.
ధోనీ ఒకప్పుడు నంబర్ వన్ క్రికెటర్… తన క్రికెట్ ఆటను అద్భుతంగా కార్పొరేటీకరించుకుని వందలు వేల కోట్లను ఎవరికీ అందని రీతిలో గడించిన తెలివైన వ్యూహకర్త…
దీపిక పడుకోన్… అఫ్‌కోర్స్, ఈరోజుకూ నంబర్ వన్ బాలీవుడ్ స్టార్… తెలివైన పెట్టుబడిదారు ఈమె కూడా… ఐతే ఈ ఇద్దరూ ఓ స్కాములో ఇరుక్కుని ఏకంగా 420 కోట్లను కోల్పోయారనే వార్త సంచనలం సృష్టిస్తోంది…
Ads
ఎంత తెలివైన వారైనా, ఎంత అదృష్టవంతులైనా… తమ రంగాల్లో ఎంత లబ్దప్రసిద్దులైనా… ఎక్కడో ఓ చిన్న స్టెప్… నిలువునా ముంచేస్తుంది… అదే డెస్టినీ… ఇదీ అదే… అసలు ఏమిటి ఆ స్కామ్..? దాని పేరు బ్లూస్మార్ట్…
వివరాల్లోకి వెళ్తే… బ్లూస్మార్ట్ (BluSmart) అనేది 2018లో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన ఒక ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీస్ స్టార్టప్.., ఇది ఉబర్, ఓలా వంటి సంస్థలకు పోటీగా ఏర్పడింది… ఈ కంపెనీ జెన్సోల్ ఇంజనీరింగ్ (Gensol Engineering) అనే సంస్థతో సంబంధం కలిగి ఉంది… ఇటీవల, బ్లూస్మార్ట్, జెన్సోల్ ఇంజనీరింగ్‌లపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తీవ్రమైన ఆరోపణలు చేసింది, దీనినే “బ్లూస్మార్ట్ స్కామ్”గా పిలుస్తున్నారు…
జెన్సోల్ ఇంజనీరింగ్, బ్లూస్మార్ట్ కోసం… 6,400 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం IREDA, PFC ల నుండి రూ.977.75 కోట్ల రుణం తీసుకుంది… అయితే, ఈ రుణంలో రూ.663.89 కోట్లు వాహనాల కొనుగోలు కోసం ఉపయోగించాల్సి ఉండగా, ఈ నిధులను జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ గురుగ్రామ్‌లోని DLF ది కామెలియాస్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు వంటి వ్యక్తిగత ఖర్చులకు మళ్లించినట్లు సెబీ ఆరోపించింది…
సెబీ ఈ నిధుల మళ్లింపు ఆరోపణలపై దర్యాప్తు చేసి, జగ్గీ సోదరులను కంపెనీ డైరెక్టర్ పదవుల నుండి తొలగించింది, వారిని షేర్ మార్కెట్‌లో పాల్గొనకుండా నిషేధించింది… ఈ విషయం బయటకు రావడంతో, జెన్సోల్ ఇంజనీరింగ్ షేర్లు రెండు రోజుల్లోనే భారీగా పతనమై, లోయర్ సర్క్యూట్‌ను తాకాయి, దీంతో పెట్టుబడిదారులు తీవ్ర నష్టాలను చవిచూశారు…
1120 గరిష్ట ధర నుంచి ఈ స్టాక్ ధర 122కు పడిపోయింది… ఇక లేచే సిట్యుయేసన్ లేదు… ఈ స్టార్టప్‌ను గుడ్డిగా నమ్మారు చాలామంది స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు… అందరూ 90 శాతం వరకూ మునిగినట్టే… అవును, స్టాక్ మార్కెట్ అంటేనే జూదం… చేయి తిరిగిన జూదగాళ్లు కూడా బోల్తాకొడుతుంటారు… అదొక మాయ..!!
Share this Article