అదుగో, ఆయన పార్టీ జంప్…. ఇదుగో ఈయన అభ్యర్థి అట… కాదు, కాదు, కేసీయార్ ఈ అస్త్రం సంధించబోతున్నాడు… అబ్బో, ఈటల భలే ప్లాన్ చేశాడు… రేవంత్ రెడ్డి ప్రణాళిక ఏమిటి..? ఇలా రోజూ బోలెడు వార్తలు వస్తూనే ఉన్నయ్ హుజూరాబాద్ ఉపఎన్నిక మీద…! ఏదో ఒకటి రాయాలి కదా అనుకుంటూ ఏదేదో రాసేస్తున్నారు… దీనికితోడు కేసీయార్ హుజూరాబాద్ ఉపఎన్నికలను మరీ అసాధారణ రీతిలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడు… తెలంగాణ దళితబంధు వంటి అత్యంత ఖరీదైన ప్రణాళికలూ వేస్తున్నాడు… మరోవైపు ఈటల పాదయాత్ర కూడా ప్రారంభించేశాడు… ఇదుగో… రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది అన్నట్టుగా కలరిస్తున్నారు అందరూ… కానీ..? అసలు హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో రాకపోవచ్చు… ఈ పార్టీలు… ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ ఖర్చు పెట్టీపెట్టీ డంగైపోవాల్సిందే అనేది తాజా ప్రచారం… ఈ సందేహానికి కారణాలు కూడా ఉన్నయ్… అది ఒక్క హుజూరాబాద్ దగ్గరే ఆగిపోలేదు… ఎగువన మమత బెనర్జీ ఎన్నిక దాకా లింకై ఉంది… దిగువన తమిళనాడు దాకా లింకై ఉంది… అదెలాగంటే..?
మమత బెనర్జీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది, ఆమెకు చట్టసభ సభ్యురాలు కావడానికి ఆరు నెలల గడువుంది… అంటే నవంబర్ 5లోపు ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి, దానికోసం భవానీపూర్ అనే నియోజకవర్గాన్ని ఖాళీ చేయించింది… కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడప్పుడే దేశంలో ఉపఎన్నికల్ని నిర్వహించే మూడ్‌లో అస్సలు లేదు… దానికి కారణం చెన్నై హైకోర్టు… కరోనా సమయంలో కూడా బాధ్యతారహితంగా కేంద్ర ఎన్నికల సంఘం పలు రాష్ట్రాల్లో ఎన్నికల్ని నిర్వహించడానికి అది తీవ్రంగా అధిక్షేపించింది… దేశవ్యాప్తంగా కూడా చర్చ సాగుతోంది… ఇది గమనించాకే ఎందుకైనా మంచిదని శాసనమండలి పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది మమత బెనర్జీ… దానిపై కేంద్రం ఏ నిర్ణయమూ తీసుకోకపోవచ్చు… 1) ఆమెకు ఉపయోగపడకుండా చూడటం 2) అసలు శాసనమండళ్లే వేస్ట్ అనే భావనతో ఉండటం… మరేం చేయాలి..? ఆఁ, ఏముంది, గడువు ముగిశాక రిజైన్ చేసేసి, రెండు రోజులాగి మళ్లీ సీఎం అవుతుంది అని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ వంటి సీనియర్లు కూడా అప్పుడే మాట్లాడుతున్నారు… కానీ దేశచరిత్రలో ఇలా చట్టసభ సభ్యులు గాకుండా రెండు టరమ్స్ సీఎంలుగా ప్రమాణం చేసిన దాఖలాలు లేవు అని బెంగాలీ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నయ్.., గతంలోనే సుప్రీం కోర్టు అలా చేయకూడదని తీర్పు చెప్పింది ఏదో కేసులో..!
Ads
దేశంలో ప్రస్తుతం 17 అసెంబ్లీ సీట్లు, 2 లోకసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి… వాటికి ఎన్నికలు ఇప్పుడు బీజేపీ ప్రయారిటీలో లేవు, అవసరం లేదు… ఒక హుజూరాబాద్ సీటో, మరొకటో ఇప్పుడు వాళ్లకు ఇంపార్టెంట్ కాదు… ఎన్నికల సంఘం చడీచప్పుడూ లేకుండా సైలెంటుగా ఉండిపోయింది… అన్నింటికీ మించి కేంద్రమే కరోనా మూడో వేవ్ రావచ్చుననీ, జాగ్రత్తగా ఉండాలనీ ప్రచారం చేస్తోంది… ప్రధాని దాకా అదే చెబుతున్నారు… ఈ స్థితిలో పెద్దగా రాజకీయ ప్రాధాన్యం లేని ఉపఎన్నికల పట్ల బీజేపీకి ఇంట్రస్టు లేదు… ఎన్నికల సంఘానికి అంత పరుగులు తీయాల్సిన పనీ లేదు… కేసీయార్‌కు ఈ ఎన్నిక ఎప్పుడు జరిగినా పెద్ద ఫరక్ పడదు… ఆల్‌రెడీ వెల్ ప్రిపేర్డ్… రోజుకు ఒక ఎన్నికల వరాన్ని ఇచ్చేస్తున్నాడు… అంతా ఖజానా ఖర్చే కదా… ఇక కాంగ్రెస్‌కు పెద్ద ఆశలేమీ లేవు అక్కడ… ఎటొచ్చీ ఈటలకే ఇరకాటం… లేటయ్యే కొద్దీ ఖర్చు తడిసిమోపెడు అవుతుంది… ఇప్పుడున్న స్థితిలో కార్యకర్తల్ని మెయింటెయిన్ చేయడం చాలా ఖర్చుసాధ్యం… మీడియా కూడా కాస్త జనానికి అక్కరకొచ్చే ఇతర అంశాలపై దృష్టి మళ్లించాల్సిందే…!! (స్టోరీ నచ్చితే దిగువన డొనేట్ బటన్ దగ్గరకు వెళ్లి ముచ్చటను సపోర్ట్ చేయండి)
Share this Article