.
దురంధర్… ఆపరేషన్ సింధూర్ అనే పేరు స్ఫురించేలా జాగ్రత్తగా పెట్టారు టైటిల్… కథ కూడా అదే… పాకిస్థాన్‌పై భారత గూఢచార సంస్థ ఆపరేషన్… పాకిస్థానీ ఉగ్రఘాతుకాలు…
ఎటొచ్చీ… ఈ సినిమా ఎడిటింగ్ ఫెయిల్యూర్‌కు ఓ ప్రతీకగా మారింది… సినిమా నిడివి ఎంతో తెలుసా..? మొత్తం నిడివి (Total Run Time) సుమారు 3 గంటల 32 నిమిషాలు (3 hours and 32 minutes)…
Ads
సరే, ఇంత నిడివి సినిమాను చూసేంత ఓపిక ప్రజెంట్ జనరేషన్‌కు లేదు… అసలే షార్ట్స్, రీల్స్ శకం ఇది… పోనీ, గ్రిప్పింగుగా అంతసేపు థియేటర్‌లో కూర్చునేలా స్క్రీన్ ప్లే ఉందాంటే అదీ లేదు… అనేకచోట్ల సాగదీత… పర్‌ఫెక్ట్ ఎడిటింగ్ గనుక జరిగి ఉంటే కాస్త బాగుండి, సినిమాకు పాజిటివ్ టాక్ ఏమైనా వచ్చేదేమో…
ఎస్, ఇండియన్ సినిమా ప్రజెంట్ ట్రెండ్‌లలో దేశభక్తి లేదా దైవభక్తి… ఆ కథలకు మీరెంత యాక్షన్ జోడించారనేది వాల్యూ యాడిషన్… ఈ సినిమాలో కూడా దేశభక్తి ప్లస్ యాక్షన్ ప్లస్ స్పై థ్రిల్లర్… కానీ ఎక్కడా పెద్ద థ్రిల్ కలిగించదు… వెరసి రణవీర్ సింగ్ ఆశపడ్డ ఓ పెద్ద హిట్ రాకుండా పోయినట్టే…
ఇండియాపై ఉగ్రఘాతుకాలకు పాల్పడే పాకిస్థాన్‌పై ఓ రహస్య ఆపరేషన్ ఆలోచిస్తాడు ఓ రా అధికారి… ఓ హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న ఓ యువకుడికి శిక్షణ ఇచ్చి పాకిస్థాన్‌కు పంపిస్తారు… ఈ హీరో అక్కడ ఏం చేస్తాడనేది కథ… కథాంశం బాగున్నా సరే దాన్ని ప్రజెంట్ చేయడంలో, ప్రత్యేకించి థ్రిల్లింగ్ సీన్లు పెట్టడంలో ఫెయిల్…

ఎనిమిది చాప్టర్లుగా కథను విభజించినా ఏ చాప్టర్ కూడా ప్రేక్షకుడిని పెద్దగా కనెక్ట్ కాదు… కాకపోతే నటీనటుల బృందం ఈ సినిమాకు బలం… రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా సినిమాను కాస్త నిలబెట్టారు… సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి నటులు తమ పరిధి మేర పాత్రలకు పూర్తి న్యాయం చేశారు…
శశ్వత్ సచ్‌దేవ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు… విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి… దర్శకుడు ఎంచుకున్న లొకేషన్స్, మంచి సినిమాటోగ్రఫీ కారణంగా హాలీవుడ్ స్థాయి నాణ్యత కనిపిస్తుంది… యాక్షన్ సన్నివేశాలను చాలా క్లియర్‌గా, డైనమిక్‌గా చిత్రీకరించారు…
‘ధురంధర్’ అనేది దాని విపరీతమైన నిడివిని భరించగలిగే ప్రేక్షకులకు నచ్చే ఒక శక్తివంతమైన, యాక్షన్ ప్యాక్డ్ స్పై థ్రిల్లర్... ఇందులో నటన, యాక్షన్, సాంకేతిక విలువలు ఉత్తమంగా ఉన్నాయి… పీరియడ్ డ్రామాలు, దేశభక్తి కథలను ఇష్టపడేవారికి మాత్రమే ఇది పర్లేదు…
Share this Article