ఒక వార్త కనిపించింది… కల్కి 2898 ఏడీ అనే బ్లాక్ బస్టర్ సినిమా వసూళ్లకు సంబంధించి నిర్మాతలు కొందరు సినిమా విమర్శకులు లేదా సమీక్షకులకు లీగల్ నోటీసులు పంపించింది… 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది…
1000 కోట్ల వసూళ్లు దాటినట్టు నిర్మాతలే ప్రకటనలు చేస్తున్నారు సోషల్ మీడియాలో… అయితే అవి గ్రాస్ కావచ్చు, అందులో టాక్సులు ఎట్సెట్రా పోతే వచ్చేవి నెట్ కలెక్షన్లు… ఫ్యాన్స్ కొన్ని లెక్కలు ప్రచారంలోకి తీసుకొస్తారు, కొన్ని సైట్లు కొన్నిరకాల లెక్కలు చెబుతుంది… ఇదంతా ప్రచారం కోసం… అభిమాన ప్రకటన కోసం…
ఆదాయపు పన్ను శాఖ అడిగితే వచ్చే లెక్కలు వేరుంటాయి… ఎస్, కొందరికి ఈ ప్రకటనల మీద సందేహాలుంటయ్, అబ్బే, అంత లేదు, తక్కువే ఉన్నయ్ కలెక్షన్లు అని రాశారనే అనుకుందాం… దాంతో ఆ బ్యానర్ పరువు పోతుందా..? నిర్మాతల పరువు పోతుందా..? మరిక పరువు నష్టం దావా వేయడం ఏమిటి..? అందులో పరువు తీసే రాతలు ఏమున్నట్టు..?
Ads
Sacnilk సైటు ఈరోజుకూ 980 కోట్లే చూపిస్తోంది… వాళ్లకున్న సమాచారం అది… ఆ లీగల్ నోటీసులు అందుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా 800 కోట్ల దాకా చెబుతున్నారు… ఈమాత్రం దానికి కల్కి నిర్మాతల ఓవర్ యాక్షన్ దేనికి..? ఈ బెదిరింపులు దేనికి..?
కాకపోతే ఒకటి మాత్రం నిజం… సౌత్ ఇండియా హీరోల విజృంభణ నార్తరన్ మీడియా సిండికేట్లకు నచ్చడం లేదు… ఎందుకంటే..? మన హీరోలు ఆ సిండికేట్లను పట్టించుకోరు… మన సత్తా ఏమిటో మన సినిమాలు చెప్పాలి గానీ, ఆర్టిఫిషియల్ బజ్ కోసం మనవాళ్లు సీరియస్ ప్రయత్నాలు ఏమీ చేయరు, అవసరమైన ప్రమోషన్ వర్క్ చేసి వదిలేస్తారు…
ఆ మంట చాలామంది నార్తరన్ మీడియా జర్నలిస్టుల్లో ఉంది… ఆ ప్రభావం వాళ్ల రాతల్లో కనిపిస్తుంది… కానీ వాటితో సినిమాకు జరిగే నష్టం సున్నా… సినిమా బాగుంటే ఎవడూ ప్రేక్షకుడిని థియేటర్‌కు రాకుండా ఆపలేడు… ఇందులో పెద్దగా నిర్మాతకు పోయే పరువు కూడా ఏమీ లేదు… కాకపోతే మరో విషయమూ చెప్పుకోవాలి…
లీగల్ నోటీసులు అందుకున్న రోహిత్, సుమిత్ తదితరులు ప్రత్యేకించి ఎందుకో ప్రభాస్ సినిమాల్ని టాార్గెట్ చేస్తూ రాస్తుంటారు… ఈ అకారణ వైరం ప్రభాస్ మీదే ఎందుకు అర్థం కాదు, ప్రభాస్ నిజానికి ఇవన్నీ లైట్ తీసుకుంటాడు… తన పనేదో తనది, అంతే… ఆ వైఖరికి కల్కి నిర్మాతల ఓవర్ యాక్షన్ భిన్నంగా ఉంది… అనవసరం…! ఆ నోటీసులు, ఆ దావాలు నిలబడేవి కావు, ఎవరినీ శిక్షించలేవు కూడా..! కలెక్షన్లపై రాతలు రివ్యూ బాంబింగ్ కూడా కాదు..!!
Share this Article