Srinivas Sarla………………. నిన్న ఒక సెక్రటరీ ఆవేదన విన్న తరువాత నౌకరి చేయాలంటేనే భయంగా ఉంది..
ప్రతి నెల స్టేట్ నుండి స్పెషల్ ఆఫీసర్లు విలేజ్ లు పర్యటించి శానిటేషన్ పనులు చూసి మార్కులు వేస్తారు..
అందులో భాగంగా నిన్న ఒక ఊరికి స్పెషల్ స్క్వాడ్ వచ్చింది…
పాపం, అక్కడ సెక్రటరీ సిబ్బందికి చెప్పి, పొద్దున 7 గంటలకు ఆ రోజు ఆన్ లైన్ లో వచ్చిన ఆ ఊరి ఇంటర్నల్ రోడ్డు సార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఊడిపించింది
9 గంటలకు ఆ ఊరి పొలాల్లో పనిచేసే ఒక ట్రాక్టర్ ఒకటి ఊడ్చిన రోడ్డు మీదగా వెళ్ళింది. అలా వెళ్తున్నప్పుడు ఆ ట్రాక్టర్ టైర్ లకు ఉన్న మట్టి ముద్దలు ఆ రోడ్డు మీద పడ్డాయి
9:30 గంటలకు గొర్రెల మంద ఊడ్చిన అదే రోడ్డు మీదగా వెళ్తూ గొర్రెలు మూకుమ్మడిగా గొద్దెలు వేసాయి..
11 గంటలకు స్పెషల్ స్క్వాడ్ ఆ ఊరికి వచ్చింది. అక్కడ సెక్రటరీని కలిసింది. సెక్రటరీ గారూ ఈరోజు ఆన్ లైన్ ఆప్ లో వచ్చిన రోడ్డు ఊడ్చారా అనడిగింది
సెక్రటరీ: పొద్దున్నే ఊడిపించాను సార్
స్పెషల్ స్క్వాడ్: అయితే పదా వెళ్లి చూద్దాం
సెక్రటరీ: ఓకె సార్
ఇద్దరు కలిసి సీన్ లోకి వెళ్ళేసరికి రోడ్డు మీద మట్టి ముద్దలు గొర్రె గొద్దెలు కనిపించాయి..
అది చూసి సెక్రటరీ గుండె ఆగినంత పని అయింది
స్పెషల్ స్క్వాడ్: ఏంటమ్మా, ఇది పొద్దున్నే ఊడిపించాను అన్నావ్ కదా, ఈ గొర్రె పెండ ఏంటి?
సెక్రటరీ: లేదు సార్, నిజంగానే నేను ఊడిపించాను, గొర్రెలు ఇలా చేస్తాయి అనుకోలేదు
స్పెషల్ స్క్వాడ్: గొర్రె గొద్దెలు వేస్తుంటే నువ్వేం చేసావ్ అమ్మా, చట్టంలో ఉంది కదా రోడ్డు మీద బఱ్ఱె పెండ వేసినా ఫైన్ వేయాలని..
సెక్రటరీ: లేదు సార్, ఇప్పటి నుండి ఇలా జరగకుండా చూసుకుంటా
స్పెషల్ స్క్వాడ్: నీకు శానిటేషన్ మార్క్స్ తగ్గిస్తున్నా… నువ్ సరిగా పని చేయడం లేదు..
సెక్రటరీ: సార్ సార్, ప్లీజ్ వద్దు సార్, నేను నిజంగానే పని చేయిస్తున్న
స్పెషల్ స్క్వాడ్: మళ్ళీ ఇది రిపీట్ అవకుండా చూసుకో, గొర్రెలు పెండ వేయకుండా చూసుకునే బాధ్యత మీదే అని రాసుకుని వెళ్లిపోయాడట..
మొత్తం స్టోరీ విన్నాక…. ఊరు అన్న తరువాత రోడ్డు ఉండదా..? రోడ్డు అన్న తరువాత గొర్రెలు వెళ్ళవా..? గొర్రెలు వెళ్ళినపుడు గొద్దెలు పెట్టవా నాకర్థం కాలే…
ఆయన చెప్పినట్టు ఎవరి మీద ఫైన్ లు వేయాలి..? ఊర్లో నడవడానికి రోడ్డు వేసిన కాంట్రాక్టర్ మీదనా? లేక రోడ్డు మీద నడుస్తూ గొద్దెలు వేసిన గొర్రెల మీదనా? లేక గొర్రెలకు గడ్డి వేసిన యజమాని మీదనా? లేక ఆ గొర్రెలను పంపిణీ చేసిన ప్రభుత్వం మీదనా..
అసలు గొర్రెలు రోడ్డు మీద గొద్దెలు వేయకుండా ఎలా ఆపాలి..? వాటికి ఏమైనా డైపర్లు కట్టాలా లేక సెక్రటరీ చేయి అడ్డం పెట్టాలా..? సరే, ఒక గొర్రె అయితే చేయి పెట్టి అడ్డం పెట్టొచ్చు, వందల గొర్రెలను ఎలా చేయి అడ్డం పెడతారు
గొర్రెలు గొద్దెలు వేస్తున్నా సరే అడ్డుకోకుండా చోద్యం చూసిన పంచాయతీ సెక్రటరీ అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు తప్ప అక్కడ సెక్రటరీ కష్టాన్ని సెక్రటరీ ఆవేదనను పట్టించుకోలేదు
Share this Article