.
॥ ఓం ధూం ధూమావతి ఠః ఠః ॥ … ఈ బీజమంత్రం బీజీఎంలో మారుమోగిపోతూ ఉంటుంది… హీరో తురుముడు సాగుతూ ఉంటుంది.,. చూశారు కదా, ప్యారడైజ్ సినిమాలో… అసలు అదేమిటి..? కాస్త వివరాల్లోకి వెళ్దాం… సినిమా గురించి కాదు, ఆ కనిపించిన విశేషాన్ని వివరంగా చెప్పుకోవడం కోసం…
ప్యారడైజ్… డౌటేమీ లేదు, ఫ్లాప్… శ్రీకాంత్ ఓదెల పూర్తిగా దారితప్పి… మబ్బుల్లో విహరిస్తున్న నానిని నేల మీదకు దింపి పడేశాడు… కొన్ని ప్రశంసలు, బోలెడు విమర్శలు… మాస్ అంటే హింస అనే నాన్సెన్స్ భ్రమల్లో ఉన్న నానికి ఇది అవసరమే… ఇక ధూమావతి విషయానికి వద్దాం…
Ads
మనం ఈమధ్య దశమహావిద్యల గురించి వింటున్నాం, చదువుతున్నాం… ప్రత్యేకించి సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్టు వేణుస్వామి ప్రాచుర్యంలోకి తెచ్చాక కామాఖ్యలో పూజల కోసం నాయకగణమే కాదు, ధనికులు, ఇతర భక్తులు గౌహతికి భారీగా తరలుతున్నారు.., చాలామంది రీసెంటుగా దీన్ని భక్తిపర్యాటక యాత్రలుగా, ప్యాకేజీలుగా కూడా మార్చేశారు…
అక్కడే చెప్పుకోదగిన మరో అంశం, దశమహావిద్యలు… ఇవి శక్తిరూపాలు, అవీ ఉగ్రశక్తులు… వీటికి మామూలు దక్షిణాచారంలో పూజలు చేస్తారు గానీ అవి పెద్దగా ఫలించవు, వామాచారం లేదా కౌలాచారంలో మాత్రమే పూజిస్తేనే ఫలితం…
కొన్నాళ్లుగా రాజశ్యామల, చినమస్త, భగాళాముఖి దేవతల గురించి వింటున్నాం కదా… ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అదే దశమహావిద్యల్లో ఐదోరూపమే ధూమావతి… చేతిలో చాట, విధవ రూపం, ముసలి, విరబోసుకున్న జుట్టు, కాకి వాహనం… ఇదీ ఆమె రూపం…

వేణుస్వామి మాటల్లో ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం… ‘‘దశమహావిద్యల్లో… రాజశ్యామల, భగాళాముఖి, భువనేశ్వరి, భైరవి…. ఎవరైనా పూజలు చేయిస్తారు, దక్షిణాచారంలో… కానీ పెద్దగా ఫలితం ఉండదు, కానీ కాళి, చినమస్త, తార, ధూమావతి తదితర దేవతలకు ఆ పూజలు అస్సలు నప్పవు, ఫలించవు, ఖచ్చితంగా వామాచారం అంటే తాంత్రిక పూజలే శరణ్యం…
ఎక్కువగా స్మశానం బేస్డ్ పూజలు ఇవి, పూజ చేయించేవాడికి సరైన సాధన, ఆ విద్య తెలిసి ఉండాలి, ఎవరుపడితే వారు చేయలేరు, ప్రత్యేకించి పంచ ‘మ’ కరాలు తప్పనిసరి… అంటే ముద్ర, మైథునం, మద్యం, మాంసం (మటన్), మత్స్యం…
మత్స్యం, మద్యం, మాంసం అందరికీ తెలుసు… మైథునం అనేది ఓ సంభోగ ప్రక్రియ వంటి ప్రక్రియ, ఇదే కీలకం… ఇక ముద్ర అంటే చేతులతో వేసే ముద్రలు కావు… అవి మంచింగ్ తరహా… కుడి చేత్తో మద్యం సేవిస్తూ, మంత్రాలు పఠిస్తూ, ఎడమ చేత్తో చేప, చికెన్, ఎగ్, పూరి వంటివి తింటూ, వాటినే హోమంలో పడేస్తుంటారు… ఆ పూజా విధానమే అది…
వారణాసి ట్రెయిలర్లలో చినమస్తను చూపించారు, మంచు మనోజ్ ఏదో సినిమాలో భగాళాముఖిని చూపించారు… రీసెంట్గా ఈ దశమహావిద్యల్ని తెలుగు దర్శకులు తమ సినిమాల్లోకి తీసుకొస్తున్నారు… అదుగో అలా వచ్చిందే ప్యారడైజ్ ధూమావతి… సినిమా కథలో కీలకమైన సవారీ జాతికి కులదేవత…
ధూమావతి అంటేనే ధూమం కదా… అందుకే ఆమెను పూజించే జాతిలో సహజంగా గంజాయి, సిగరెట్, బీడీ… అంటే ధూమపానం అలవాటు… సినిమాలో కూడా ధూమావతి కరుణే నానిని బతికించినట్టు చూపించడం మాటెలా ఉన్నా… సినిమా కథాకాకరకాయ విశ్లేషణలు ఎలా ఉన్నా… సినిమాలో కొన్నిచోట్ల సీన్ల ఇంటెన్సిటీ పెంచడానికి ధూమావతి ఉపయోగపడిందనేది నిజం..!!
Share this Article