.
బీఆర్ఎస్ తప్పక గెలవాల్సిన సీటు… సిట్టింగ్ సీటు… సానుభూతి వోటు… విస్తృతంగా సాధన సంపత్తి… మీడియా, సోషల్ మీడియా మద్దతు…. మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్ వోటరు చూపించిన మద్దతు… ఉపఎన్నిక అనగానే పూర్తిగా కమిటెడ్‌గా పనిచేసే కేడర్… కానీ ఏమైంది..? చేజారింది… చేయి వైపు జారింది…
ఎందుకు..? ఎక్కడ తప్పు దొర్లింది..? అనేకం… అనేకం… ఈరోజుకూ బీఆర్ఎస్ పట్ల జనంలో విశ్వాసం కుదురుకోలేదనేది ఫస్ట్ పాయింట్… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన జనవ్యతిరేకత ఇంకా కనిపిస్తూనే ఉంది…
Ads
1) కేసీయార్ జనంలోకి రాకపోవడం, అసలు తను ఓ ప్రజాప్రతినిధిననే సంగతే మరిచిపోవడం… ఇది తనకు ఫుల్లు నెగెటివ్ అవుతోంది… కారణాలు ఏవైనా గానీ… తను జనంలో లేడు… టెక్నికల్‌గా అటెండెన్స్ నిర్ణీత కాలవ్యవధిలో అవసరం కాబట్టి ఒకటీఅరా సందర్భాల్లో అసెంబ్లీ వైపు చూడటం, అంతే… పూర్తిగా అజ్ఙాతమే…
2) కాళేశ్వరం, విద్యుత్తు అంశాలు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ వంటి అనేక అక్రమాలు జనం బుర్రలకెక్కాయి… రేవంత్ రెడ్డి శిక్షించలేకపోవచ్చుగాక… కానీ జనంలో విస్తృత అవగాహన మాత్రం తీసుకురాగలిగాడు…
3) కవిత ఫ్యాక్టర్… ఏ మహిళా సానుభూతి వోట్లు సాధించాలనుకున్నారో వాటికి గండి కొట్టినవాళ్లు ముగ్గురు… కవిత, మాగంటి తల్లి, మాగంటి మొదటి భార్య… సొంతింటి ఆడబిడ్డనే బయటికి పంపించారు ఏడిపిస్తూ అనే భావన జనంలో వచ్చింది… మాగంటి సునీతది లీగల్ పెళ్లి కాదనే అంశం, వారసత్వ గొడవలు, తన కొడుకు మరణానికి విలన్లు కేటీయార్, సునీత అని మాగంటి తల్లి ముద్ర వేయడం… సానుభూతి వోటును దెబ్బతీసింది…
4) నవీన్ యాదవ్ రౌడీ అని పదే పదే ప్రచారం చేసిన కేటీయార్ ఓ మైనారిటీ లీడర్‌ను చేర్చుకున్నాడు పార్టీలో, తను రౌడీ షీటర్… దాంతో నవీన్ యాదవ్ మీద చేసిన రౌడీ దాడికి వాల్యూ లేకుండా పోయింది…
5) గతంలో మజ్లిస్ బీఆర్ఎస్‌కు జాన్ జిగ్రీ… కానీ ఆ పార్టీ అధికారంలో ఎవరుంటు వాళ్లకే జాన్ జిగ్రీ… అందుకే కాంగ్రెస్‌కు సహకరించేలా మజ్లిస్ అసలు ఈసారి పోటీలోనే లేదు… దీంతో మైనారిటీ వోట్లకు గండి పడింది…
6) బీజేపీ సైలెంటుగా ఉంటే, హిందూ వోట్లు బీఆర్ఎస్‌కు టర్న్ అయ్యి, కాంగ్రెస్ మైనారిటీవాదానికి విరుగుడుగా పనిచేస్తుందని అనుకుంది బీఆర్ఎస్… కానీ అది వర్కవుట్ కాలేదు… (ఎందుకో మరో కథనంలో చెప్పుకుందాం)…
7) సమయానికి బైపోల్స్ స్ట్రాటజిస్టు హరీష్ రావు కొన్నిరోజులైనా సరే, పీక్స్ ప్రచార సమయంలో ఇంటిపట్టునే ఉండాల్సి రావడం.,. ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా వర్కవుట్ కాలేదు… కవిత లేదు, హరీష్ లేడు, కేసీయార్ రాడు… కేటీయార్ ఒక్కడే… సరిపోలేదు…
8) గతంలో సెటిలర్ల వోట్లు బీఆర్ఎస్‌కు గంపగుత్తాగా పడేవి… ఇప్పుడు సెటిలర్ల విధేయత మారిపోయింది… పవర్‌లో ఉన్న పార్టీతో గోక్కోదలుచుకోలేదు వాళ్లు… అందుకే మీటింగులు పెట్టి మరీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు… బీఆర్ఎస్‌లోని కమ్మ ప్రముఖులు కూడా పెద్దగా ప్రచారంలో కనిపించలేదు…
9) అమలులో ఫెయిలైనా సరే, కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లనే అంశంతో బీసీ ఛాంపియన్ అయితే… గతంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించి, ఇప్పుడు కాంగ్రెస్‌ను ఈ అంశంలో విమర్శిస్తూ, వెక్కిరిస్తూ బీఆర్ఎస్ యాంటీ బీసీ అనే ముద్ర సంపాదించుకుంది… కాంగ్రెస్ బీసీ అభ్యర్థికి అది ప్లస్…
10) టీవీ9 డిబేట్‌లో సీపీఎం తెలకపల్లి రవి చెప్పినట్టు…. కేటీయార్ ఈ ఎన్నికను మరీ రౌడీ వర్సెస్ లేడీ అనే ఓ సంకుచిత పర్సనల్ పరిధిలోకి ఎన్నికను దిగజార్చాడు… అంతేకాదు, ఆమెతో బహిరంగంగా వేదికల మీద కన్నీళ్లు పెట్టించి… టీవీ9 రజినీకాంత్ చెప్పినట్టు ‘ఏడుపుగొట్టు రాజకీయాలు’ చేశారు…
11) ఉపఎన్నిక అంటే చాలు కేసీయార్ పర్‌ఫెక్ట్ పొలిటిషియన్ అయిపోతాడు… కవితను తరిమేసిన తన మగవారసుడు కేటీయార్ ఈ విషయంలో కేసీయార్ తాలూకు నిజవారసత్వాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు… అదే జుబ్లీ హిల్స్ సీటు ఎన్నిక ఫలితం చెప్పిన ఓ కఠిన వాస్తవం..!!
12) మీకు కార్ కావాలా..? మీకు బుల్‌డోజర్ పాలన కావాలా అనడిగాడు కేటీయార్… హైడ్రా మీద తమకేమీ వ్యతిరేకత లేదని జుబ్లీ హిల్స్ వోటరు స్పష్టంగా చెప్పాడు..!!
Share this Article