Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాలనలోనే… ఎక్కడో ఏదో బాగా తేడా కొడుతోంది మోదీ మహాశయా..!!

July 28, 2026 by M S R

.

Naren G … ఏడాది క్రితం ధర్మస్థల విషయంలో దుమారం రేపారు.. ఇప్పటివరకు కర్ణాటక ప్రభుత్వం తెరవెనక కుట్రదారులు ఎవరు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు. చేయదు.
రెండేళ్ల క్రితం ఖలిస్తానీలు ఎర్రకోట మీద జెండా ఎగరేశారు.. వాళ్ళను ప్రమోట్ చేస్తున్న దేశ వ్యతిరేక శక్తులు ఎవరు అనేది ప్రజలకు ఇప్పటివరకు తెలియలేదు..

అంతకుముందు రైతు చట్టాల విషయంలో జరిగిన అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారు అనేది పూర్తి వివరాలు తెలియపరచలేదు..
అంతకుముందు షహీన్ బాగ్ అల్లర్లు..
నిన్న బొద్దింకల లొల్లి..

Ads

పార్లమెంట్ వైపు దూసుకువస్తున్న వందల అల్లరి మూకలను అరికట్టకపోవడం ఒకవైపు అయితే.. అసలు లోడ్లకులోడ్లు కంకర రాళ్ళు ఆ ప్రాంతానికి ఎలా చేరుకుంటున్నాయి అనేది ఆశ్చర్యం కలిగించే అంశం. పార్లమెంట్ అనేది ఎంత సున్నితమైన ప్రాంతం..? అక్కడ రక్షణ వలయం ఎంత పలుచనగా ఉందో బొద్దింకల అల్లరి మరోసారి తెలియజేసింది..

ఎప్పుడు ఎక్కడ అల్లరి జరిగినా డీప్ స్టేట్ కో.. చైనాకో, యాంటి నేషనల్ ఫోర్సెస్ అనిపించుకునే రద్దయిన సంస్థలకో ఆపాదించడం ప్రజల ప్రయాస అవుతోంది..
జంతర్ మంతర్ దగ్గర స్విగ్గీ, జోమాటోలలో వస్తున్న తిండికి అరబ్ దేశాలు ఫండింగ్ చేస్తున్నాయని వివాదం రేగింది.. తీరా ఆ డెలివరీలకు అరబ్ దేశం నుంచి ఫండింగ్ ఏం రాలేదని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది..

ఆన్లైన్ లో అరబ్ దేశం నుంచి డబ్బు రాలేదని క్లారిటీ ఇవ్వగలిగిన ఇంటెలిజెన్స్ వాళ్ళు.. ధర్మస్థల విషయంలో ఒక్క మాట కూడా తేల్చకపోవడం బాధాకరం.. అది స్టేట్ కి సంబంధించిన విషయం అని దయచేసి వెనకేసుకుని రాకండి.. నేషనల్ ఇంటెగ్రిటీ అంశం అది.

కోట్ల హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటే పట్టించుకోనివాళ్ళు అరబ్ నుంచి ఫండింగ్ రాలేదని ఎవరిని హేపీస్ చేయడానికి చెప్పినట్టు?
ప్రతిసారీ సోషల్ మీడియా వారియర్లు సర్దడం తప్ప.. అధికారికంగా యాక్షన్ తీసుకుని క్లోజ్ చేసిన ఒక్క వివాదం లేదు.. Feeling very bad and sad about it..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాలనలోనే… ఎక్కడో ఏదో బాగా తేడా కొడుతోంది మోదీ మహాశయా..!!
  • ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిష్టర్’ – ఏమిటి? ఎవరికి? ఎందుకు?
  • సీఎం విజయ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ! ‘ముచ్చట’ ముందే చెప్పింది!!
  • అపర కుబేరులు ఐతేనే పిల్లనిస్తారట! గొంతెమ్మ పేరెంట్స్ !!
  • పాడలేను అన్న పాటకే… జాతీయ పురస్కారం అందుకున్న నైటింగేల్!
  • సో వాట్? జైనాబ్ అఖిలకన్నా పెద్దదే! మళ్లీ పిచ్చి ట్రోలింగ్ షురూ!!
  • ప్రధాని మోడీ ఈ మూడో దఫా పదవీకాలం పూర్తి చేయగలడా..?!
  • ఇప్పుడంటే బొద్దింకలు ! ఈ ‘జెంటిల్‌మేన్’ ఎప్పుడో చర్చించాడు !!
  • గౌరీ ప్రియ ! ఇకపై పాత్రల ఎంపికే ముఖ్యం – పొరపడితే వైష్ణవి కథే !!
  • అత్తింటి అపోలోఉండగా… కోయంబత్తూరు ఎందుకు రాజా..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions