Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరక మంచిదే… ఇదీ ఓ పాఠం… ఆదమరిస్తే మరింత ప్రమాదం…

July 24, 2026 by M S R

.

మరక మంచిదే… జరిగిందంతా మంచికే… కుర్చీపై ఉన్నవాడు ఓ పాఠం నేర్చుకున్నాడు… మితిమీరిన విశ్వాసం ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని, తప్పులు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది… ప్రత్యేకించి ఈ దేశ రాజధాని చుట్టూ ఎన్నిరకాల అసాంఘిక శక్తులు కాచుకుని కూర్చున్నాయో, చిన్న చాన్స్ దొరికినా పెంట పెంట చేస్తున్నాయో తెలిసొచ్చింది…

ఎస్, కేంద్రంలో బీజేపీయే కాదు, ఏ పార్టీ ఉన్నా సరే… ఇలాంటి అల్లర్లను సహించదు… సహిస్తే రాజ్యమే కాదు… ఇండియా ఒక నేపాల్ కాదు, ఒక శ్రీలంక కాదు, ఒక బంగ్లాదేశ్ కాదు… అరాచకం వీథుల్లో విజృంభించి పాలకులు తట్టాబుట్టా సర్దుకుని విదేశాలకు పారిపోవడానికి! ఇండియా చాలామందిని చూసింది… బొద్దింకలు ఎంత..?

Ads

గుర్తున్నారా..? కన్హయ్య కుమార్, ఉమర్‌ ఖాలిద్, అనిర్‌బన్ భట్టాచార్య, హార్దిక్ పటేల్….. ఈ పేర్లు గుర్తున్నాయా? మోదీని, బీజేపీని ఎదుర్కొనే వీరులు అంటూ అప్పట్లో విదేశీ మీడియా ప్లస్ దేశంలోని అంతర్గత జాతి వ్యతిరేక పార్టీలు తెగ మోశాయి… వీరంతా ఏమైపోయారు?

సో, సీజేపీలు, దీప్కేలు ధమ్కీలు కాలగతిలో వస్తుంటాయి, పోతుంటాయి… బీజేపీ రాజకీయ పార్టీ… ఎక్కడ తగ్గాలో తగ్గుతుంది, ఎప్పుడు కొరడా తీయాలో తీస్తుంది… అందులో అమిత్ షాలు ఉంటారు, జేపీ నడ్డా వంటి సాఫ్ట్ కమ్యూనికేటర్లు కూడా ఉంటారు… జంతర్ మంతర్ అంటే తీయన్మెన్ స్క్వేర్ కాదు, ఇది చైనా కాదు… అందుకే సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ…

ఐతే రేపేమిటి..? ఒక్కసారి కేంద్రం సీరియస్‌గా ఆలోచించాలి… నిన్నటి విద్యార్థుల ప్రదర్శనలు, దీక్షల వెనుక ఎవరున్నారు..? ఎవరు పెట్రోల్ పోశారు..? ఎవడు పడితే వాడు ఎంటరయ్యాడు… ఏవేవో డిమాండ్లు, వీథుల్లో అరాచకం క్రియేట్ చేశారు, సోషల్ మీడియా విషాన్ని ప్లాన్‌డ్‌గా ఎవడు ఎక్కించాడు..? ఏకంగా పోలీసు బలగాల మీద దాడులకు ప్రేరేపించింది ఎవరు..?

వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ల వెనుక కేవలం ఒక సెక్షన్ మాత్రమే ఉంది, కల్లోలం క్రియేట్ చేసింది… ఇప్పుడు రకరకాల శక్తులు దిగాయి… చివరకు విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని నిరసిస్తూ పాస్టర్లు కూడా వీథుల్లోకి వచ్చారు… అసలు కుదరనేలేదు, అమెరికాతో ట్రేడ్ డీల్‌కు నిరసనగా అంటూ మళ్లీ రైతులు బయల్దేరారు… ఐఎస్ఐ, ఖలిస్థానీ ఫోర్సెస్, అర్బన్ నక్సల్స్, తుక్‌డే తుక్‌డే గ్యాంగులు, యాంటీ-హిందూ శక్తులు యాక్టివ్ అయిపోయాయి…

గతంలో సీఏఏ, ఎన్ఆర్సీ పేరిట కూడా ఇవే అల్లర్లు జాతీయ స్థాయిలో రేపారు… ఇక్కడ విషాదం ఏమిటంటే..? ఎప్పుడో కాలం చెల్లిన లెఫ్ట్‌ను వదిలేస్తే… కాంగ్రెస్ కూడా బాధ్యత కలిగిన ఓ జాతీయ పార్టీగా తనను తాను దిగజార్చుకోవడం! ఏదైనా అంశంపై నిరసన ప్రకటించదలిస్తే తనకు చేతకాదా..? ఆఫ్టరాల్, ఒక సోషల్ సెటైర్ పార్టీ సీజేపీ సాయం కావాలా?

థాంక్ గాడ్, ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలో లేడు, లేకపోతే ఈ మంటలు ఇంకా విజృంభించేవి… లేడీ మమత బెనర్జీ తను… ఎవడో సోరోస్, ఏదో డీప్ స్టేట్ అంటూ సమర్థించుకోజూడటం వేస్ట్… ముందుగా ఢిల్లీని సేఫ్ జోన్‌గా మార్చాలి… ఇప్పుడు పిల్లలను ముందుబెట్టి అరాచకీయాలు సాగాయి… రేప్పొద్దున ఇంకేదో ఇష్యూ… రకరకాల అసాంఘిక శక్తులు పెట్రోల్ టిన్నులతో రెడీ… ఈరోజు బొద్దింకలు, రేపు ఇంకేవో గొంగళి పురుగులు… బహుపరాక్!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions