హేమిటీ… నేతాజీ సుభాష్ చంద్రబోస్ కథా..?
అబ్బే, ఆయన ఉన్నప్పటి కథ, ఆయనకు కాస్త లింకున్న కథ… ఆయన బయోపిక్కు కాదు…
అంటే ఆ పాతకాలం సినిమాయా..? ఇంట్రస్టింగు…
Ads
అవును, అప్పుడెప్పుడో 1945 బాపతు కథ…
ఓహ్, అయితే కథేమిటో…
ఓ జమీందారు బిడ్డ, ఆమె హత్య… అది చేధించడానికి డెవిల్ అనబడే ఓ ఏజెంట్‌ను నియమిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం… సదరు హతురాలి బంధువు తగుల్తుంది… తరువాత మరో ఆపరేషన్‌లోకి పయనం… అక్కడక్కడా కొన్ని ట్విస్టులు…
గుడ్, అయితే మనల్ని ఆ పాతకాలంలోకి తీసుకెళ్తారన్నమాట…
అంత సీన్ లేదు, అసలు ఫస్టాఫ్ మొత్తం ఫ్లాట్ ప్రజెంటేషన్… పాటలు మహా బోర్, కథనం బోర్…
అదేమిటి..? సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ తోపు తురుం అంటారు కదా… అర్జున్‌రెడ్డి, యానిమల్, కబీర్ సింగ్ ఎట్సెట్రా తనవే కదా…
ఆ గొప్పలే మిగిలాయి… పాటలు మనకు పట్టవు… బీజీఎం కూడా సో సో… బహుశా ఎవరో అసిస్టెంట్లకు అప్పగించి ఉంటాడు…
ఇంతకీ దర్శకుడు పాసా, ఫెయిలా..?
ఇది నా సినిమాయే అని నవీన్ మేడరం అనే దర్శకుడు కొద్దిరోజులుగా గొడవ చేస్తున్నాడు… తన క్రియేటివిటీని కాజేశారంటాడు… పేరేమో అభిషేక్ నామా అని పడుతుంది…
అయితే ఫస్టాఫ్ వెళ్లడం లేటయినా పర్లేదన్నమాట… సెకండాఫ్ బాగుందా.,?
బాగా అంటే… ఎవరి పాత్ర ఇంపాక్ట్ కనిపించదు, మరీ క్లైమాక్స్ అయితే అచ్చమైన తెలుగు సినిమా… మన స్టార్ హీరోలు అనగానే ఊచకోతలు, నరుకుడు సామ్రాట్టులే కదా… ఇదీ అంతే… క్లైమాక్స్ చూడకపోయినా పర్లేదు…
ఫస్టాఫ్ బాగాలేక, లాస్టులో బాగాలేక… మరి సినిమాకు ఎందుకు వెళ్లడం..?
వెళ్లమని ఎవరన్నారు..? కల్యాణరామ్ నటన సగటు తెలుగు స్టార్ హీరో బాపతు… తప్పు పట్టేది లేదు, మెచ్చి మేకతోలు కప్పేదీ లేదు… సంయుక్త అని ఓ హీరోయిన్… పాత్రకు ప్రాధాన్యం ఉంది, ఫాఫం, అంత బలమైన ముద్ర వేయలేకపోయింది… కేరక్టరైజేషన్, ప్రజెంటేషన్ లోపం… మాళవిక అని మరొకామె కూడా ఉంది… ఉందంటే ఉంది…
పోనీ, యాక్షన్ సీన్లు బాగున్నాయా..? చూడొచ్చా… కథ కూడా డిఫరెంట్ అంటున్నావు కదా…
అక్కడక్కడా యాక్షన్ పర్లేదు… కథ కూడా కాస్త డిఫరెంటే… కానీ దర్శకుడే చెడగొట్టినట్టు అనిపించింది… ఇద్దరు వేళ్లు పెట్టి మొత్తం సినిమా ‘ఎంగిలి మంగలం అయిపోయినట్టుంది…
ఇంతకీ ఏమంటావు..?
అనడానికి ఏమీ లేదు, పెద్దగా చెప్పటానికీ ఏమీ లేదు… ఏదో ఓ తెలుగు సినిమా… అంతే…
పోనీ, లవ్ ట్రాకులు, కామెడీ, థ్రిల్లింగ్ ట్విస్టులు గట్రా బాగున్నాయా..?
అబ్బా, కల్యాణరాముడు ఈ లవ్ ట్రాకుల్లో వీక్ కదా, దర్శకుడు కూడా పెద్దగా తనను ఇబ్బంది పెట్టలేదు… బ్రిటిష్ సైన్యాన్ని ఒంటి చేత్తో నరుకుడు ఏమిటో, ఆ ముగింపు ఏమిటో ఆ దర్శకుడికే తెలియాలి… ఆ దర్శకుడే నిర్మాత కూడా… మొదట తీసుకున్న దర్శకుడితో ఏవో టరమ్స్ దెబ్బతిన్నట్టున్నయ్… ఓసోస్, ఈమాత్రం సినిమా నేను తీయలేనా అనుకుని నిర్మాతే మెగాఫోన్ పట్టుకుని, రీళ్లు చుట్టేసినట్టున్నాడు…
సర్లే… అర్థమైంది… అన్నట్టు సలార్, యానిమల్ సంగతులేమిటి..?
గుడ్, ఇప్పుడు సరైన తొవ్వకు వచ్చావ్… సలార్ కలెక్షన్ల మాటేమిటంటే……
Share this Article