.
దీపిక పడుకోన్… ఒక సందీప్ రెడ్డి వంగా తిరస్కరించవచ్చు గాక… ఒక నాగ్ అశ్విన్ ఆమెను తప్పించవచ్చుగాక… ఆమె విలువ ఏమీ తగ్గదు… తగ్గలేదు… తలెత్తుకుని ఈ పురుషాధిక్య ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో, సోకాల్డ్ మగ పురుష్ వివక్ష లైన్ దాటేసి… నంబర్ వన్ స్థానంలో నిలిచింది…
ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీని సందర్శించిన కోట్లాది మంది వీక్షకుల పేజీ వ్యూస్ ఆధారంగా… ఇండియన్ సినిమా సెలబ్రిటీల గత పదేళ్ల ర్యాంకింగ్స్ జాబితాను రూపొందించారు… అందులో దీపిక పడుకోన్ నంబర్ వన్ ప్లేసు…
Ads
పెద్ద పెద్ద తోపు హీరోలను దాటేసుకుని… తన విలువ ఏమిటో, తన పాపులారిటీ స్టేటస్ ఏమిటో చాటింది ఆమె… ఆమె ప్రఖ్యాత హిందీ సినిమాలు చేయడం మాత్రమే కాదు, హాలీవుడ్ స్టార్ కూడా కావడం ఒకరకంగా ఆమె ప్లస్ పాయింట్… కానీ హాలీవుడ్‌కు పరిచయమున్న ప్రియాంక ఆమెకు చాలా దూరంలో ఉండిపోయారు… టాప్ 30 లో కూడా లేదామె… (హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ 2026లో స్థానం దక్కిన తొలి భారతీయ నటిగా రికార్డు దీపికది)…
షారూక్ ఖాన్ రెండో ప్లేస్ కాగా, ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ మూడో ప్లస్… చాలామందిని దాటేసి ఆలియా భట్ నాలుగో ప్లేసులో నిలవడం విశేషం కాగా… ఇర్ఫాన్ ఖాన్ ఐదో ప్లేసు… టాప్ 31 ప్లేసులు ఇవిగో…
ర్యాంక్ నటుడు/నటి పేరు
1 దీపికా పడుకోణ్
2 షారుక్ ఖాన్
3 ఐశ్వర్య రాయ్ బచ్చన్
4 ఆలియా భట్
5 ఇర్ఫాన్ ఖాన్
6 ఆమిర్ ఖాన్
7 సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
8 సల్మాన్ ఖాన్
9 హృతిక్ రోషన్
10 అక్షయ్ కుమార్
11 కత్రినా కైఫ్
12 అమితాబ్ బచ్చన్
13 సమంత రుత్ ప్రభు
14 కరీనా కపూర్
15 త్రిప్తి డిమ్రీ
16 తమన్నా భాటియా
17 రణబీర్ కపూర్
18 నయనతార
19 రణవీర్ సింగ్
20 అజయ్ దేవగణ్
21 దిశా పటాని
22 అనుష్క శర్మ
23 నవాజుద్దీన్ సిద్ధిఖీ
24 అనిల్ కపూర్
25 కృతి సనన్
26 శ్రద్ధా కపూర్
27 రాణీ ముఖర్జీ
28 జాన్ అబ్రహం
29 ప్రభాస్
30 ధనుష్
31 రామ్ చరణ్
.
టాప్ 30లో సమంత తప్ప, కాస్త దూరంలో ప్రభాస్ తప్ప ఇంకెవరూ లేరు, అదీ విశేషం… మన తెలుగు హీరోల పరిస్థితేమిటీ అంటారా..? 47 వ స్థానంలో అల్లు అర్జున్, 67 వ ప్లేసులో ఎన్.టి. రామారావు జూనియర్ (NTR Jr.) 72 వ ప్లేసులో మహేష్ బాబు… మిగతా వారి గురించి వదిలేయండి… ఊసులోకి కూడా లేరు…
సాహో, బాహుబలి, ఆదిపురుష్ వంటి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో తన ర్యాంకింగ్ టాప్ 30 లో ఉంది… పుష్ప 1, 2 సినిమాలతో బన్నీ పాపులారిటీ బాగా పెరిగింది… అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్… పాన్ ఇండియా స్టార్లు కావడం అనుకూలించింది…
మహేష్ బాబుకు ఆ రేంజ్ పాన్ ఇండియా సినిమాలు పడకపోయినా సరే 72వ ప్లేసు అంటే వోకే… రాబోయే రాజమౌళి సినిమాతో తన రేంజ్ పెరుగుతుంది… మరి మిగతా మేల్ తోపులు, ఫిమేల్ తురుములు..? సారీ..!!
Share this Article