Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సతీ సావిత్రి మార్క్ కథకు ట్రెజర్ హంట్ మిక్స్… జనానికి నచ్చింది…

September 20, 2024 by M S R

గిరిబాబుకి మంచి బ్రేకుని ఇచ్చింది 1977 లో వచ్చిన ఈ దేవతలారా దీవించండి సినిమా . Adventure , fantasy , sentiment , emotional movie . 1976 లో హిందీలో ఓ ఊపు ఊపిన సినిమా నాగిన్ ప్రేరణతో మన తెలుగు సినిమాను జయభేరి పిక్చర్స్ వారు తీసారు . కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా . ఈ సినిమాలో మురళీమోహన్ , గిరిబాబు భాగస్తులు . డైలాగులను జంధ్యాల వ్రాసారు .

నాగిన్ సినిమాకు మన తెలుగు సినిమాకు తేడా ఉంది . మన తెలుగు సినిమాను భక్తి సినిమాగా , మరో సతీ సావిత్రి సినిమాగా మార్చుకున్నారు . ఆ సెంటిమెంట్ వలనే మన తెలుగు సినిమా కూడా బాగానే ఆడింది . లో బడ్జెట్ సినిమా . లాభాలు వచ్చాయి .

హిందీ సినిమాలో నాగినిగా నటించిన రీనారాయికి హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది . రేఖ , సునీల్ దత్ , జితేంద్ర , ముంతాజ్ , సంజయ్ ఖాన్ , ఫిరోజ్ ఖాన్ , అనిల్ ధావన్ , కబీర్ బేడీ ప్రభృతులు నటించారు . రీనారాయ్ నాగిన్ పాత్రను జయమాలిని , రేఖ పాత్రను ప్రభ నటించారు

Ads

.
మన తెలుగు సినిమాలో ట్రెజర్ హంట్ కూడా ఉంది . నల్లమల అడవుల్లో నిధులు ఉన్నాయని అయిదుగురు మిత్రులు బయలుదేరుతారు . రంగనాధ్ , హరిబాబు , చంద్రమోహన్ , ఈశ్వరరావు , మాదల రంగారావు , వీళ్ళతో పాటు డ్రైవర్ మాడా . అడవిలో గిరిబాబు వీరోచిత పాత్ర . మధ్యలోనే ముగుస్తుంది ఈ పాత్ర .

మిత్రులంతా కరడుగట్టిన నాస్తికులు , చార్వాకవాదులు . రంగనాధ్ భార్య ప్రభ . సినిమాలో ఆమె పేరు సావిత్రి . తన దైవభక్తితో నాగిని (ఫణి) కాటు వేసిన తర్వాత కూడా పౌరాణిక సినిమాల్లోలాగా వెనక్కు రప్పించి విషాన్ని తీసేపిస్తుంది సతీ సావిత్రి .

మురళీమోహన్ , సాక్షి రంగారావు , అల్లు రామలింగయ్య , అనిత , రమాప్రభ ప్రభృతులు ఇతర పాత్రల్లో నటించారు . తక్కువ బడ్జెట్లో , నలుపు తెలుపు సినిమాగా పకడ్బందీగా తీసుకున్నారు . గట్టి స్క్రీన్ ప్లే . చక్కటి ప్రొడక్షన్ ప్లానింగ్ . (స్కోప్‌లో బ్లాక్ అండ్ వైట్)

చాలామంది ఆశపోతులకు ఇప్పటికీ అడవుల్లో , గుళ్ళల్లో నిధులు ఉంటాయని నమ్మకం . అప్పుడప్పుడూ మీడియాలో చూస్తుంటాం . అడవుల్లోకి వెళ్లి చనిపోతుంటారు . ఎవరి గోల వారిది .

ఆడవారికి , కుర్రవాళ్ళకు ఈ సినిమా బాగా నచ్చింది . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు బాగానే ఉంటాయి . క్లైమాక్స్ పాట దేవతలారా దీవించండి పాట జనం చేత చప్పట్లు కొట్టించింది . ఆరోజుల్లో ప్రేక్షకులు హాయిగా ఈలలు వేసేవారు , చప్పట్లు కొట్టేవారు , పిచ్చపిచ్చగా నచ్చితే డాన్సులు వేసేవారు . యూట్యూబులో ఉంది .

ఈ సినిమాలో అమ్మ ఒక బొమ్మ నాన్న ఒక బొమ్మ పాటను ప్రకాశం జిల్లాకు సంబంధించిన ప్రముఖ కవి నాగభైరవ కోటేశ్వరరావు గారు వ్రాసారు . ఈ పాట బయట కూడా హిట్టయింది . గిరిబాబు , మాదల రంగారావు , కొమ్మినేని , నాగభైరవ , టి కృష్ణ , ధర్మవరపు ఇత్యాదులు అందరూ ప్రకాశం జిల్లా వారే . ప్రజా నాట్య మండలి నేపధ్యం వారే .

.
మిగిలిన పాటలు ఓరయ్యో కోనలోకి వస్తావా కొత్త చోటు చూపిస్తాను , ఓ చెలీ నీకోసమే నా గానము నవ వసంత సుందరి , నాగులచవితికి నాగేంద్రస్వామి కూడా థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి . జయమాలిని డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు . సినిమాకు ఆమె డాన్సులు కూడా గొప్ప ఆకర్షణే .

సినిమా యూట్యూబులో ఉంది . ఎడ్వెంచర్ సినిమాలను , భక్తి సినిమాలను ఇష్టపడేవారికి బ్లాక్ & వైట్ సినిమా అయినా నచ్చుతుంది . జయమాలిని ఉండనే ఉంది . నాగిన్ సినిమా కూడా యూట్యూబులో ఉంది . ఆ సినిమా పెద్ద బడ్జెట్ తోనే తీసారు . అది ఇంకా బాగుంటుంది . ఆసక్తి కలవారు చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు    (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions