Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక్క క్షణం…! ఎంత విలువైంది… ఓసారి పుతిన్ పుట్టుకను చదవండి… అర్థమౌతుంది…

June 15, 2025 by M S R

.

ఒక కథ చెప్పుకోవాలి… Destiny is Ultimate… ఈ మాట చెబితే చాలామంది నాస్తికులు ఛీఛీ అంటారు… నాన్సెన్స్ అంటారు… కానీ అదే అంతిమం… ఇప్పుడు ప్రపంచమంతా చెప్పుకుంటున్న పేర్లలో ఒకటి పుతిన్…

అనేక అగ్రదేశాలు ఒక్కటై రష్యాను వ్యతిరేకిస్తున్నా, యుద్దోన్మాది అనే ముద్ర వేస్తున్నా, పుతిన్ అంతు చూడాల్సిందే అని ఉరుముతున్నా, పదే పదే తలుచుకుంటున్న పేరు పుతిన్… ఒకప్పటి గోర్బచెవ్ దేశాన్ని ముక్కలు చేశాడు, బలహీనపరిచాడు… కానీ పుతిన్… ఓ డిఫరెంట్ స్టోరీ…

Ads

ఒకప్పుడు కేజీబీ ఏజెంట్… ఇప్పుడు తిరుగులేని నియంత… ఓ కమ్యూనిస్టు పాలనలో నియంత ఏమిటి అనడక్కండి… చైనా జిన్‌పింగ్ అయినా, ఉత్తర కొరియా కిమ్ అయినా… నియంతలే… ఈ నియంతృత్వం మంచికో, చెడుకో కాలం చెబుతుంది…

కానీ అవి వ్యక్తి కేంద్రిత పాలనవ్యవస్థలు… అసలు ఈ పుతిన్ ఎవరు…? 70 ఏళ్ల వయస్సులోనూ ఓ జేమ్స్‌బాండ్ కేరక్టర్‌లాగా ప్రపంచాన్ని ఎదిరిస్తున్నాడు, ఏమిటీ తెగువ..? ఎవరు తను..? ఈ బాహుబలి జన్మరహస్యం ఏంటి..?

ఇదే ఆలోచిస్తే… తన పుట్టుక ఓ విచిత్రం… అదీ చెప్పుకోవాలి… చరిత్రను మార్చే జాతకాలున్న వ్యక్తుల్ని మరణం కూడా కాస్త కరుణిస్తుంది… అదే డెస్టినీ అంటే… ఇది అర్థం కావాలంటే పుతిన్ పుట్టుక గురించి చెప్పుకోవాలి… హిల్లరీ క్లింటన్ గ్రంథస్థం చేసింది అనేసరికి కాస్త క్రెడిబుటిలీ వచ్చింది… ఓసారి చదువుకుందాం… నమ్మాలా లేదా అనేది ఆయా వ్యక్తుల మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది…

సరే, ఓసారి హిట్లర్ గురించి చెప్పుకుందాం… ఆయనకు కళ అంటే ప్రీతి… అందులో ఎదగాలని అనుకున్నాడు… గుర్తింపు కోరుకున్నాడు… వియన్నాలో ఓ అకాడమీకి దరఖాస్తు కూడా చేసుకున్నాడు… రెండుసార్లు తిరస్కరణ… మరేం చేయాలి..? సైన్యంలో చేరాడు… ఇక ఆ తరువాత తను ఏమయ్యాడో, ఇప్పటికీ చరిత్ర తనను ఎందుకు గుర్తుచేసుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పుతిన్ పూర్తి పేరు… వ్లాదిమిర్ పుతిన్… ఓసారి రెండో ప్రపంచయుద్ధం రోజుల్లోకి వెళ్దాం… రెండో ప్రపంచ యుద్ధం హోరాహోరీగా జరుగుతోంది… రష్యా సైనికుడొకరు యుద్ధం నుంచి కొద్దిపాటి విరామం తీసుకుని ఇంటికి బయలుదేరాడు…
తను నివాసముండే అపార్ట్‌మెంట్‌కు సమీపిస్తున్న సమయంలో ఓ దృశ్యం చూశాడు… కన్నీళ్లు పెట్టుకున్నాడు… రోడ్డుపై గుట్టలుగా పడివున్న శవాలను స్మశానాలకు తరలించేందుకు ఓ వ్యక్తి వాటిని ట్రక్కులోకి ఎక్కిస్తున్నాడు…
వికలమైన మనసుతో తనే అక్కడికి కదిలాడు… ఏ విధి తనను అలా నడిపించిందో తెలియదు… ఆ మృతదేహాల్లోని ఓ మహిళ కాళ్లు అతడిని ఆకర్షించాయి… షూ ధరించి ఉన్న ఆ కాళ్లను అతడు గుర్తు పట్టాడు…
ఆమె తన భార్యేనని తెలుసుకోవడానికి అతడికి ఎన్నో క్షణాలు పట్టలేదు. వెంటనే గుండె బరువెక్కింది… ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఆ మృతదేహాన్ని తీసేందుకు ప్రయత్నించాడు… అక్కడున్న వ్యక్తి వారించి వాగ్వివాదానికి దిగాడు…

చివరికి ఎలాగోలా తన భార్య మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకుని, తన అపార్ట్‌మెంట్‌లోకి పరుగులు తీశాడు,,. ఆ తర్వాత ఆమెను శరీరం వెచ్చగా ఉండడం, ముక్కుపుటాలు అదురుతుండడంతో ఆమె బతికే ఉందని గ్రహించాడు…

ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సాయం అందించాడు… దీంతో ఆమె కోలుకుంది… అతడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది… ఆమె బతికింది…

సీన్ కట్ చేస్తే… సరిగ్గా 8 ఏళ్లకు అంటే.. 7 అక్టోబరు 1952లో ఆమె ఓ అబ్బాయికి జన్మనిచ్చింది… అతడే.. ఇప్పుడు ప్రపంచం మొత్తం కలవరిస్తున్న వ్లాదిమిర్ పుతిన్… మరో క్షణంలో స్మశానానికి చేరుకోవాల్సిన ఆమెను భర్త గురించడం ఏమిటి… ఆమె తిరిగి జీవించడం ఏమిటి..?  వెనక ఏదైనా పరమార్థం ఉందా? ఉంది… పుతిన్ చరిత్ర ఇంకా బాకీ ఉంది గనుక…!

అప్పటి లెనిన్‌గ్రాడ్, అనగా ఇప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్‌… అందమైన నగరం… అక్కడే పుతిన్ జన్మించాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ నగరం 900 రోజులపాటు మూతబడే ఉంది. 10 లక్షల మందికిపైగా ఆకలితో అలమటించి చనిపోయారు…

చాలా కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి…. ఆ సంక్షోభ సమయంలో జన్మించినవాడే ఈ పుతిన్… తండ్రి వ్లాదిమిర్. తల్లి మరియా… ‘హార్డ్ చాయిసెస్’ అనే పుస్తకంలో హిల్లరీ క్లింటన్ ఈ విషయాలను పంచుకున్నారు…

పుతిన్ లెనిన్‌గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి, న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నాడు… ఆ తర్వాత 100 మందికిపైగా విద్యార్థులను రష్యా గూఢచార సంస్థ కేజీబీలోకి తీసుకున్నారు. వారిలో పుతిన్ కూడా ఉన్నాడు…

అసలు 16 ఏళ్ల వయస్సు నుంచే పుతిన్ కేజీబీకి సేవలు అందిస్తున్నాడు… సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యాక రాజకీయాల్లోకి వచ్చాడు… ఇక తను ఎదగిన తీరు, ఇప్పటి నియంతగా ఎదగడం వెనుక చాలా చాప్టర్లున్నయ్… ప్రపంచాన్ని అమెరికా ఏకధ్రువం నుంచి విడిపించే కర్తవ్యం ఏదో పుతిన్ రూపంలో ఏదో బాకీ ఉన్నట్టుంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions