.
తిరుమల లడ్డూ తయారీలో కొవ్వు నూనెల కల్తీ నెయ్యి వివాదమే కాదు… తిరుమలలో ఓ అరాచకాన్ని కొనసాగించినట్టు తీవ్ర ఆరోపణలున్నా టీటీడీ పాత ఈవో ధర్మారెడ్డి మాయమైపోయాడు కదా… తిరుమల గత పరిపాలనకు సంబంధించి తనపై అనేక విమర్శలు… చివరకు జగన్ సొంత పార్టీ నేతల నుంచి కూడా…
దేశమంతా తిరుమల అపచారాల మీద రచ్చ, చర్చ సాగుతుండగా… ప్రధాన సూత్రధారిగా మరకపడిన ధర్మారెడ్డి మాత్రం అయిపూజాడా లేడు ఇన్నాళ్లు… నిజానికి తను ఐఏఎస్ అధికారి కాదు… ఐడీఈఎస్… ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్… అనగా కంటోన్మెంట్లు, ఇతర ఆర్మీ సంబంధ సివిల్ వ్యవహారాల పర్యవేక్షణ… ఢిల్లీ హెడ్ క్వార్టర్…
Ads
నిజానికి టీటీడీ ఈవో పోస్టు అప్పటి ఉమ్మడి ఏపీ లేదంటే ప్రస్తుత విభజిత ఏపీ ఐఏఎస్ కేడర్ అధికారుల ప్రివిలేజ్… ఫలానా సర్వీసు వాళ్లనే ఈవోలుగా నియమించాలని ఏమీ లేదు… కానీ జగన్ కావాలని ఏరి కోరి… మరి ఎక్కడ ధర్మారెడ్డి ఎలా అంత బలంగా కనెక్టయ్యాడో తెలియదు గానీ, సీనియర్ ఐఏఎస్ అధికార్లనూ కాదని ధర్మారెడ్డిని తెచ్చిపెట్టాడు…
అటు భూమన, ఇటు వైవీ సుబ్బారెడ్డి, తోడుగా ధర్మారెడ్డి… తిరుమల పాలన వ్యవహారాలపై బోలెడన్ని విమర్శలు… సరే, లడ్డూ కల్తీ నెయ్యి వివాదం తలెత్తాక అసలు ధర్మారెడ్డి కనిపించకుండా పోెయాడు… తిరిగి తన సర్వీసుకు వెళ్లిపోయాడా..? (ఏపీ సర్వీసులో ఇంకొంతకాలం కొనసాగింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చినట్టు గుర్తు..) ఎక్కడున్నాడు..? బయటికి వచ్చి ఒక్క మాటా ఎందుకు మాట్లాడటం లేదనే వార్తలూ బోలెడు…
సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్లగా, భూమన ఏదో పుష్కరిణి స్నానం, ప్రమాణం అని ఓ సెంటిమెంట్ ప్రయోగించబోయాడు… కానీ ధర్మారెడ్డి జాడాపత్తా లేడు… ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు… అదీ హైదరాబాదులోనే… హైదరాబాద్, వరంగల్ రహదారి పక్కన మానేపల్లి జువెలర్స్ వాళ్లు కట్టిన పే-ద్ద వెంకటేశ్వరుడి గుడి (స్వర్ణగిరి- వాళ్ల నగల వ్యాపారానికి నప్పేలా పెట్టబడిన పేరు) ఉంది కదా… అదుగో, అక్కడ తేలాడు…
ఇదుగో ఈ లింక్ చదవండి… ఇందులోనే ధర్మారెడ్డి సత్కార వివరాలున్నాయి… https://neelagirishankaravam.blogspot.com/2024/10/ttd-ex-eo.html
దేవాలయ నిర్మాణ కర్తలు, ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి జువెలర్స్ అధినేత మానేపల్లి రామారావు దంపతులతో పాటు వారి కుమారుడు మానేపల్లి మురళీకృష్ణ ధర్మారెడ్డిని సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు… మాజీ పోలీసు హౌసింగ్ చైర్మెన కోలేటి దామోదర్ కూడా ఉన్నాడు వాళ్లతో…
సరే, వాళ్ల గుడి వాళ్లిష్టం… ఎవరిని సన్మానిస్తారో వాళ్ల అభిమతం… కానీ ఏ తిరుమల వెంకన్నకు ద్రోహం చేసినట్టుగా… కోట్లాది మంది శ్రీవారి భక్తులకు అపచారం చేసినట్టుగా జనంలో బాగా చర్చ జరుగుతున్నదో… ఆ చర్చ జరుగుతున్నప్పుడే ఆయన్ని పిలిచి సన్మానం చేయడం జనానికి ఏం సంకేతం ఇస్తున్నట్టు..? ఇదీ ఇప్పుడు మానేపల్లి వారిపై విమర్శ…
నిజానికి ధర్మారెడ్డిని ధర్మకాంక్షాపరులు ప్రస్తుతం దూరంగా ఉంచాలి… తనకు ప్రాయశ్చిత్తం కలగాలి… అది కదా సమాజం కోరుకునేది… కనీసం జనానికి వివరణ ఇచ్చే సాహసం, కర్తవ్యం కూడా లేదు ధర్మారెడ్డికి… నిజానికి ఈ గుడి నిర్మాతలకు ఆ ధర్మారెడ్డితో కనెక్షన్ ఎలా, ఎందుకు కుదిరిందో తెలియదు… ఈ ప్రేమలు, ఈ సత్కారాలు ఏమిటో స్వర్ణగిరి భక్తులకూ బోధపడటం లేదు…
పోనీ, తనేమైనా పీఠాధిపతా..? స్వామీజీయా..? ధర్మప్రచారకుడా..? ఏదీ కాదు… సవాలక్ష మంది కేంద్ర సర్వీసు సిబ్బందిలో ఒకడు, అంతే కదా… స్వర్ణగిరి టెంపుల్ నిర్మాణానికి ఏరకంగానైనా సాయపడ్డాడా..? తెలియదు… నిజానికి ఈ స్వర్ణగిరి నిర్వహణే అడ్డదిడ్డం… పైగా దీనికి అటు యాదాద్రి, ఇటు తిరుమల పేరు కలిసేలా వైటీడీ అని పేరు పెట్టుకోవడం మరో వైచిత్రి… అన్నింటికీ మించి ధర్మారెడ్డికి పెద్ద పెద్ద దండలు వేసి, అదే శ్రీవారి సమక్షంలో సన్మానసత్కారాలు చేయడం మరో వైచిత్రి..!!
Share this Article