Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆశల్లో ఓ లీడర్… అప్పటి ఓ జ్ఞాపకం…

April 22, 2023 by M S R

Murali Buddha……….   ఇప్పుడంటే నేతలందరి ఇంటి పేరు సీఎం .. సీఎం అయిపోయింది గానీ… ఆ రోజుల్లో వేరు … ఓ డిప్యూటీ సీఎం కథ- ఓ జ్ఞాపకం.1995-96 లో ఓ రోజు అసెంబ్లీ క్యాంటిన్ లో టీడీపీ mla మల్యాల రాజయ్య నేను టిఫిన్ చేస్తున్నాం … ఓ mla వచ్చి రాజయ్యను హాయ్ డిప్యూటీ సీఎం బాగున్నావా ? అని భుజం తట్టి వెళ్లి పోయారు … ఒకరు కాదు, ఇద్దరు కాదు, అప్పటికి కనీసం పది మంది mla లు రాజయ్యను డిప్యూటీ సీఎం అని నవ్వి వెళ్లి పోతున్నారు …

సీఎం .. సీఎం అనే నినాదాలను ఆపమని పవన్ చెప్పినా సరే, అభిమానులు వినరు తెలుసు కదా … ఇక ఈటెల , బండి , ప్రవీణ్ కుమార్… ఇలా ఎవరి ఉపన్యాసం ఐనా సీఎం సీఎం అంటూ అభిమానులు ఇచ్చే నినాదాలతోనే మొదలవుతుంది … కేఏ పాల్ , షర్మిల మాత్రం వీరికన్నా భిన్నంగా… కాబోయే సీఎం నేనే అని చెబుతుంటారు … ఇప్పుడు దాదాపు అందరు నాయకులకు సీఎం సీఎం అనేది ఇంటి పేరుగా మారిపోయింది … 95 లో అలా కాదు ..

మల్యాల రాజయ్యను అందరూ డిప్యూటీ సీఎం అంటుంటే ఆయనతో ఉన్న చనువుతో నేను ‘‘ఏంటీ, అందరూ నిన్ను అలా బనాయిస్తున్నారు ( వెటకారం చేస్తున్నారు ) అని అడిగితే …. ఆయన ఒక్కసారిగా సీరియస్ ముఖం పెట్టి … ఇందులో బనాయించడం ఏముంది నేను డిప్యూటీ సీఎం అవుతాను అన్నారు …

Ads

మల్యాల రాజయ్య మేజిస్ట్రేట్ గా చేసేవారు . టీడీపీలో చేరి ఆందోల్ నుంచి mla అయ్యారు. బడ్జెట్ లీక్ అని 88 లో ఎన్టీఆర్ 32 మంది మంత్రులతో రాజీనామా చేయించి కొత్తవారితో మంత్రివర్గం ఏర్పాటు చేశారు గుర్తుంది కదా .. అలా రాజయ్యకు ఆర్థిక శాఖ మంత్రి పదవి లభించింది … Mla గా ఆయన, రిపోర్టర్ గా నేను సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డికి బస్సులో వెళ్లే వాళ్ళం .. పరిచయం బాగానే ఉంది ..

డిప్యూటీ సీఎం అనే పిలుపును ఆయన అంత సీరియస్ గా తీసుకోవడం వింతగా అనిపించింది … ఇంతకూ మీరు డిప్యూటీ సీఎం అవుతున్నారని ఎవరు చెప్పారు ? బాబు చెప్పారా ? అని అడిగితే వంద కాపీలు ముద్రించే ఓ చిన్న పత్రికలో జగన్మోహన్ అనే జర్నలిస్ట్ రాశాడుట … ఆశ్చర్యపోవడం నా వంతయింది…

ఇలాంటి పత్రికలు మార్కెట్ లో కనిపించవు … వంద కాపీలు ముద్రించి అవసరం అయిన చోట ఉచితంగా పంపిణీ చేస్తారు … అలా టీడీపీ mla లకు పంచారు …. మరీ ఎక్కువగా ఆశపడుతున్నావు , డిప్యూటీ సీఎం ఇవ్వరు అని కారణాలు చాలా వివరంగా చెప్పాను … అంతా విన్నాక ఆయన నువ్వు ఎన్నయినా చెప్పు, జగన్ మోహన్ రాసింది నాకు నచ్చింది … ఐనా కాకపోయినా డిప్యూటీ సీఎం అనే పలకరింపు హాయిగా ఉందని సంతోషంగా చెప్పాడు … చివరకు అతను మళ్లీ మంత్రి కూడా కాలేదు ..

నిజం ఎవడికి కావాలి … చెవులకు ఇంపుగా ఉండే మాటలు కావాలి కానీ …. (ఇది జరిగిన చాన్నాళ్లకు ఇంకో రాజయ్య, అనగా తాటికొండ రాజయ్య ఉపముఖ్యమంత్రి అయ్యాడు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions