Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో చిత్రమైన కథలు చెప్పినా ప్రేక్షకులు బాగానే చూసేవాళ్లు…

July 30, 2024 by M S R

శోభన్ బాబు – శారద జోడీలో 1975 లో వచ్చిన మరో చక్కటి ఎమోషనల్ సినిమా ఈ దేవుడు చేసిన పెళ్ళి . సినిమాకు శారద ద్విపాత్రాభినయమే కీలకం . ఏక్సిడెంట్ల ద్వారా కధలో మలుపులను సృష్టించిన రచయిత గొల్లపూడి మారుతీరావుని అభినందించాలి .

అలాగే పదునైన మాటలను వ్రాసిన సత్యానంద్ ని , శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన టి చలపతిరావుని అభినందించాలి . బిర్రయిన స్క్రీన్ ప్లేను తయారు చేసుకుని , సినిమాను గోదావరి జిల్లాల గ్రామీణ నేపధ్యంలో తీసి , సహజత్వాన్ని చొప్పించిన దర్శకుడు తాతినేని రామారావుని అభినందించాలి .

సాయికుమార్ బాలనటుడిగా అరంగేట్రం చేసిన మొదటి సినిమా కూడా ఇది . బాపు తీసిన స్నేహం రెండో సినిమా సాయికుమార్ కి . ఈ సినిమాలో గుడ్డి పిల్లాడుగా బాగా నటించాడు .

Ads

హీరో శోభన్ బాబు పోస్ట్ మేన్ . ఊళ్ళో అందరికీ తల్లో నాలికలా ఉంటాడు . శారద ఆ ఊరి స్కూలుకి టీచరమ్మగా వస్తుంది . టీచరమ్మ అక్క మూగది . హీరో టీచరమ్మ ప్రేమించుకుంటారు . టీచరమ్మ మూగ అక్కని పెళ్ళి పీటల మీద కూర్చొబెట్టి పెళ్లి చేసేస్తుంది . పెళ్లి అయ్యాక ప్రయాణం చేస్తున్న గుర్రపు బండి బోల్తా కొడుతుంది . ఏక్సిడెంట్లో మాట పడిపోయిందని అబధ్ధం చెపుతారు హీరోకి .

మూగ హీరోయిన్ తో కాపురం చేసి , ఒక కొడుకుని కూడా కంటారు . మరోసారి ఏక్సిడెంట్లో మూగ శారద చనిపోతుంది . ఆమె స్థానంలోకి టీచరమ్మ వచ్చేస్తుంది . ఇదంతా ఫ్లాష్ బేక్ లో చూపిస్తారు దర్శకుడు .

శోభన్ బాబు పాత్ర బాగుంటుంది . చాలా బాగా నటించారు కూడా . శారద గురించి చెప్పేది ఏముంది ? జీవించింది . ఇతర పాత్రల్లో చంద్రమోహన్ , లక్ష్మి , నాగభూషణం , ప్రభాకరరెడ్డి , రావు గోపాలరావు , కాకరాల , మాస్టర్ సాయికుమార్ , గిరిబాబు ప్రభృతులు నటించారు . సి యస్ రావు ఓ అతిధి పాత్రలో తళుక్కుమంటారు .

టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . జ్యోతిలక్ష్మి డాన్సులో సూదిలో దారం సందులో బేరం పాట సూపర్ హిట్టయింది . అలాగే టీచరమ్మ శారద పాడే పాట ఓ చిట్టి పొట్టి పాపల్లారా పాట , మిగిలిన పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి .

దసరా సమయంలో స్కూల్ పిల్లల్ని తీసుకుని టీచరమ్మ బయలుదేరుతుంది . మా తరం వాళ్ళకు మా చిన్నప్పటి దసరా రోజులు , ఇంటింటికీ తిరగటం , పప్పుబెల్లాలు , పిల్లలు పాడే అయ్య వారికి చాలు అయిదు వరహాలు పాట గుర్తుకొస్తాయి .

వెరశి మంచి సినిమా . మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది . మహిళలకు నచ్చితే ఆడించేస్తారు కదా ! టివిలో కూడా చూసా . యూట్యూబులో ఉంది . చూడనివారు వాచ్ లిస్టులో పెట్టేసుకోవచ్చు . A feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……… By దోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నోబెల్ విజేత – తండ్రి కోరిక కోసం, మూలాలు వెతుక్కుంటూ వచ్చింది !
  • అయ్యా నరేష్ గారూ… బాగా నటించగలరు, ఎటొచ్చీ యాసతోనే తిప్పలు !!
  • గడుసు వ్యాపారి మస్క్ – ‘రాకెట్ కారు’ లాంచింగ్ అదరగొట్టేశాడు !!
  • నీయక్క – రణబాలితోనూ నీ గ్రహచారం మారలేదోయ్ విజయ్…
  • నీట్, వోట్… అన్నీ సాకులు ! ప్రభుత్వం కూల్చడమే అసలు టార్గెట్ !!
  • ప్రేమ్ వత్స ! హైదరాబాద్ రూట్స్ – ఐడీబీఐ కొనే ఫెయిర్‌ఫాక్స్ తనదే !!
  • కేసీయార్ పొలాలకు కాళేశ్వరం నీళ్లు- ప్రత్యేకంగా చెరువు, కాలువ !!
  • … వారిని సరిదిద్దలేకపోయిన గత పొరపాటుకు మేం క్షంతవ్యులం !!
  • అంతా కాలమహిమ- చంద్రబాబా మహత్తు- ఆ లీలలెన్న తరమా !?
  • ‘యాదాద్రి’పై రేవంత్ రెడ్డి కొరడా ! కేసీయార్ నిర్వాకాలే అసలు తలనొప్పి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions