Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కుట్రతో సంబంధం లేకపోతే… కుట్రదారులను కలిసే పనేముంది..?!

June 14, 2026 by M S R

.

ఎవరో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు… ఎవరో అర్బన్ నక్సల్స్, సూడో సెక్యులర్స్ అనడం లేదు గానీ… అబ్బే, ధర్మస్థల గుడి మీద జరిగిన కుట్రతో ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు… ఖండిస్తున్నారు… కానీ..?

బండ్ల గణేష్ మాటల్లో చెప్పాలంటే, ప్రకాష్ రాజ్ ప్రతి దాంట్లో వేలు పెట్టి మురక (వాసన) చూసేరకం… ప్రపంచంలో ఎక్కడ పూచిక పుల్ల కదిలినా సరే, మోడీ కారణం, ఆర్ఎస్ఎస్ కారణం అంటూ, just asking అంటూ ఏదో పెంట వ్యాఖ్య ట్వీటుతుంటాడు…

Ads

తను బేసిక్‌గా కర్నాటక… అక్కడ ఇలాంటి సూడో సెక్యులర్స్ హిందూ మతంపై, మఠాలపై విద్వేషం కక్కడం కొత్తేమీ కాదు… దీనికి తగినట్టు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిత్వం పరోక్ష బాసట… ప్రకాష్ రాజ్ పేరుకు సెక్యులర్, కాదు, కాదు, నాస్తికుడు… నాస్తికత్వం అంటే కేవలం హిందూ మతాన్ని మాత్రమే వ్యతిరేకించి, ద్వేషించాలనే ఓ రకం అజ్ఞాని… హిందూ మతం అంటే బీజేపీకి పేటెంట్ కాదురా నాయనా అని చెప్పినా తనకు ఎక్కదు… ఈ దేశంలో చాలామందికిలాగే…

సరే, ధర్మస్థల కుట్రతో తనకేం సంబంధం అంటారా..? అది తనే చెప్పాలి… తనకు సంబంధం లేదంటేనే ఆశ్చర్యపడాలి… ఓసారి ఈ క్లిప్పింగు చదవండి…


ప్రకాష్ రాజ్

దాదాపు 200 కోట్ల ఖర్చుతో తమిళనాడు, కేరళ, కర్నాటకలోని ఏదో పెద్ద గ్యాంగు ఈ కుట్రకు తెరలేపింది… ఎవడో చిన్నయ్య అనేవాడితో కుట్ర స్టార్ట్… కొందరు యూట్యూబర్లు రచ్చ చేశారు… తీరా చూస్తే ధర్మస్థల మీద ఏ విమర్శ కూడా నిరూపణ కాలేదు, కుట్ర అనేదీ బయటపడింది… అదీ అధికారికంగా సిట్ విచారణలో…

  • ఆ చిన్నయ్య అనేవాడు కోర్టులో ఓ రిట్ పిటిషన్ వేశాడు, విచారణ జరుగుతోంది… అందులో ‘నేను మళ్లీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను’ అని ప్రకాష్ రాజ్ కుట్రదారులతో అన్నట్టుగా ఆ పిటిషన్‌లో ఉందని ఈ వార్త చెబుతోంది… ఇది కలకలం రేపుతోంది…

నో, నో, నాకు ఏమీ సంబంధం అనలేదు ప్రకాష్ రాజ్, ఖండించలేదు… పైగా నేను దూరంగా ఉన్నాను, కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో సంబంధమున్న విషయం కదా, రెండుమూడు రోజుల్లో స్పందిస్తాను అంటున్నాడు… ఏదో తేడా కొడుతోంది…

ఏ సంబంధమూ లేకపోతే ‘ఈ ప్రచారం తన దృష్టికి వచ్చింది, నాకు సంబంధం లేదు, అబద్దాలు’ అని సింపుల్‌గా ఖండించేవాడు… ఇప్పుడు రెండుమూడు రోజులు ఆలోచించుకుని, ఎవరైనా సెక్యులర్ లాయర్ల సలహాలు తీసుకుని, అప్పుడు స్పందించి, ఏదో కథ చెప్పబోతున్నాడన్నమాట… మీడియా చెవుల్లో, జనం చెవుల్లో పెద్ద పూలు పెడతాడన్నమాట..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బాలమురళి పాడేది అసలు సంగీతమే కాదు- హైకోర్టులో ఓ కేసు …
  • ఎగిసిన రంగుల కెరటాలు కొన్ని విరిగిపడటం… స్వయంకృతాలే..!
  • 5 కోట్ల బంగారు రామచరితమానస్ – అయోధ్య గుడిలో మాయం !
  • కన్నెపల్లి పంపులపై కేటీయార్ వితండవాదం – ఇవిగో అసలు నిజాలు…
  • మూడు రాచకుటుంబాల వారసత్వం – ఒక్క వీడియోతో కెరీర్ కకావికలం
  • FIFA 2026 – అనూహ్య ఫలితాలు – అంచనాల్లో తేడాలే అసలు మజా!!
  • I will find you – గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ –
  • OTT కంటెంటుపైనా ‘కత్తెర’ – జీ5 నుంచి ఓ సినిమా మొత్తం లేపేశారు!!
  • ఆరుగురూ ఆరుగురే! అసలు జాతీయ ఉత్తమ అవార్డు విజేత ఎవరో!!
  • రావణ్‌పై రాజద్రోహం సెక్షన్? ప్రకాశ్‌రాజ్‌నూ బుక్ చేస్తారా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions