలా చేదు అనుభవాలున్నయ్… కానీ అవన్నీ దాటుతోంది, దాటింది… ప్రస్తుతం ఇండియాలో టాప్ ఫిమేల్ స్టార్… ఎస్, హాలీవుడ్ కూడా గుర్తించింది… అరుదైన సర్టిఫికెట్… ప్రతి ఫిమేల్ స్టార్ కోరుకునే గుర్తింపు… డెడ్‌లైన్ హాలీవుడ్ అనే ఓ మ్యాగజైన్ ప్రతి ఏటా గ్లోబల్ డిస్ట్రప్టర్స్ అని ఓ జాబితా పబ్లిష్ చేస్తుంది… ఈసారి దీపికా పడుకోణ్ ఆ లిస్టులో చేరింది… ఒకే ఒక ఇండియన్ సెలబ్రిటీ…
నిజానికి కొన్నేళ్లుగా తన ప్రస్థానం ఒక ఫిమేల్ స్టార్ కోరుకునే వైభవోపేత గుర్తింపే… పలు అంతర్జాతీయ వేదికలు, ఈవెంట్లలో ఇండియాకు అందమైన ప్రాతినిధ్యం ఆమె… ఆస్కార్, BAFTA… కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్… TIME మ్యాగజైన్ కవర్ పేజీపై స్థానం… 2017 FIFA వరల్డ్ కప్ ట్రోపీ ఆవిష్కర్త… xXx: Return Of Xander Cage సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తను…
Ads
‘‘సక్సెస్ అంటే… అవును, ఆ దిశలో అవార్డులు ముఖ్యమే, మంచి పాత్ర ముఖ్యమే, సినిమా విజయం ముఖ్యమే, మన నటనకు గుర్తింపు ముఖ్యమే… అన్నింటికీ మించి కమర్షియల్ సక్సెస్ కూడా ముఖ్యమే… కానీ నాకు వాటితోపాటు ఒక పర్సన్‌గా సినిమా జర్నీ ముఖ్యం… ఎదురయ్యే అనుభవాలు, జ్ఞాపకాలు ముఖ్యం, ఆ ధోరణే నన్ను ఇక్కడి దాకా లాక్కొచ్చింది’’ అంటోంది ఆమె…
నటిగా విజయాలే కాదు… ఆమె తనకు ఎదురైన మానసిక సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంది… ట్రోలింగ్, సోషల్ దాడినీ తట్టుకుని నిలబడింది… డిప్రెషన్ నుంచి బయటపడింది… ఎప్పటికప్పుడు తనను తాజాగా ఆవిష్కరించుకుంటోంది…
‘‘ప్రపంచం చాలా చిన్నదైపోయింది, ఈ రంగంలోని అన్ని ఇండస్ట్రీలు ఒక్కటై ప్రపంచానికి గొప్ప కథలు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి… మనం చెప్పే కథలు ప్రపంచాన్ని ఏమీ మార్చవు కానీ ప్రేక్షకులు మెచ్చేలా, ఆశ్చర్యపోయేలా ఎంత ఆసక్తికరమైన కథల్ని ఎలా చెబుతామనేదే ముఖ్యం…’’
‘‘ఓం శాంతి ఓం సినిమా నాకు మొదటిది… నేనేమీ ఆడిషన్స్ ఇవ్వలేదు… అంతా కొత్త కొత్త… చిన్న వయస్సు… ఆ సినిమా విజయం నన్ను ఈజీగానే ఇండస్ట్రీలో నిలబెట్టింది… పదేళ్ల క్రితం హాలీవుడ్‌లో ఆడిషన్ ఇచ్చాను… కానీ ఇక్కడి సినిమాలకు తగినట్టు నేనేమీ స్పెషల్ ట్రెయినింగ్ తీసుకోలేదు, ప్రస్తుత అవసరానికి తగిన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు సొంతంగానే ఒంటపట్టించుకోవడం తప్ప…’’ అంటోంది దీపిక… ఇంట్రస్టింగ్ జర్నీ ఆమెది… కీప్ రాకింగ్ దీపికా…!
Share this Article