.
ధర్మేంద్ర మరణం తరువాత మీడియాలో అనేక కథనాలు వచ్చాయి… ప్రత్యేక కథనాలు… ఆయన కెరీర్, కుటుంబం, హేమమాలినితో పెళ్లి, ఆస్తులు ఎట్సెట్రా… అనేకానేక ఆ వార్తల నడుమ ఒక చిన్న వార్త దగ్గర చూపు నిలిచిపోయింది…
ధర్మేంద్రకు బ్రిటిష్ రాజకుటుంబంతో చుట్టరికం ఉందీ అని ఆ వార్త సారాంశం… పెద్దగా వివరాలేమీ లేవు… అరె, ఈ విషయం ఎప్పుడూ ఏ వార్తల్లోనూ చదివినట్టు గుర్తులేదు, నిజమేనా అని ఆరా తీస్తే కొన్ని అదనపు వివరాలు కనిపించాయి…
Ads
బీరకాయపీచు చుట్టరికం అంటుంటాం కదా, అదన్నమాట… అంటే పరోక్ష బంధుత్వమే తప్ప ప్రత్యక్ష బంధుత్వం ఏమీ లేదు… పోనీ, ఆ పరోక్ష చుట్టరికం ముచ్చటేమిటి అంటారా..? ఇదుగో…

ధర్మేంద్ర పెద్ద కుమారుడు సన్నీ డియోల్… తన భార్య, అంటే ధర్మేంద్ర కోడలి పేరు పూజా డియోల్ (Lynda Deol)… అదుగో ఆమె ద్వారా ఈ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీతో రిలేషన్… అదెలా..?
-
పూజా డియోల్ తల్లిదండ్రులు…: పూజా డియోల్ లండన్‌లో జన్మించింది… ఆమె తండ్రి క్రిషన్ దేవ్ మహల్ బ్రిటన్‌లో స్థిరపడిన భారతీయుడు, ఆమె తల్లి జూన్ సారా మహల్ (June Sarah Mahal) బ్రిటిష్ మహిళ…
-
రాయల్ వంశపు మూలాలు..: కొన్ని నివేదికల ప్రకారం, పూజా డియోల్ తల్లి జూన్ సారా మహల్‌కు బ్రిటిష్ రాయల్ వంశంతో సంబంధాలు (Royal Lineage) ఉన్నాయని చెబుతారు…
అంటే ధర్మేంద్ర కోడలి తల్లికి, అనగా వియ్యపురాలికీ రాయల్ ఫ్యామిలీకి సంబంధాలున్నాయి… కాబట్టి బ్రిటిష్ రాజవంశంతో ధర్మేంద్రకు చుట్టురికం ఉన్నట్టే కదా… ఈ పూజా డియోల్ ఏం చేస్తూ ఉంటుంది..?
పూజా డియోల్ వృత్తిపరంగా రచయిత్రి (Writer)…. ఆమె ఎక్కువగా లైమ్‌లైట్‌కు దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంది… అందుకే ఎప్పుడూపెద్దగా మీడియాలో కనిపించదు… ఆమెకు కూడా బాలీవుడ్‌తో బాలీవుడ్‌తో సంబంధం ఉంది…
- రచయిత్రి…: 2013లో విడుదలైన ‘యమ్లా పగ్లా దీవానా 2’ (Yamla Pagla Deewana 2) సినిమాకు కథను (story) అందించింది…
-
నటన (అన్ క్రెడిటెడ్)…: 1996లో వచ్చిన సన్నీ డియోల్ చిత్రం ‘హిమ్మత్’ (Himmat) లో కూడా ఆమె చిన్న పాత్రలో (uncredited appearance) కనిపించింది…
పూజా డియోల్ తల్లి జూన్ సారా మహల్ (June Sarah Mahal)కు బ్రిటిష్ రాయల్ వంశంతో సంబంధాలు (Royal Lineage) అనేవి రాజకుటుంబం బాపతు విస్తృతమైన లేదా పరోక్షమైన (extended or indirect) వంశ పరంపర మాత్రమే…
అందుకే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీతో ధర్మేంద్ర కుటుంబానికి క్రియాశీలకంగా (actively) సమావేశాలు లేదా బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లుగా ఎటువంటి సమాచారం లేదు… ఇంతకీ ఆ జూన్ సారా మహల్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది..?
ఆమె Tudor Holdings Limited, Sunny SuperSounds Limited వంటి సంస్థలలో సెక్రటరీగా పనిచేసింది… లండన్‌లోనే ఉంటుంది… ఆమె కూతురు పూజా డియోల్ (Pooja Deol) లండన్‌లో జన్మించింది… వివాహం తర్వాత కూడా ఆమె కొంతకాలం లండన్‌లో నివసించింది… తరువాత ఇండియా వచ్చేసింది…
ఇంతకీ పూజా డియోల్ పిల్లలు ఏం చేస్తుంటారు..?
కరణ్ డియోల్ (Karan Deol)…: ఈయన నటుడిగా ‘పాల్ పాల్ దిల్ కే పాస్’ (Pal Pal Dil Ke Paas) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు…
రాజ్‌వీర్ డియోల్ (Rajveer Deol)…: ఈయన కూడా నటుడిగా ‘దోనో’ (Dono) సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు… ధర్మేంద్ర పిల్లలందరూ బాలీవుడ్‌తో టచ్ ఉన్నవాళ్లే..!!
Share this Article