Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!

July 10, 2026 by M S R

.

ఇండస్ట్రీలో అలవాటే కదా… ఎక్కువ రెమ్యునరేషన్ అడిగినా, క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ప్రాజెక్టు నుంచి వైదొలిగినా… హీరోయిన్ల మీద ఏవో విమర్శలు చేసేయడం అలవాటే కదా… ఒక్కసారి గుర్తుతెచ్చుకొండి… బాహుబలిలో శివగామి పాత్రకు సంబంధించి శ్రీదేవిపై రాజమౌళి చేసిన విమర్శల్ని! అఫ్‌కోర్స్, తరువాత లెంపలేసుకున్నాడు, వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నాడు…

‘‘శ్రీదేవిని అడిగాం, కానీ భారీ రెమ్యునరేషన్ అడిగింది… నా సినిమా బడ్జెట్‌కు అది చాలా ఎక్కువ, పైగా ఆమె తనతో పాటు ఐదుగురు సిబ్బందికి ఫైవ్ స్టార్ హోటల్ వసతి, ప్రయాణ ఖర్చులు, ఇతర విలాసవంతమైన సౌకర్యాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చును డిమాండ్ చేసింది…’’ ఇదీ తన వ్యాఖ్య…

Ads

నిజానికి బాహుబలి బడ్జెట్‌లో శ్రీదేవి అడిగింది చాలా తక్కువే… తరువాత బోనీకపూర్ వివరణ కూడా ఇచ్చినట్టున్నాడు… ఇప్పుడు దీపిక పడుకోన్ మీద కూడా ఇదుగో ఇలాంటి విమర్శలే… కల్కి2 నుంచి ఆమెను తొలగించడం మీద…! కాకపోతే బయటి వ్యక్తులు… కల్కి టీమ్ అధికారికంగా కాదు… ఏమనీ అంటే..?

సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఏదో ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు… ‘‘ఆమె రోజువారీ ఖర్చులు భరించడం కష్టం, లగ్జరీ కోరుకుంటుంది, ఆమె టీమ్ కోసం స్టార్ హోెటళ్లు, విల్లాలు కావాలి, తరచూ జర్నీలు  చేస్తుంటుంది, ఆ విమాన ప్రయాణ ఖర్చులు అదనం… అందుకే కల్కి నిర్మాతలు ఆమెను పక్కన పెట్టేశారు’’…

అంతా హంబగ్… తారల రోజువారీ ఖర్చుల గురించి తెలియకుండానే ఆమెను రెండు పార్టుల కోసం బుక్ చేసుకున్నారా..? సమస్య వచ్చింది వర్కింగ్ అవర్స్ గురించి… కొత్తగా తల్లయింది కాబట్టి వర్కింగ్ అవర్స్ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని కోరింది… హీరోయిన్ల పనిగంటల మీద పెద్ద చర్చే జరిగింది… కల్కి2 పోయినంత మాత్రాన (ఆమె వదిలేసిందా, వాళ్లు వదిలేశారా అన్నది నథింగ్) ఆమెకు పోయిందేమీ లేదు, నిర్మాతలకు ఆమె కాకపోతే మరొకరు…

(దీపిక పడుకోన్ ప్లేసులో సాయిపల్లవిని తీసుకున్నారని ప్రచారం జరిగింది, కానీ కన్‌ఫర్మేషన్ లేదు)… ఇక ఖర్చుల గురించి కదా చర్చ… నాడు శ్రీదేవి మీద రాజమౌళి చేసిన వ్యాఖ్యల్నే నేడు దీపిక పడుకోన్ మీద ఈ నిర్మాత ఎవరో నోరుపారేసుకుంటున్నాడు…

హీరోల గురించి ఒక్క నోరైనా పెగులుతుందా..? అంతేకాదు, హీరోస్వామ్యంలో ఎలా ఉంటుందో, బన్నీ ఏ షరతులు పెడతాడో ఆమధ్య కొంత రచ్చ జరిగింది కదా… బన్నీ కళ్లల్లో కళ్లు పెట్టి చూడకూడదట… ఏ స్టార్ హీరో మీదైనా నెగెటివ్ వ్యాఖ్యలు చేయగలరా ఇండస్ట్రీలో..?

అంతదాకా ఎందుకు..? ముంబై నుంచి వచ్చిపోవడానికి మురళీ శర్మకు ఎంత ఖర్చుపెడుతున్నారు? తనకు తన టీమ్‌కు కలిపి..! తెలుగులో బోలెడుమంది కేరక్టర్ ఆర్టిస్టులున్నారు కదా, వాళ్లకు పనిలేదు, ముంబై నుంచి అడ్డగోలు ఖర్చులు, రెమ్యునరేషన్లతో హిందీ నటులు..! ఐనా కల్కి ప్రాజెక్టు ఖర్చులో దీపిక పడుకోన్ రోజువారీ ‘చిల్లర ఖర్చుల’ వాటా ఎంత మాస్టారూ..?! ఎందుకు ఈ దిక్కుమాలిన బురద!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  •  జ్ఞాపకాలు తరిమితే… మైఁ వాపస్ ఆవుంగా… జరూర్ ఆవుంగా… 
  • ఆమె అసలే విజయశాంతి – సీఎంకే గండం ! ఈజీగా లేపేయగలదు !!
  • నకిలీ డిగ్రీల నల్ల కోట్లు — న్యాయ వ్యవస్థలో ‘బొద్దింకలు’ — ఓ పరిశీలన !!
  • అశ్వత్థామ హతః – ఒకరు కాదు, ఇద్దరు – ఆదిలోనే ‘మంగళం’ …
  • సముద్రపు అలల సాక్షిగా మత్స్యకార ప్రాణాలపై వివక్ష !!
  • సోషల్ జస్టిస్ Vs ఫ్యామిలీ జస్టిస్ – కేసీయార్ క్యాంపు నోరెత్తితే ఒట్టు !!
  • విజయ శాంతికి కవిత సర్టిఫికెట్ ! రేవంత్ రెడ్డికి ఇక తప్పేట్టు లేదు పాపం !!
  • ఈ ఖండిత శిరస్సు కథేమిటో పాఠంగా చెప్పాలి… చరిత్ర లిఖించబడాలి…
  • తన జన్మస్థలి- తన రాజధాని ఖిలాషాపూర్… అక్కడ తన కోట…
  • రేవంత్ నేరాలు- ఓ నిశిత విశ్లేషణ ! ఈ సంఖ్య కేసీయార్ వేధింపుల పుణ్యమే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions