Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అది ఇండియా కాదు… అక్రమ వలసదార్లను నెత్తిన పెట్టుకోవడానికి..!!

February 7, 2025 by M S R

.

అమెరికా అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వలసదార్లను తన ఖర్చుతోనే తన మిలిటరీ విమానాల్లో స్వదేశాలకు పంపిస్తోంది…

సంకెళ్లు వేశారు, నేరగాళ్లలా చూశారు, అది మోడీ వైఫల్యం అని పెద్ద రచ్చ… ఒక దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే అది నేరమే… అదేమైనా ఇండియానా..? దేశంలోకి అక్రమంగా రాగానే, వెంటనే రేషన్ కార్డులు, వోటరు కార్డులు, ప్రభుత్వ పథకాలు ఇచ్చి నెత్తిన పెట్టుకోవడానికి..? రాబోయే రోజుల్లో వాళ్లకు రిజర్వేషన్లు కూడా ఇస్తారేమో బహుశా…

Ads

అలా పంపించివేయబడిన వాళ్లలో ఒకడి మీద ఇటలీలో కేసులున్నాయట… ఒకామె ఏకంగా కోటి రూపాయలు ఏజెంటుకు ఇచ్చి, నాలుగు దేశాల మీదుగా దొంగ మార్గంలో వెళ్లిందట… ఇంకెవరో 60 లక్షలు ఖర్చుపెట్టాడట… రకరకాల మానవీయ కథలు రాస్తున్నది మీడియా… ఏజెంట్లు దోచుకున్నారు అని వార్తలు (ఈనాడు)… వాళ్లేమైనా సక్రమ మార్గంలో తీసుకెళ్తాం అని చెప్పారా..? తీసుకుపోయేది దొంగ దారి అని వలస వెళ్లే వాళ్లకు తెలియదా…?

మిత్రుడు వాసిరెడ్డి అమర్నాథ్ పోస్టు అమెరికాకు వెళ్లే డంకీ రూట్ ఎంత డేంజరో, ఎంతటి నీచప్రయాణమో చెబుతోంది… అది యథాతథంగా…



బతకడం కోసం చచ్చిపోతున్నారు !
అమెరికాలో అక్రమంగా ప్రవేశించేవారిలో ఎక్కువ మంది వెళ్ళేది… గాడిద మార్గం .
ఎల్ బుర్రో అనే స్పానిష్ మాటకు అర్థం గాడిద .
గాడిదలా బరువులు మోసుకొంటూ అడ్డదిడ్డంగా వెళ్లడం అనే భావాన్నుంచి ఇది పుట్టింది .
గాడిద మార్గం రహదారి కాదు .
ఎన్నెన్నో దొంగ మార్గాలు .

ఇందులో ఒకటి… దరియెన్ ఖాళీ స్థలం .
అతి భయంకరమయిన కీకారణ్యం .. చిత్తడి నేల.
పొడవు 97 కిలోమీటర్లు .
పనామా… కొలంబియా మధ్య వుంది .
విష పాములు , చిరుతలు, విష కీటకాలు ఇక్కడ లెక్కకు మించి ఉంటాయి .
ఎప్పుడూ వర్షం .. దానితో పాటే ఎండ .. వేడి .. చెమటలు కారి పోతాయి .

అసలు సమస్య ఇక్కడ వున్న డ్రగ్ మాఫియాలతో .
ఆడవాసన కనబడితే వదిలిపెట్టరు .
ఈ మార్గంలో వెళ్లేవారికి ఏజెంట్స్ ముందుగానే కండోమ్లు ఇస్తారు .
డ్రగ్ కేటుగాళ్లతో సంభోగానికి ఒప్పుకోవాలి .
లేకపోతే చిత్ర హింసలు పెట్టి రేప్ చేసి చంపేస్తారు .

ఇవన్నీ లేకుండా ముందుగానే ఒప్పుకొంటే ప్రాణం దక్కుతుంది .
ఎయిడ్స్ సోకకుండా రబ్బరు తొడుగు .
వారు అడిగితే చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేయాలి .
రోజుకు ఒక చిన్న బ్రెడ్ ముక్క .. రెండు బిస్కెట్లు .

తాగు నీరు పెద్దగా అందుబాటులో ఉండదు . దరియెన్ గాప్ ప్రయాణం వారం నుంచి 15 రోజులు పడుతుంది .
అదేంటి కేవలం 97 కిలోమీటర్స్ కదా?.. అనుకొంటున్నారా ?
కొండలు గుట్టలు .. బురద .. చెట్లు చేమలు .. పాములు .. దోమలు .. అడుగు తీసి అడుగు వెయ్యాలనుంటే నరకం .
అక్కడ ఖాయిలా పడితే అంతే సంగతి .

ఖాయిలా మనిషిని అక్కడే వదిలేసి బృందం ముందుకు వెళ్ళిపోతుంది .
అంటే అక్కడే తిండి లేకుండా చచ్చి పోతారు .
జనాలు వెళుతుంటే దారిలో శవాలు ఆస్తి పంజరాలు కనిపిస్తాయి.
ఇంతటి దారుణమయిన మార్గం లో ఎవరు వెళుతారు అనుకొంటున్నారా ?
2023 లో మొత్తం అయిదు లక్షల మంది వెళ్లారు . అంతకు ముందు సంవత్సరంకంటే ఇది డబల్ .
విమానంలో ఎక్కించినా బేడీలు ఎందుకు ?

భయం ..
భయపెట్టడం .
” మా దేశానికి అక్రమమార్గంలో వస్తే పర్యవసానాలు ఇలా ఉంటాయి!” అని అందరికీ హెచ్చరిక .
సైకలాజికల్ వార్నింగ్ .

