Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వావ్ గుడ్ ఫోటో… ధనుష్, వరలక్ష్మి ఫోటోలతో రాధిక ఏదో చెబుతోంది…

December 16, 2023 by M S R

ఒక ఫోటో రకరకాల గాసిప్స్‌కు దారి తీసింది… ఏమో, గాసిప్స్ కూడా కాకపోవచ్చు… ఆ ఫోటో రాబోయే పరిణామాలకు సూచిక కూడా కావచ్చు… విషయం ఏమిటంటే..? నటి రాధిక శరత్ కుమార్ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది… అందులో రాధిక, శరత్ కుమార్, ధనుష్, శరత్ కుమార్ బిడ్డ వరలక్ష్మి, మరో మహిళ కనిపిస్తున్నారు…

అసలే సవతి బిడ్డ వరలక్ష్మికీ, రాధికకు పెద్దగా టరమ్స్ బాగా లేవంటుంటారు… వరలక్ష్మి ఇండిపెండెంట్ లివింగ్… తను సినిమాలు, తన సర్కిల్, తన ప్రపంచం… అంతే… అలాంటిది రాధిక ఈ ఫోటో షేర్ చేయడం వెనుక ఓ కథ ఉందని తమిళనాటు గుసగుస… అఫ్‌కోర్స్, ఆ నటులందరూ తెలుగువాళ్లకు చిరపరిచితులే…

విషయం ఏమిటంటే..? వరలక్ష్మికి 38 ఏళ్లు… పెళ్లి కాలేదు, కాదు, చేసుకోలేదు… ఒంటరి జీవితం… ధనుష్ కు కూడా దాదాపు అదే ఏజ్, ఏడాది అటూఇటూ… తనకు పెళ్లయ్యింది… ది గ్రేట్ రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్యతో… 2004లో పెళ్లయితే 18 ఏళ్ల తరువాత, అంటే గత ఏడాది విడాకులు కూడా అయ్యాయి… తనదీ ఇప్పుడు ఒంటరి జీవితం… సో, ఈ రెండు ఒంటరి జీవితాలూ ఒక్కటవుతాయని చెప్పడానికి ఈ ఫోటో సూచికా..?

Ads

వరలక్ష్మి

నిజానికి ధనుష్‌కు ఐశ్యర్యతో పెళ్లయినా పలువురు తారలతో ఎఫయిర్స్, డేటింగ్స్ గట్రా బోలెడు వార్తలొచ్చేవి… శృతిహాసన్, త్రిష కృష్ణన్, అమలాపాల్ తదితరులతో సంబంధాలపై బాగా వార్తలొచ్చేవి… అందులో అమలాపాల్ పెళ్లి పీటలెక్కుతోంది… ఆమెకూ గతంలో ఓ పెళ్లి, విడాకుల గతం కూడా ఉంది… శృతి, త్రిష ఒంటరి పక్షులే… శృతి గతం కూడా కొన్ని చేదు అనుభవాలతో ఉన్నట్టుంది… త్రిషకు ఓ ఎంగేజ్‌మెంట్ కేన్సిల్ అయినట్టుంది… సో, ఎవరి కథా సజావుగా ఏమీ లేదు…

మరోవైపు వరలక్ష్మి మీద కూడా బోలెడు కథలున్నయ్… ప్రత్యేకించి విశాల్‌తో ఎఫయిర్స్ తరచూ వార్తల్లోకి వచ్చేది… తను కూడా పెళ్లి చేసుకున్నాడు… ఏమైందో ఏమో గానీ ఇక వరలక్ష్మి పెళ్లి వైపే చూడలేదు, ఆలోచించలేదు… అసలు తను పెళ్లి అనే బంధానికే వ్యతిరేకం అన్నట్టుగా మాట్లాడుకొచ్చేది ఇంటర్వ్యూలలో… ఫాఫం, ఆ బ్రేకప్ బలమైన ఇంపాక్ట్ కావచ్చు… ధనుష్, వరలక్ష్మి బంధం మీద గతంలో పెద్ద గాసిప్స్ వినిపించలేదు… (రాధిక, శరత్‌కుమార్ గత పెళ్లిళ్ల అనుభవాలూ కథలే…)

ఒకవేళ నిజంగానే ఆ ఇద్దరూ ఒక్కటైతే తమిళ ఇండస్ట్రీకి మంచి వార్తే… ధనుష్, వరలక్ష్మి గతంలో పలు సినిమాలు కలిసి చేశారు… ఒకరంటే ఒకరికి అవగాహన ఉంది… అన్నట్టు… మొదట్లో వరలక్ష్మి కాస్త మందంగా కనిపించేది… హీరోయిన్ అవకాశాలే కాదు, ఏ మంచి పాత్ర వచ్చినా సరే అంగీకరించేది… ఫలానా పాత్రే కావాలనేమీ లేదు… ఈమధ్య సన్నబడి, ఇంకాస్త లావణ్యాన్ని సొంతం చేసుకుంది… ధనుష్ పర్సనాలిటీకి తగినట్టుగా… గుడ్…!!

రయానె

(శరత్ కుమార్ పక్కన ఉన్నది మొదటి భార్య, వరలక్ష్మి తల్లిట… చెక్ చేసుకోవాలి. అందుకే ఈ ఫొటోకి ప్రాధాన్యం… ఇదొక వివరణ… నో, నో, శరత్ కుమార్ పక్కన ఉన్నది రాధిక మొదటి భర్త ఒక (ఫారినర్ )కూతురు రయానె… రాధిక శరత్ కలిసి ఆమె పెళ్లి చేశారు… ఇది మరొక వివరణ… ఇంట్రస్టింగ్… )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘అబ్బో, ఆమె చాలా కాస్ట్‌లీ అట, ఎక్కువ డిమాండ్ చేస్తుందంటున్నారు…’’
  • ఫిక్సేనా..? ‘ఈసాల కప్ నమ్‌దే’ నిజమేనా..? ఈ జోస్యం ఫలిస్తుందా..?
  • ఈమె సోనియాని మించిన హక్కుదారు..!? అడుగడుగునా ఓవరాక్షన్..!!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • మొక్కు కోడెల ఉసురు… కలుక్కుమనిపించే మరణాల వార్తలు…
  • ‘మిస్ బిహేవ్’ అంటే… మిస్ వరల్డ్ వివాదం రేవంత్ మెడకు చుట్టడమా..?!
  • నాటి జతొజడ జమజచ్చ జంట… ప్లెయిన్, ఫెయిర్ మూవీ…
  • మూడు ‘నందుల’ ముచ్చటైన ‘ఉషాకిరణం’… కాంచనగంగ…
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • ఉహుహుహు… మనవాళ్లు వణికే చలిలోనూ వేడి పుట్టించగలరు సుమీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions