చూశారా ఈ ఫోటో… అంతటి ప్రధాని ఆదానీ భార్యకు ఎలా వంగి దండం పెడుతున్నాడో… ఎలా సాగిలబడిపోయాడో… ఆమె కూడా ఎంత కమాండింగుగా ప్రతినమస్కారం చేస్తున్నదో… అంత అలుసు ఎలా వచ్చింది ఆమెకు..? ఓ పారిశ్రామికవేత్తకు, ఓ కార్పొరేట్ బాసుకు, ఓ ధని వ్యాపారికి ఒక ప్రధాని ఇలా సాగిలబడటం, అదీ ఆయన భార్య ఎదుట కూడా ఇంత విధేయత చూపించడం చీపుగా లేదా..?
……. ఇదుగో ఇలాంటి మెసేజులు ఈమధ్య వాట్సప్ గ్రూపుల్లో బాగా కనిపిస్తున్నాయి… జనానికి చేరుతున్నాయి… అఫ్ కోర్స్, అది చూడగానే యాంటీ-మోడీ సెక్షన్ క్రియేటెడ్ ఫేక్ మెసేజులు అని అర్థమవుతూనే ఉంటయ్… కానీ వాట్సప్ వాడే కోట్ల మందికి అది నిజమో, అబద్ధమో ఎందుకు తెలుస్తుంది… నిజమే అని నమ్మేస్తారు… సేమ్, బీజేపీ అవలంబించే దుష్ట సోషల్ మీడియా టెక్నిక్కులే, తన వ్యతిరేకులు కూడా వాడుతున్నారు…
మచ్చుకు ఇదీ ఓ ఫోటో… దానికి వ్యాఖ్య…
Ads
ముందుగా దీని మీద ఓ క్లారిటీ తీసుకుని, మిగతా అంశాల్లోకి వెళ్దాం… ఆమె గౌతమ్ ఆదానీ భార్య కాదు… ఆమె పేరు దీపిక మండల్… ఇది ఈమధ్య తీసిన ఫోటో కూడా కాదు… 2015 నాటి ఫోటో… అంటే అయిదేళ్ల క్రితం ఫోటో… ఆమె దివ్యజ్యోతి కల్చరల్ ఆర్గనైజేషన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థలో ముఖ్య బాధ్యురాలు… ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది… ఏదో సందర్భంలో, ఏదో కార్యక్రమానికి మోడీని ఆహ్వానించడానికి వచ్చినప్పుడు ఆమె నమస్కారం చేయడం, మోడీ నవ్వుతూ సరదాగా కాస్త వంగి తప్పకుండా మేడమ్ అని ఏదో జవాబు చెబుతుండటం… అంతే… ఇక ఈ ఫోటో గురించి మరిచిపొండి…
ఇంకా క్లారిటీ కావాలా సరే… ఇదుగో గౌతమ్ ఆదానీ, ఆయన భార్య ప్రీతి ఫోటో…
నిజానికి ఆదానీ భార్యకు మోడీ వంగి వంగి నమస్కారాలు చేస్తుంటాడు, మస్తు విధేయత చూపిస్తాడు, ఇదుగో చూడండి, ఈ ఫోటోయే సాక్ష్యం అంటూ ఏడాది క్రితం కూడా సేమ్, ఇప్పట్లాగే వాట్సప్ ప్రచారాలు సాగాయి… ఆ ఫోటో ఓసారి చూడండి… నిజంగానే ఓ మహిళ… ఆమెకు బాగా వంగి దండం పెడుతున్న మోడీ… కానీ..?
కానీ నిజం ఏమిటంటే..? ఆమె పేరు గీతా రుద్రేష్… కర్నాటకలోని తుంకూరు మేయర్ ఆమె… ఈ ఫోటో 2017లో తీసింది… మోడీ ఇస్రోను సందర్శించి, ఢిల్లీకి వెళ్తూ… ఒక ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి తుంకూరు వెళ్లాడు… ప్రధానికి ప్రొటోకాల్ ప్రకారం అక్కడి మేయర్ స్వాగతం చెబుతూ, దండం పెడితే… ప్రతిగా మోడీ కూడా దండం పెడుతున్నాడు… కాస్త నటన ఎక్కువ కదా… అదిలా కనిపిస్తూ ఉంటుందన్నమాట…
ఎదుటివాళ్ల నమస్కారాన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నాను అని చెప్పేందుకు తను కాస్త వంగి ప్రతినమస్కారం చేస్తాడు… అది తన బాడీ లాంగ్వేజీ… మొన్న కేసీయార్, మోడీ పరస్పర దండాల ఫోటో ఇలాంటిదే… ఎస్, బాడీ లాంగ్వేజీ అంటే ఇక్కడ కాస్త చెప్పుకోవాలి… కీలక స్థానాల్లో ఉన్నవాళ్లు ప్రదర్శించాల్సిన బాడీ లాంగ్వేజీ ఏమిటి..? దానికి పద్ధతులుంటాయా..? మోడీ వాటిని పాటిస్తాడా..? మార్చేశాడా..?
ఈ ఫోటో ఓసారి చూడండి… ఇద్దరూ ఏక్కే బడ్కర్ ఏక్ నటులు… ఒకరు ట్రంపు, మరొకరు మోడీ… ఇది కాస్త విశ్లేషించాలి… ఇద్దరు దేశాధినేతలు భేటీ అయినప్పుడు… ఏం మాట్లాడాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, చివరకు షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలో కూడా ఆయా విదేశాంగశాఖలు ప్లాన్ చేస్తుంటాయి… ట్రంపు సాధారణంగా షేక్ హ్యాండ్ ఇస్తూ, ఎదుటివాళ్ల కళ్లల్లోకి నేరుగా చూస్తూ… అమెరికా బలుపునంతా ప్రదర్శిస్తూ… ఆధిపత్య భావనను ఎక్స్పోజ్ చేస్తాడు… అలాగే ప్రధాని మోడీ చేయిపై తన చేయి వేసి… మోడీ చేయి కిందవైపు, ట్రంపు చేయి పైన… సేమ్ ఆధిపత్యాన్ని చూపబోయాడు… మోడీ నవ్వుతూనే, తన మరో చేతిని ట్రంపు చేయిపై వేసి, గట్టిగా అదిమి… ఎహె, ఊరుకోవోయ్, నీకంత సీన్ లేదులే అన్నట్టుగా… ఫ్రెండ్లీగానే ట్రంపు ఆధిపత్య ప్రదర్శనకు కౌంటర్ చేశాడు…
చాలా అమెరికన్ పత్రికల్లోనూ ఈ విశ్లేషణ వచ్చింది… నిజానికి మోడీ సంప్రదాయ షేక్ హ్యాండ్లు గట్రా ఆపేశాడు… చైనా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ సహా పలు ముస్లిం దేశాల అధినేతలను కలిసినప్పుడు కూడా… ఎంచక్కా ఆలింగనం చేసుకోవడం, వెన్నుమీద స్నేహ పూర్వకంగా తట్టడం… అది స్నేహభావాన్ని మరింత ప్రస్ఫుటంగా ప్రదర్శించడం… ఈ ధోరణిపై ప్రపంచంలో ఏ విదేశాంగ శాఖ గానీ, ఏ ముఖ్య అధినేతలు గానీ పెదవి విరవలేదు… మర్యాదగా అంగీకరించారు…
ఇక ఆదానీ భార్య సంగతికొద్దాం… ఎస్, మోడీ అంటేనే తన ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకు అనుకూలం కావచ్చుగాక… ఆదానీ, అంబానీలకు మోడీ మంచి జాన్ దోస్త్ కావచ్చుగాక… అయితేనేం… ఓ ప్రధాని బహిరంగంగా ఆదానీ భార్య కనిపిస్తే వంగి వంగి దండాలు పెట్టి విధేయత ప్రదర్శిస్తాడా..? అంత ఖర్మ మోడీకి ఏం పట్టింది… తనేమీ వ్యక్తిగతంగా ఆస్తులు కూడబెట్టుకునే సగటు క్షుద్ర రాజకీయవేత్త కాదు కదా… మరీ వాళ్ల భార్యల ఎదుట సాగిలపడాల్సిన దురవస్థ తనకు ఏమిటి..? పైగా తను ఈ దేశ ప్రధాని… అంటే సర్వసత్తాక భారతీయ సార్వభౌమత్వం… పెద్ద పెద్ద వాళ్లనే ఆ పదవి దేకదు… ఆఫ్టరాల్ ఆదానీ భార్య, ఆఫ్టరాల్ అంబానీ భార్య…!!
Share this Article