.
మరో కొత్త వివాదం… దీపిక పడుకోన్ అగ్రతార బాలీవుడ్‌లో… అందుకే బాగా చర్చనీయాంశం… ఆల్రెడీ స్పిరిట్ అనే సినిమా నుంచి వంగ సందీప్ రెడ్డి దీపికను తొలగించి, తన యానిమల్ ఫేవరెట్ స్టార్ తృప్తి దిమ్రిని పెట్టేసుకున్నాడు… ఇది ప్రభాస్ సినిమా…
ఏమైంది..? ఎందుకు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు రకరకాలు… రెమ్యునరేషన్, షూటింగ్ టైమ్స్ మొదలుకొని… అప్పట్లో శ్రీదేవి శివగామి పాత్ర పోషణకు కోరినట్టు ఏవేవో గొంతెమ్మ కోరికలూ కావచ్చు… ఏమో, కొత్తగా తల్లినైన నాకు సినిమా టీమ్ సౌకర్యమైన వెసులుబాట్లు ఇవ్వకపోవడంతో నేనే వైదొలిగాను అని దీపిక చెబుతూ ఉండవచ్చు… సీన్ కట్ చేస్తే…
Ads
ఇప్పుడు కల్కి-2 సినిమా నుంచి కూడా దీపిక ఔట్… ఇదీ ప్రభాస్ సినిమాయే… రెండూ భారీ ప్రాజెక్టులే… పాన్ ఇండియా ప్రాజెక్టులే… ఆల్రెడీ కల్కిలో దీపిక హీరోయిన్… ఆమెది ముఖ్యమైన పాత్ర… కల్కిని కడుపులో మోస్తున్న పాత్ర… ఆల్ ఆఫ్ సడెన్ ఆమెను తీసేస్తే… ఇంకెవరో కొత్త నటిని తీసుకొచ్చి పెడితే ఆ సీక్వెలే ఆడ్‌గా కనిపించవచ్చు జనానికి…
@VyjayanthiFilms
This is to officially announce that
@deepikapadukone
will not be a part of the upcoming sequel of #Kalki2898AD. After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership. And a film like
@Kalki2898AD
deserves that commitment and much more. We wish her the best with her future works.
ఐనాసరే వైజయంతి మూవీస్ ఆమెను వదులుకోవడానికే సిద్ధపడిందీ అంటే… పాత సందీప్ రెడ్డి వంగా నిర్ణయం కూడా కలిపి విశ్లేషించుకుంటే… తప్పు దీపిక వైపు నుంచే ఉన్నట్టు సగటు ప్రేక్షకుడు, ఫిలిమ్ సర్కిళ్లు ఓ అంచనాకు వస్తాయి… బహుశా అదే నిజం కావచ్చ కూడా…
ఎందుకంటే..? అనాలోచితంగా వైజయంతి మూవీస్ వంటి నిర్మాణ సంస్థ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోదు… పైగా రెండు భాగాల సినిమాకూ దీపికతో అగ్రిమెంట్ ఉండే ఉంటుంది… ఒకవేళ హఠాత్తుగా దీపిక కొన్ని కొత్త డిమాండ్లు పెట్టినా వీలైనంతవరకూ ఏదోలా అడ్జస్ట్ చేస్తారు తప్ప మొత్తంగానే ఓ కీలకపాత్రధారిణిని వదులుకోరు…
ఐనా నిర్మొహమాటంగా అధికారికంగానే నో మోర్ దీపిక అని ప్రకటించారు అంటే… తప్పు దీపిక వైపు నుంచే ఉన్నట్టు… విధిలేక నిర్మాతలు ఈ ప్రకటన చేసినట్టు…!! అఫ్కోర్స్, ఇందులో ప్రభాస్ తప్పేమీ లేకపోయినా… రెండూ కీలక ప్రాజెక్టులు, రెండింటిలోనూ దీపికే హీరోయిన్ కావడం, రెండూ ఆలస్యం అవుతుండటం, హఠాత్తుగా హీరోయిన్ వైదొలగడం మైనసే…
గతంలో దీపిక మీద నిర్మాతలకు సహకరించదనే విమర్శలేమీ రాలేదు… ఇప్పుడేమిటీ ఆమె ఇలా తయారైంది..? ఇప్పుడిక కొత్త ప్రాజెక్టులకు ఆమెను తీసుకోవడానికి బడా నిర్మాణ సంస్థలు కూడా పునరాలోచనలో పడతాయి… కారణం… రెండు భారీ ప్రాజెక్టులను ఆమెను నిష్కర్షగా వదిలేయడం..!! కాకపోతే సినిమా తారల పనివేళలు కొన్నాళ్లు వార్తల్లో చర్చనీయాంశంగా ఉంటుంది, అంతిమంగా ఆమెకే నష్టం..!!
Share this Article