అందుకే అమృత్‌సర్ ప్రయాణీకుల సంకెళ్ళ వీడియోను వారి ప్రభుత్వం అధికారికంగా పెట్టింది .” దరియెన్ గ్యాప్ లో ఎన్నో కష్టాలు పడి మా దేశంలో దూరినా .. పట్టుకొంటాము. చీకటి గదుల్లో బందిస్తాము . అవమానకర రీతిలో చేతులకు కాళ్లకు బేడీలు వేసి పంపించేస్తాం “అని వారు అధికారికంగా చెబుతున్నారు .
శిక్షించవచ్చు కదా ?
టైటిల్ 8 సెక్షన్ 1325 .. us కోడ్ ప్రకారం ఆ దేశంలో అక్రమమగా చొరబడితే రెండేళ్లు జైలు .. రెండు లక్షల యాభై వేల డాలర్స్ అపరాధం .
ఇప్పుడు పంపించవేయబడ్డవారు ఇటీవలే వెళ్ళినవారు . వీరిలో చాలా మంది బోర్డర్ లోనే పట్టుబడి ఇన్నాళ్లు జైళ్లలో ఉన్నవాళ్లే . ఆస్తి మొత్తం అమ్మి ఏజెంట్స్ కు అప్పచెప్పి అమెరికాలో చొరబడి … అప్పుడే పట్టుబడితే వారి దగ్గర ఏమి ఉంటుంది ? ఇరవై లక్షలు కట్టగలరా ? అందుకే పంపేస్తున్నారు.

ఇది వరకే అక్కడ చొరబడి కాస్తో కూస్తో డబ్బు సంపాదించిన వారితో ఎలా వ్యవహరిస్తారో చూడాలి .
విద్యార్థుల సంగతి ఏంటి ?
స్టడీ వీసాపై వెళ్లిన వారు క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయకూడదు .
ఇన్నాళ్లు సాగింది .
ఇప్పుడు… పట్టుబడిపోతాము అని భయంతో టెక్సాస్ లాంటి చోట్ల ఎవరూ బయట ఉద్యోగాలకు వెళ్లడం లేదు .
వీరు వెళ్లినా పార్ట్ టైం ఉద్యోగాలు ఇవ్వడానికి వారు రెడీగా లేరు .
పరిస్థితి దారుణంగా వుంది .

ఆయనకో షాప్ వుంది . వ్యాపారం వారి కుల వృత్తి . కొడుకును అరవై లక్షల అప్పు చేసి అమెరికా పంపించాడు . అటుపై మరో ఇరవై లక్షల అప్పు . వడ్డీ కట్టలేక మొన్న ఆత్మహత్య చేసుకొన్నాడు .
కొడుకు బంగారు భవిత కోసం ప్రాణం విడిచిన తండ్రి . ఎవరిదీ పాపం ?
ఇంత జరిగినా జనాలకు ఇప్పటికీ సరైన సమాచారం ఇచ్చేవారు లేరు .

“పక్క వాళ్ళు వెళ్లారు .. మనం కూడా వెళ్ళాలి” అనే తపనే .
గాడిద మార్గంలో ప్రాక్సీ మార్గంలో అమెరికాకు పంపే ఏజెంట్స్ కోటీశ్వరులు అయిపోయారు .
అమెరికాలో కేసినోలలో ఒక రాత్రి పూట వారు పందెం కాచే డబ్బు చూసి అమెరికా సంపన్నులే కళ్ళు తేలేస్తున్నారు .

నాశనం అయిపోతోంది మనోళ్లే ..
దోచుకొంటోంది మనోళ్లే ..
మొసలి కన్నీరు కార్చేదీ మనోళ్లే .
డాలర్ డ్రమ్స్ కాస్తా… డాలర్ నైట్ మేర్ అయ్యింది

బహుశా మరో రెండేళ్లకు ప్రతిభ వున్నవారికి ఇండియాలో ఫ్లైట్ ఎక్కేముందే గ్రీన్ కార్డు చేతిలో పెట్టి మేళతాళాలతో అమెరికా ఆహ్వానించవచ్చు . రహదారికి .. అడ్డదారికి తేడా ఇప్పటికైనా తెలుసుకొంటే అందరూ బాగుపడతారు ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రజల కోసం చేసే పోరాటాలు, త్యాగాల వాస్తవ విలువ ఎంత..?!
  • సో వాట్..? నా నలుపే నా బలం…! తలెగరేసి చెబుతుంది అర్చన..!!
  • పెళ్లయిన 9 రోజులకే భర్త హత్య…! ఆ తరువాత ఆమె కథ ఏమైంది..?!
  • బిపాషా మగది..! నెట్‌లో ఓ పిచ్చి ‘కండల’ పంచాయితీ కలకలం..!
  • పెరోల్..! అన్ని బంధాల్నీ గౌరవించే ఓ అనుబంధాల బాధితుడి కథ..!!
  • సీఎం ప్రసంగాల్లో గుణాత్మక మార్పు… విజన్ 2047 గురించి గుడ్ ప్రొజెక్షన్…
  • కేసీయార్ ఢిల్లీకి పోయేది లేదూ… పోయినా పలకరించే గొంతూ లేదు…
  • రీల్ హీరోలు కాదురా… ఇదుగో వీళ్లు రియల్ హీరోలు… మార్గదర్శులు…
  • గుడ్లగూబ కళ్లతో అదరగొట్టేస్తయ్… ఈ జీవులేమిటో తెలుసా..?
  • వరల్డ్ ఫేమస్ గాంజాకు అడ్డా… అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions