చక్కగా, సాఫీగా, విజయవంతంగా, బాలయ్య కొత్త ముఖచిత్రాన్ని చూపిస్తూ సాగిపోతున్న అన్‌స్టాపబుల్ షోను సాక్షాత్తూ బాలయ్యే పట్టాలు తప్పించేశాడు… ఫలితంగా ఒక్కసారిగా నిస్సారంగా తయారై, చిరాకు లేవనెత్తింది మొన్నటి ఎపిసోడ్… అసలు ఈ సీజన్2 మొత్తం అలాగే ఉంది… మరీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, నటి రాధికలతో చేసిన మొన్నటి ఎపిసోడ్ ఎందుకు అంత నాసిరకంగా మారింది..?
ఫ్యూజన్… పాలిటిక్స్‌లోని సీరియస్‌నెస్‌నూ, సినిమా ఫీల్డ్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్‌నూ కలిపి శృతిచేయడం చాలా కష్టం… కర్నాటక సంగీతానికి పాప్, జాజ్, యెడ్లీ కలిపినట్టు ఉంటుంది… మరీ ప్రత్యేకించి కిరణ్‌కుమార్‌రెడ్డి నవ్వుమొహంతో కనిపిస్తాడు గానీ సీరియస్ పొలిటిషియన్… పర్సనల్, వెరీ పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకోడు… సురేష్‌రెడ్డి కూడా అంతే… వాళ్లిద్దరికీ తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు, పదాలు సరిగ్గా పలకలేరు… ఈ షోలో కూడా కనబడింది పలుసార్లు… వాళ్లకు తోడుగా నటి రాధిక ఈ ఎపిసోడ్ భాగస్వామి కావడం అస్సలు నప్పలేదు… నచ్చలేదు…
యంగ్ ఏజులో నిజాం కాలేజీలో చదివేటప్పుడు బాలయ్య వాళ్లకు కాలేజీమేట్… సురేష్‌రెడ్డికి కొన్ని సరదా సంగతులు ఉండవచ్చుగానీ, కిరణ్‌కుమార్‌రెడ్డి సీరియస్ క్రికెట్ ప్లేయర్… నిజాం కాలేజీ జట్టుకు కెప్టెన్… ఇండియన్ టీం మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ తన టీంలోనే ఆడేవాడు… సో, వాళ్లతో అన్‌స్టాపబుల్ వంటి ఫన్ సెంట్రిక్ ఎపిసోడ్ కష్టం… అందుకే డ్రైగా అనిపించింది… ఒకదశలో కిరణ్‌కుమార్‌రెడ్డే ఎహె ఈ సరదా షోలో పాలిటిక్స్ గురించి ఎందుకులే అనేశాడు… అంటే, పాలిటిక్స్ చర్చకు అది వేదిక కాదు, అదే స్ట్రెయిట్‌గా చెప్పాడు కిరణ్‌కుమార్‌రెడ్డి…
Ads
ఈ డ్రై షోకు కాస్త మసాలా అద్ది కవర్ చేయాలని అనుకున్నారేమో… రాధికను ప్రవేశపెట్టారు… ఆమె అరవయ్యేళ్ల వయస్సులో కూడా గలగలా ఉరకలెత్తే ప్రవాహం… ఆమెకూ నెమ్మదిగా పారే ప్రవాహాల్లాంటి సురేష్, కిరణ్‌కూ శృతి ఎలా కలుస్తుంది… అంతసేపు షోలో కూడా రెండు వేర్వేరు స్ట్రీమ్స్ నడిచాయి… కనీసం రాధికతో ఒక ఎపిసోడ్… డ్రై అయినా సరే, సురేష్, కిరణ్‌లతో వేరే ఎపిసోడ్ నడిపించినా బాగుండేది…
నిజానికి ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ చంద్రబాబుతో చేయడంతో ఇది గాడితప్పింది… పాలిటిక్స్‌కు సంబంధించి ఎంత సంచలన విషయాన్ని కొత్తగా రివీల్ చేసినా సరే, ఇది సరైన వేదిక కాదు… ఈ నిర్వాకం ఇలా ఉంటే… అడవి శేషు, శర్వానంద్ ఎపిసోడ్ కాస్త కరణ్ జోహార్ షోలాగా బూతు వైపు వెళ్లబోయి, చివరలో తప్పించుకుంది, తమాయించుకుంది… ఆ ప్రశ్నలు, ఆ ప్రస్తావనలు ఏవీ ఈ షోకు సూటబుల్ కావు… బాలయ్య ఆ స్క్రిప్టులకు ఎందుకు అభ్యంతరం చెప్పలేదో అర్థం కాదు…
బాలయ్యతో షో అనగానే చాలామంది వెనుకాడుతున్నారు, రావడం లేదు అనే ప్రచారం ఉంది… ఉండవచ్చు, కానీ సినిమా నటులే కావాలా..? మోడల్స్, టీవీ ఫీల్డ్, వర్ధమాన తారలు, సింగర్స్, కొరియోగ్రాఫర్స్, మ్యూజిక్ కంపోజర్స్, నిర్మాతలు, దర్శకులు ఎందరు లేరు..? పోనీ, ఓసారి కాంతార దర్శకుడు రిషబ్‌ను, తెల్లారిలేస్తే తనను బాగా గోకుతున్న రష్మికను తీసుకొచ్చి కూర్చోబెట్టు బాలయ్యా… అప్పుడు ఉంటుంది మజా… పోనీ, అదే రష్మిక సర్వస్వం అనుకుంటున్న విజయ్ దేవరకొండను తీసుకురా… కానీ వేర్వేరు రంగాల ఫ్యూజన్ వద్దు బాలయ్యా… నువ్వంటే ఆల్‌రౌండర్… టీవీ షోలు, సినిమాలు, పాలిటిక్స్ అన్నీ చల్తా… కానీ ఈ షోకు అవన్నీ ఒకేచోట జుగల్బందీలాాగా నై చల్తా…!!
Share this Article